E-Paper
Advertisement

Top 20 News: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్, టేకాఫ్‌కు సిద్ధం.. విమానంలో అగ్ని ప్రమాాదం

Top 20 News: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్, టేకాఫ్‌కు సిద్ధం.. విమానంలో అగ్ని ప్రమాాదం

1. గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖ అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు

గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖ అతిథులను స్వాగతించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది . అతిథులకు అందించాల్సిన గిఫ్ట్‌లను స్థానిక కళలను ప్రతి బింబించేలా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతులను బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. గౌతమ బుద్ధుని ప్రత్యేక ఫిలిగ్రీ ప్రతిమలను రూపొందించడానికి కళాకారులు గత వారం రోజులుగా నిరంతరం పని చేశారు.

2. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, తనను బండ కట్టి నాగార్జున సాగర్‌లో వేస్తానన్న రేవంత్ వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకొచ్చి రంగనాయక సాగర్‌లో మునిగితే కాళేశ్వరం కూలిందా, లేదా అనేది తేలిపోతుందని, మునిగిపోతే కూలలేదని, తేలితే కూలిందని అనుకుందాం అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

3. పొంగులేటి సుధాకర్ రెడ్డి హాట్ కామెంట్స్

బీజేపీ సీనియర్ లీడర్, తమిళనాడు, కర్ణాటక సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రోటోకాల్ ఏంటో తనకే తెలియదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కొంచెం టైం ఇస్తే బాగుండు కాదా అంటూ చెప్పుకొచ్చారు. ప్రజావంచన పేరుతో హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో మహాధర్నాలో ఈ కామెంట్స్‌ చేశారు.

4. ఎక్సైజ్ సూపరిండెంట్‌కు ఫిర్యాదు

జూబ్లీహిల్స్ డివిజన్లో నిబంధనలకు విరుద్ధంగా గుడి, బడికి దగ్గరగా ఏర్పాటు చేస్తున్న నూతన వైన్స్ షాప్‌ను తరలించాలని కాలనీవాసులు. ఎక్సైజ్ సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, తక్షణమే తరలించాలని వారు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఈ విషయంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు‌ ఫిర్యాదు చేయనున్నట్లు కాలనీ వాసులు తెలిపారు.

5. బీజేపీ మహాధర్నాపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

బీజేపీ మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణకు ఏమీ చేయని కిషన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ నిర్వాకం వల్ల రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పగించబడిందని గౌడ్ తెలిపారు.

6. నిర్వాహకుల నిర్లక్ష్యం.. విద్యార్థి బలి

గురుకుల విద్యాలయ వసతి నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి ప్రాణం బలైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గురుకుల పాఠశాలలో జరిగింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన స్నానానికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి అజయ్ గల్లంతై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టంకు తరలించారు.

7. సర్పంచ్ ఎన్నకల ప్రచారంలో ఎమ్మెల్యే వేముల

నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ, అభివృద్ధిపై దృష్టి పెడుతోందన్నారు. మహిళలకు పెద్ద పీట వేస్తూ వాళ్ళని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు.

8. మహాధర్నాలో రాకేష్ రెడ్డి ఆవేదన

రాష్ట్ర నాయకత్వంపై.. బీజేపీ MLA పైడి రాకేష్ రెడ్డి చురకలంటించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన మహాధర్నాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకెన్నాళ్లు పోరాటాలు, ధర్నాలు, నిరసనలంటూ నిలదీశారు. తెలంగా ణ బీజేపీ ఫార్మెట్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే అధికారం కలగానే మిగిలిపోతుందన్నారు. సరైన పోరాటం చేసేవారిని ప్రోత్సహించాలన్నారు రాకేష్ రెడ్డి.

9. రంగారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం.. గ్యాస్ లీక్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో భారీ ప్రమాదం జరిగింది. వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మాధవి ఠాగూర్ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన మాధవి ఠాగూర్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

10. మంత్రి కాకాణి రియాక్ట్

నకిలీ మద్యం కేసులో కీలక డాక్యుమెంట్లు మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ప్రతి చిన్న రాజకీయ విమర్శలకు స్పందించనని చెప్పారు. అసలు కోర్టులో ఫైల్స్ మిస్ అయితే..మొత్తం ఫైల్స్ మాయం చేస్తాం గాని.. కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే ఎందుకు మిస్ చేస్తాం అని ప్రశ్నించారు.

11. శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శిచుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి సురేష్ రెడ్డి, మాజీమంత్రి పేర్ని నాని, ఎంఎల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెలంగాణ MLA గంగుల కమలాకర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టువస్రాలుతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు..

12. చర్చ్ నిర్వహణపై హిందూ సంఘాలు ఆందోళన

కాకినాడ జిల్లా కొత్తపేటలోని అనధికారిక చర్చ్ నిర్వహణపై స్థానికులు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. జై శ్రీరామ్ నినాదాలతో చర్చ్‌ను ముట్టడించారు హిందువులు. రంగంలోకి దిగిన ఆర్డీఓ మల్లి బాబు అనుమతులు లేని చర్చ్‌ను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. దీంతో అక్కడి నుంచి హిందూ సంఘాలు వెన్ను తిరిగారు.

13. హెచ్ఐవి బాధితుల పట్ల మానవత్వంతో మెలగాలని మంత్రి పిలుపు

హెచ్ఐవి బాధితుల పట్ల సమాజంలో వివక్ష చూపకుండా.. మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని కోరారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

14. బోర్డుపై బూతు బొమ్మలు.. చిన్నపిల్లలపై వైస్‌ప్రిన్సిపల్ ప్రతాపం

తిరుపతి జిల్లా, ఓజిలి ఏకలవ్య మోడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్, శశి కుమార్ అనే విద్యార్థిని రక్తం వచ్చేలా కొట్టారు. బోర్డుపై అసభ్యకర బొమ్మలు గీసినందుకు కొట్టినట్లు వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు.

15. ప్రచారం జోరుగా

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులు తాము గెలిస్తే చేసే అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది.

16. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌.. రామానుజన్

నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డలోని అహోబిలం దేవస్థానానికి రామానుజన్ కొత్త చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు దేవస్థాన సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు, సిబ్బంది, గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.

17. టేకాఫ్‌కు సిద్ధం.. విమానంలో అగ్ని ప్రమాాదం

టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా, ఓ విమానంలో అగ్నిప్రమాదం సంభవించి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

18. భారీ భూప్రకంపనలు

కెనడా-అలాస్కా సరిహద్దు ప్రాంతంలో ఇవాళ భారీ భూప్రకంపనలు సంభవించాయి. యూకోన్‌లో సంభవించిన ఈ ప్రకంపనలు వైట్ హార్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించేలా చేశాయి. భూకంప కేంద్రం ఉత్తర జెనీవాకు 230 మైళ్ల దూరంలో ఉంది. ప్రజలు భయాందోళన చెందారు, అయితే ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

19. క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్

క్రికెటర్ స్మృతి మందాన పెళ్లిలో ట్విస్ట్. తన వివాహం రద్దైనట్లు ప్రకటించింది స్మృతి. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో ప్రకటించింది. ఇటీవలె పలాష్ ముచ్చల్‌తో స్మృతి ఎంగేజ్‌మెంట్ జరిగింది. నవంబర్ 23న మ్యారేజ్ జరగాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఆమె తండ్రి హాస్పిటల్‌లో అడ్మిట్ కావడంతో పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు ఏకంగా క్యాన్సిల్ అవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.

20. సాంగ్ విడుదల

మన శంకర వరప్రసాద్‌ గారుగా వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలో తాజాగా.. శశిరేఖ అనే సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. సోమవారం రిలీజ్‌ చేయనున్నట్లు తొలుత ప్రకటించినా.. అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఒక రోజు ముందుగానే తీసుకొచ్చింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×