E-Paper
Advertisement

ట్రంప్ చుట్టూ మృత్యువలయం.. ఐదు నెలల్లో 3 దాడులు.. అసలు సూత్రధారి ఎవరు?

ట్రంప్ చుట్టూ మృత్యువలయం.. ఐదు నెలల్లో 3 దాడులు.. అసలు సూత్రధారి ఎవరు?
Advertisement

Donald Trump: 2026 మొదలై ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. కేవలం ఐదు నెలల్లోనే అమెరికా అధ్యక్షుడిపై మూడుసార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇదేదో అల్లాటప్పా గల్లీ లీడర్‌పై ఇలాంటి మర్డర్ అటెంప్ట్స్ జరిగాయంటే.. ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. ఇంత సెన్సేషన్ కూడా అయ్యేది కాదు. కానీ అక్కడున్నది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకే.. వరల్డ్ మొత్తం ఇంతలా షేక్ అవుతోంది.

ట్రంప్ సెక్యూరిటీకి వరుసగా షాక్‌లు

మొన్నటికి మొన్న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగిన కాల్పులు, యూఎస్ సీక్రెట్ సర్వీస్ ట్రంప్‌ని సురక్షితంగా తరలించిన వీడియోలు మొత్తం వరల్డ్ చూసింది. దానిని ఇంకా మర్చిపోకముందే.. వైట్‌హౌస్‌ సమీపంలో మళ్లీ కాల్పులు జరగడం సంచలనంగా మారింది. కొన్ని నెలల క్రితమే ఓ దుండగుడు ఇంధనం క్యాన్లతో ట్రంప్ నివాసంలోకి చొరబడటం తీవ్ర కలకలం రేపింది. అప్పుడు అధ్యక్షుడికి ఏమీ అవకుండా భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపేశారు. అంతకంటే ముందు ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయ్. అప్పుడు అదృష్టవశాత్తూ.. ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ తరహా ఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుండటమే టెన్షన్ పెడుతోంది. మరీ ముఖ్యంగా.. ట్రంప్ సెక్యూరిటీపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

ట్రంప్ టార్గెట్‌గా భారీ కుట్ర?

Advertisement

ఈసారి వైట్‌హౌస్ దగ్గర ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. అత్యంత భద్రత ఉండే వైట్‌హౌస్ ప్రాంతంలోకి చొరబడిన దుండగుడు ఏకంగా 20 రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. ఆ టైమ్‌లో.. ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్‌లోనే ఉన్నారు. దాంతో.. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ భద్రతా సిబ్బంది వెంటనే అతనిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. వైట్‌హౌస్ పరిసరాల్లోనే ఇంత దుస్సాహసానికి ఒడిగట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్‌పై జరిగిన పాత దాడులతో పాటు లేటెస్ట్ వైట్‌హౌస్ కాల్పుల ఘటనల వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అనే కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. నిందితుడిని నసీర్ బెస్ట్‌గా గుర్తించారు.

వైట్‌హౌస్ కాల్పులపై దర్యాప్తు

కొన్నేళ్లుగా అతడు వైట్ హౌస్ సమీపంలోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ల దగ్గర చాలాసార్లు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు తెలిపారు. ఏడాది క్రితం రెండు సార్లు వైట్‌హౌస్‌ సమీపంలోని నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. దాంతో.. ఆ ప్రాంగణానికి దూరంగా ఉండాలని కోర్టు అతడికి ఉత్తర్వులు జారీ చేసిందనే ప్రచారం కూడా సాగుతోంది. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే, ఈ దాడి వెనుక ఏదైనా కుట్ర కోణం దాగుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.

ట్రంప్‌ను వెంటాడుతున్న ప్రమాదం

Advertisement

గత ఏప్రిల్‌లోనే వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఇతర ఉన్నతాధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రమాదం తప్పింది. గత ఫిబ్రవరిలోనూ ట్రంప్‌ రిసార్ట్‌లోకి చొరబడిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపేశారు. అతని దగ్గర గ్యాస్ క్యాన్, షాట్ గన్ ఉన్నాయి. గత ఎన్నికల ప్రచార సమయంలోనూ.. పెన్సిల్వేనియాలో ఓ దుండగుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అప్పుడు.. బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లిపోయింది. స్వల్ప గాయాలతో ట్రంప్ ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఇప్పుడు మరోసారి దాడి జరగడంతో.. ట్రంప్‌కు నిజంగానే ముప్పు పొంచి ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయ్.

