E-Paper
Advertisement

ఎవరూ ఊహించని ఆఫర్.. ఏకంగా రూ.20 వేలు తగ్గిన Galaxy S24 FE ధర.. ఎలా కొనాలంటే?

ఎవరూ ఊహించని ఆఫర్.. ఏకంగా రూ.20 వేలు తగ్గిన Galaxy S24 FE ధర.. ఎలా కొనాలంటే?
Advertisement

Galaxy S24 FE Price Drop: తక్కువ బడ్జెట్‌లో మంచి ప్రీమియం శాంసంగ్ ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇంత కంటే మంచి సమయం రాదనే చెప్పాలి. శాంసంగ్ కంపెనీ Galaxy S24 FE మోడల్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ ఫోన్ అసలు ధర రూ.59,999గా ఉండేది. కానీ ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ.20,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనివల్ల ఈ ఫోన్ కేవలం రూ.39,999కే సొంతం చేసుకునే అవకాశం దక్కింది.

కెమెరా ప్రత్యేకతలు:

ఈ ధరలో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను అందించడం విశేషం. ముఖ్యంగా దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనితో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 3 మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఇచ్చారు. రీల్స్ చేసుకోవడానికి, అందమైన ల్యాండ్‌స్కేప్ ఫొటోలు తీయడానికి ఈ కెమెరాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 10 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.

Advertisement

Also Read: ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్.. iPhone 19ను స్కిప్ చేసి నేరుగా iPhone 20 లాంచ్!

బ్యాటరీ లైఫ్ ఎంతంటే?

బిగ్ స్క్రీన్ ఇష్టపడేవారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. ఇందులో 6.7 ఇంచుల డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి.. ఫోన్ వాడుతున్నప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. శాంసంగ్ సొంత ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుంది. దీనివల్ల గేమింగ్ ఆడినా, మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వదు. అలాగే రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేలా 4700mAh బ్యాటరీని కూడా ఇందులో అమర్చారు.

ఈ డీల్ ఎలా పొందాలి?

Advertisement

ఈ అద్భుతమైన ఆఫర్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. మరో రూ.2,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను రూ.37,999కే దక్కించుకోవచ్చు. ఒకేసారి డబ్బులు కట్టలేని వారి కోసం ఎలాంటి అదనపు వడ్డీ లేని నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అలాగే మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరికొంత ధర తగ్గించుకునే వీలుంది.

Also Read: ఈ లుక్‌కి ఎవరైనా పడిపోవాల్సిందే.. క్రేజీ కలర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో Motorola కొత్త ఫోన్!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×