E-Paper
Advertisement

Samsung New 5G Phone: కేవలం రూ.13వేలలోపే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. అదికూడా 7000mAh బ్యాటరీతో..

Samsung New 5G Phone: కేవలం రూ.13వేలలోపే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. అదికూడా 7000mAh బ్యాటరీతో..

Samsung New 5G Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో పోటీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి కంపెనీ ఒకదానికంటే ఒకటి బెటర్ ఆఫర్స్ తీసుకు వస్తోంది. అలాంటి సమయంలో శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొత్త మోడల్ ని మార్కెట్ లోకి పంపడానికి సామ్‌సంగ్ సిద్ధమైంది. బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేస్తూ పవర్‌ఫుల్ కెమేరా, హెవీ బ్యాటరీ, మెరుగైన పర్‌ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్ కలిపిన కంప్లీట్ ప్యాకేజీగా ఈ కొత్త గెలాక్సీ మోడల్ వస్తోంది. ప్రారంభ లుక్స్ చూసిన వాళ్ళంతా ఇది అసలు బడ్జెట్ ఫోన్ అని కొనుగోలు చేసేందుకు లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు.

డిజైన్.. ప్రిమియం ఫినిష్

ఫోన్‌ని చేతిలో పట్టుకున్నప్పుడు ఫీల్ అయ్యే ప్రిమియం ఫినిష్ ఈ డివైస్‌కి ఆకర్షణ. బాడీ నిర్మాణం స్లిమ్‌గా, ఇంకా హ్యాండ్‌లో పట్టుకున్నప్పుడు బరువు ఎక్కువగా అనిపించకుండా డిజైన్ చేశారు. కెమెరా వెనుక భాగంలో క్లియర్‌‌గా కనిపించేలా ఎలిగెంట్ స్టైల్‌లో సెటప్ చేశారు. ఫోన్ బయటి డిజైన్ చూస్తే ఫస్ట్ లుక్ లోనే గెలాక్సీ బ్రాండ్ స్టాండర్డ్‌ని గుర్తు చేస్తుంది.

డిస్‌ప్లే.. టచ్ రెస్పాన్స్ స్మూత్‌

డిస్‌ప్లే భాగంలో శామ్‌సంగ్ ఎప్పట్లాగే బెస్ట్ విజువల్ అనుభవం ఇవ్వగలిగే అమోలేడ్ ప్యానెల్‌ని ఉపయోగించినట్లు సమాచారం. ఎండలో ఎక్కువగా ఉన్న కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా బ్రైట్‌నెస్ లెవెల్స్ బాగా మేనేజ్ చేశారు. సినిమాలు, రీల్స్, గేమింగ్ ఏది చూసినా రంగులను బ్యాలెన్స్ చేస్తూ.. కళ్ళకు నచ్చేలా రిచ్‌గా కనిపించే విధంగా డిజైన్ చేశారు. టచ్ రెస్పాన్స్ కూడా స్మూత్‌గా పనిచేస్తుంది.

120X జూమ్ కెమెరా

ఈ కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ మోడల్‌లో ప్రధాన ఆకర్షణ 200ఎంపి కెమెరా. ఫోటోలు తీసే వాళ్ళకి ఇది ఒక పెద్ద బోనస్ లాంటిది. డే టైమ్ లో వివరాలు స్పష్టంగా, కలర్స్ సహజంగా వస్తాయి. నైట్ మోడ్ లో కూడా నాయిస్ తక్కువగా ఉండే క్లీన్ ఫోటోలు రాగలవు. దీంట్లో ఉన్న 120X జూమ్ దూరంలో ఉన్న వస్తువుల్ని దగ్గరగా ఉన్నట్టుగా క్యాప్చర్ చేసే విధంగా రూపొందించారు. ఫ్రంట్ కెమెరా కూడా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కి సూట్ అయ్యేలా బాగానే ఆప్టిమైజ్ చేశారు.

Also Read: Vivo 5G Smartphone: ప్రీమియం ఫీచర్లతో వివో ఎక్స్200ఎఫ్‌ఈ ఎంట్రీ… ఈ ఫోన్‌కి బ్యాటరీనే హైలెట్ రా మావా..

మల్టీటాస్కింగ్ పర్‌ఫార్మెన్స్

ఫోన్‌లో వాడిన ప్రాసెసర్ గేమింగ్, వీడియో ఎడిటింగ్, హేవీ అప్లికేషన్స్ అన్నింటిని స్మూత్‌గా రన్ చేయగలదు. లాగ్ అనిపించకుండా మల్టీటాస్కింగ్ కూడా సులభంగా చేయవచ్చు. 5జి స్పీడ్ వల్ల డౌన్‌లోడ్స్, స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ అన్నీ స్పీడ్‌గా జరుగుతాయి. ఫోన్ వేడెక్కుతుందని సమస్య కూడా ఉండకుండా థర్మల్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేశారు.

7000mAh బ్యాటరీ

ఈ ఫోన్ యొక్క మెయిన్ అట్రాక్షన్ 7000mAh బ్యాటరీ. సాధారణ వాడకంలో ఈ బ్యాటరీ రెండవ రోజు వరకూ కూడా ఉపయోగించుకోవచ్చు ఈ లాంగ్ లాస్ట్ బ్యాటరీ కారణంగా రోజంతా ఛార్జ్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. దీంట్లో ఇచ్చిన 65W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల చాలా తక్కువ టైమ్ లో ఉపయోగించడానికి సిద్ధంగా ఉండే బ్యాటరీ లెవెల్ అందుతుంది. ఫోన్ లో తాజా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పాటు వన్ యూఐ అనుభవం ఇవ్వడం దీని ప్రత్యేకత. యూజర్ ఇంటర్‌ఫేస్ సింపుల్‌గా, స్మూత్‌గా పని చేస్తుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్, ఫీచర్ అప్‌డేట్స్ కూడా రెగ్యులర్‌గా అందుతాయి.

ఇండియా లో ధర

ఈ శామ్‌సంగ్ గెలాక్సీ మోడల్ ధర ఇండియా లో రూ.12499 గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత కెమెరా పవర్, హెవీ బ్యాటరీ ఇవ్వడం మార్కెట్‌ని కచ్చితంగా షాక్ లోకి నెడుతుంది. ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ చాలా త్వరలో జరగబోతోంది. ఆన్‌లైన్ సేల్ కూడా వెంటనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటి సేల్ లోనే పెద్ద డిమాండ్ రావచ్చని అంచనాలు ఉన్నాయి.

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×