ట్రంప్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడంటే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ, ట్రంప్‌పై వరుసగా జరుగుతున్న దాడి ప్రయత్నాలు.. అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారాయి. ఒకసారి జరిగితే ప్రమాదం.. రెండోసారి జరిగితే భద్రతా లోపం.. కానీ పదే పదే అదే జరుగుతుంటే? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లని తొలిచేస్తోంది. అత్యున్నత స్థాయి భద్రత ఉండే సీక్రెట్ సర్వీస్ నిఘా నీడలో ఉండే ఒక దేశాధినేతపై.. వరుసగా గురిపెట్టడమేంటి? ట్రంప్‌నే టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు కథేంటన్నదే బిగ్ సస్పెన్స్‌గా మారింది. ఈ వరుస పరిణామాలు.. అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయ్.

సీక్రెట్ సర్వీస్ ప్రతిష్టకు భారీ దెబ్బ

అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించే సీక్రెట్ సర్వీస్‌కి.. ప్రపంచంలోనే అత్యుత్తమ రక్షణ దళంగా పేరుంది. కానీ, ట్రంప్ విషయంలో పదే పదే ఫెయిలవుతోందనే అపవాదుని మూటగట్టుకుంటోంది. పెన్సిల్వేనియా ర్యాలీలో.. కొన్ని మిల్లీమీటర్ల తేడాతో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. లైవ్‌లో అంతా చూస్తుండగానే జరిగిన ఈ దాడి.. అమెరికా రక్షణ వ్యవస్థ పునాదులను కదిలించింది. ఇది మరువకముందే.. ఫ్లోరిడాలోని ఆయన గోల్ఫ్ క్లబ్ సమీపంలో రైఫిల్‌తో పొంచి ఉన్న మరో నిందితుడు దొరకడం కలకలం రేపింది. ఇవే కాకుండా.. ర్యాలీల్లో అనుమానాస్పద వ్యక్తులు పట్టుబడటం, డ్రోన్ల సంచారం, నిరంతరం ఇంటలిజెన్స్ అలర్ట్స్ రావడం చూస్తుంటే.. ట్రంప్ చుట్టూ భద్రతా వలయం ఎంత బలహీనంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.

ట్రంప్ ర్యాలీలే పెద్ద సవాలా?

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భద్రతా సంస్థపై వరుసగా ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. పెన్సిల్వేనియా దాడి తర్వాత సీక్రెట్ సర్వీస్ చీఫ్ రాజీనామా చేయాల్సి రావడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, స్థానిక పోలీసులకు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏఐ యుగంలోనూ.. డ్రోన్లు, లాంగ్ రేంజ్ స్నైపర్లని గుర్తించడంలో.. పాత పద్ధతులోనే నమ్ముకోవడం పెద్ద మైనస్ అవుతోంది. ట్రంప్ ఎప్పుడూ ప్రజల మధ్య ఉండటానికి, ఓపెన్ గ్రౌండ్స్‌లో వేలాది మందితో ర్యాలీలు నిర్వహించడానికి ఇష్టపడతారు. ఇదే భద్రతా సిబ్బందికి కూడా పెద్ద సవాలుగా మారుతోందనే చర్చ ఉంది.

అధ్యక్షుడి భద్రతకే దిక్కులేదా?

అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావించే డొనాల్డ్ ట్రంప్‌పై.. వరుసగా జరుగుతున్న హత్యా ప్రయత్నాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2024 జులైలో పెన్సిల్వేనియా ర్యాలీలో ఆయనపై జరిగిన తొలి కాల్పుల ఘటన నుంచి.. ఇప్పుడు వైట్ హౌస్ దగ్గర జరిగిన కాల్పుల కలకలం వరకు ప్రతీది ఆందోళనకరమే. ఈ వరుస ఘటనలు చూశాక ప్రతి ఒక్కరిలోనూ ఒక్కటే ప్రశ్న తలెత్తుతోంది.. అమెరికా అధ్యక్షుడి భద్రతకే దిక్కులేదా? అని! అయితే, కేవలం సెక్యూరిటీ వైఫల్యాలనే కాకుండా, దీని వెనుక ఉన్న సామాజిక, రాజకీయ కారణాలను విశ్లేషిస్తే.. అమెరికా సమాజంలో పేరుకుపోతున్న తీవ్రమైన నిరాశ, పొలిటికల్ పోలరైజేషన్ దీనికి మూలకారణాలని స్పష్టమవుతోంది. ఇందుకు.. అమెరికాలో ప్రస్తుతం ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవాలి.

ట్రంప్ రాజకీయాలపై తీవ్ర చర్చ

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాత్రమే కాదు. ఆ దేశ రాజకీయ నాయకుడు కూడా! ప్రస్తుతం అమెరికా సమాజం.. ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందనే చర్చ జరుగుతోంది. న్యూట్రల్‌గా ఆలోచించే ధోరణి ప్రజల్లో తగ్గింది. ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ పాలసీలు, ఘాటు కామెంట్లు, వలసదారులపై ఆయన చూపే వైఖరి.. ఓ వర్గానికి విపరీతమైన దేశభక్తిని కలిగిస్తే.. మరో వర్గంలో అదే స్థాయిలో ద్వేషాన్ని పెంచుతున్నాయ్. ఈ విపరీతమైన ద్వేషమే.. కొందరిని హింస వైపు ప్రేరేపిస్తోందనే చర్చ జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ట్రెండ్స్.. ట్రంప్‌ని ప్రజాస్వామ్యానికి ఓ పెద్ద ముప్పుగా చిత్రీకరిస్తూ వస్తున్నాయ్. నిత్యం ఇలాంటి నెగటివ్ నెరేటివ్‌లని చూసే మానసిక క్షోభ ఉన్న వ్యక్తులు, తీవ్రవాద ధోరణి కలిగిన వారు ట్రంప్‌ను అడ్డుకుంటే తాము దేశాన్ని రక్షించిన హీరోలమవుతామనే భ్రమలో పడి.. ఇలాంటి దాడులకు తెగబడుతున్నారనే చర్చ ఉంది.

ట్రంప్‌పై ముప్పు వెనుక కారణాలివేనా?

ట్రంప్ ప్రత్యర్థులు ఆయన్ని ప్రజాస్వామ్యానికి ముప్పుగా, హిట్లర్‌తో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ కూడా తన ప్రత్యర్థులను తీవ్రంగా దూషించడం వల్ల ఇరువర్గాల మధ్య పొలిటికల్ టెంపరేచర్ గరిష్ఠస్థాయికి చేరింది. ఈ క్రమంలో.. మానసికంగా అస్థిరంగా ఉన్న కొందరు వ్యక్తులు, తామేదో సమాజాన్ని రక్షించే వాళ్లమనే భ్రమతో ఇలాంటి దాడులకు తెగబడుతున్నారనే చర్చ సాగుతోంది. ట్రంప్ విదేశాంగ విధానాలు కూడా దూకుడుగానే ఉంటాయి. చైనాపై ట్రేడ్ వార్, ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నమైన వైఖరి, ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలు, నాటో దేశాలపై ఒత్తిడి లాంటివన్నీ.. అంతర్జాతీయంగా ఆయనకు శత్రువులను పెంచాయి.

ప్రపంచానికే ప్రమాదమా?

