E-Paper
Advertisement

Samsung Galaxy S25 Series Launch Date : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ వచ్చేస్తుందోచ్.. లాంఛ్, ప్రీ బుకింగ్స్ డేట్స్ లీక్

Samsung Galaxy S25 Series Launch Date : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ వచ్చేస్తుందోచ్.. లాంఛ్, ప్రీ బుకింగ్స్ డేట్స్ లీక్
Advertisement

Samsung Galaxy S25 Launch Date :  స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ త్వరలోనే అదిరిపోయే ఫీచర్స్‌తో మరో కొత్త మెుబైల్ సిరీస్ ను మార్కెట్లోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. Samsung Galaxy S25 సిరీస్ పేరుతో రాబోతున్న ఈ మెుబైల్స్.. వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానున్నాయని ఇది వరకే తెలిసినప్పటికీ…  తాజాగా స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ చెబుతూ ఈ మెుబైల్ లాంఛ్ డేట్ ను దక్షిణ కొరియాకు చెందిన న్యూస్ సంస్థ వెల్లడించింది.

Galaxy S25 సిరీస్ మెుబైల్స్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి లాంఛ్ కానున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ది ఫైనాన్షియల్ న్యూస్ తెలిపిన నివేదిక ప్రకారం.. Samsung Galaxy S25 సిరీస్ మెుబైల్స్…  గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో భాగంగా జనవరి 23న రాబోతున్నాయని తెలిపింది. ఇక ఈ Samsung Galaxy Unpacked ఈవెంట్ USAలోని శాన్ ఫ్రాన్సిసోలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రీ ఆర్డర్స్ సైతం ఇదే రోజు మెుదలు కానున్నట్లు తెలుస్తుంది. అఫీషియల్ స్టోర్స్ లోకి జనవరి 31న రాబోతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.

Advertisement

గత ఏడాది Samsung Galaxy S24 సిరీస్ జనవరి 17న లాంఛ్ అయింది. కాగా Samsung Galaxy S25 సిరీస్ లో భాగంగా.. Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా రాబోతున్నాయి. ఇక Galaxy S25 స్లిమ్ మెుబైల్ సైతం లాంఛ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇక సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ మెుబైల్స్ పై సామ్ సాంగ్ ఇప్పటివరకూ ఎటువంటి అధికార ప్రకటన చేయనప్పటికీ… ఆన్‌లైన్‌లో ఈ ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఇక సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఫోన్‌లో ఫీచర్స్ అప్డేట్ వెర్షన్ లో రాబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అధునాతన AI ఫీచర్స్ తో ఈ మెుబైల్ రాబోతుంది. Galaxy S25 లైనప్‌ లో రాబోతున్న Galaxy S25 Slim మోడల్ మెుబైల్స్ ఐఫోన్స్ కు పోటీ ఇవ్వనున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మెుబైల్ US వెర్షన్‌తో మోడల్ నంబర్ SM-S937 ప్రాసెసర్ కింద పనిచేయనున్నట్లు తెలుస్తుంది. హై ఇమేజ్ క్వాలిటీతో 200MP కెమెరా ఇందులో ఉండే అవకాశం ఉందని… ఇక Galaxy S25 అల్ట్రాలో 200MP మెుయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి.

ఇందులో 5x ఆప్టికల్ జూమ్‌తో సూపర్ టెలిఫోటో కెమెరా సైతం రాబోతుంది. ఇక Galaxy S25 స్లిమ్ మెుబైస్ 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాతో రాబోతుందన్నట్లు తెలుస్తుంది. Galaxy S25+ మెుబైల్లో ఉన్నట్లే 200MP కెమెరా ఉండనుంది. 5000mah బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ప్రాసెసర్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో పలు వేరియంట్స్ తో ఈ మెుబైల్ రాబోతుంది.

ALSO READ : LED డిస్‌ప్లేతో పవర్​ బ్యాంక్​ – సింగిల్​ ఛార్జ్​తో ఐఫోన్​, శాంసంగ్​కు 5 సార్లు ఛార్జింగ్ పెట్టొచ్చు!

Related News

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Big Stories

Advertisement
×