అంతర్గత శత్రువులతో పాటు విదేశీ శక్తుల ప్రోద్బలం కూడా ఈ దాడుల వెనుక ఉండే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అమెరికా అధ్యక్షుడే సురక్షితంగా లేకపోతే.. అది ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే దీనిపై అంతర్జాతీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలహీనపడిందో, ఆ దేశంలో అంతర్గత శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పడానికి.. ఈ దాడులను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. ఒకసారి జరిగితే ప్రమాదం కావచ్చు కానీ, పదే పదే జరుగుతుంటే అది కచ్చితంగా వ్యవస్థాగత వైఫల్యమే. ఈ దాడులు.. ప్రపంచంలోనే అత్యున్నత రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ సామర్థ్యాన్ని ఓ ప్రశ్నార్థకంగా మార్చాయ్.

సీక్రెట్ సర్వీస్‌కు పెరుగుతున్న సవాళ్లు

ఈ కాలంలో.. ఒంటరిగా దాడులకు పాల్పడేవాళ్లు పెరిగారు. వీరు ఎలాంటి ముఠాలతో సంబంధం లేకుండా, సోషల్ మీడియా ద్వారా ప్రభావితమై, రహస్యంగా వ్యూహాలు రచిస్తారు. పైగా.. డ్రోన్ల లాంటి సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. దాంతో.. భద్రతా సిబ్బంది వీళ్లని గుర్తించడం కష్టమవుతోంది. అధ్యక్షుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర కీలక అధికారులకు రక్షణ కల్పించడంలో సీక్రెట్ సర్వీస్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరహా దాడులు.. ప్రస్తుత అమెరికా సామాజిక సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. అమెరికా ప్రజల్లో, యువతలో ఒక రకమైన నిరాశ, అసంతృప్తి పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం, వలసల సమస్య, నిరుద్యోగం, విచ్ఛిన్నమవుతున్న హెల్త్ కేర్ సిస్టమ్‌ల వల్ల సగటు అమెరికన్లలో అభద్రతా భావం పెరిగింది.

దాడుల వెనుక కొత్త కోణం

ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తమ సమస్యలను పరిష్కరించలేకపోతోందనే కోపం వారిలో కనిపిస్తోంది. పైగా.. యూఎస్‌లో గన్ కల్చర్ కూడా ఈ దాడులకు మరో కారణం. అమెరికాలో చాలా ఈజీగా తుపాకులు లభించడం.. హింసకు ప్రధాన ఆయుధంగా మారుతోంది. చిన్నపాటి అసంతృప్తి ఉన్నా, ఆయుధాలు చేతికి అందుబాటులో ఉండటంతో.. అది ప్రాణాంతక దాడులకు దారితీస్తోంది. ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న దుష్ప్రచారం, ద్వేషపూరిత కంటెంట్ యువతను తప్పుదోవ పట్టిస్తోంది. దాడులకు పాల్పడిన నిందితుల ప్రొఫైల్స్ చూస్తే, వారు వివిధ రాజకీయ, మతపరమైన సిద్ధాంతాల తప్పుడు ప్రచారాలకు ప్రభావితమై.. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ శాంతికి హెచ్చరికా?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై జరుగుతున్న వరుస దాడులు.. కేవలం భద్రతా సంస్థల వైఫల్యం మాత్రమే కాదు, అమెరికా రాజకీయ, సామాజిక వ్యవస్థలోని లోపాలని ఎత్తి చూపుతున్న ఘటనలు. ట్రంప్ వివాదాస్పద వ్యవహారశైలి, ప్రత్యర్థుల తీవ్రమైన విమర్శలు సమాజంలో ద్వేషాన్ని పెంచగా, అమెరికాలోని గన్ కల్చర్, సొసైటీలోని ఫ్రస్టేషన్ దానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికాలో పొలిటికల్ టెంపరేచర్ తగ్గకపోతే.. ఈ విధమైన రాజకీయ హింస ఆ దేశ భవిష్యత్తుని, ప్రజాస్వామ్య పునాదులను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇది.. అమెరికా భవిష్యత్తు, ప్రపంచ శాంతికి హెచ్చరిక లాంటివి. ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఇది మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగే అవకాశముంది.

Also Read: చంద్రబాబు స్పీడ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్. బుల్లెట్ వేగంతో మారుతున్న ఆంధ్రప్రదేశ్!

Stroy  by: Anup, Big Tv

Related News

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×