Boult Amp Vault V10, V20 Power Banks : ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ బౌల్ట్ (Boult) తాజాగా రెండు పవర్ బ్యాంక్‌లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. Boult Amp Vault V10, V20 పేర్లతో వీటిని లాంఛ్ చేసింది. తక్కువ ధరలోనే అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్, ప్రీమియం డిజైన్‌తో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది! దూర ప్రాంత ప్రయాణాల్లో సౌకర్యవంతంగా వీటిని తీసుకెళ్లేందుకు వీలుగా రూపొందించినట్లు సంస్థ చెబుతోంది. ఒకేసారి వివిధ డివైజ్‌లను ఛార్జింగ్ చేసేందుకు అనుకూలంగా ఇవి ఉంటాయని తెలిపింది. ఓ సారి ఈ పవర్ బ్యాంక్‌ల ధర, సామర్థ్యం సహా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
AmpVault V10 పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ –
V20 తరహాలోనే ఈ పవర్ బ్యాంక్ ప్రొటెక్షన్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇంకా ఈ పవర్ బ్యాంక్ 10000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 22.5W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని పనితీరు వేగంగా, సమర్థవంతంగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్, పోర్టబుల్ డిజైన్‌తో ఇది అందుబాటులో ఉంది. LED డిజిటల్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. సీప్డ్ అండ్ సేఫ్టీ ఛార్జింగ్ కోసం పోర్టబుల్ పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఈ V10 మోడల్ బ్లాక్, బ్లూ, బీజ్ రంగుల్లో లభిస్తుంది.
AmpVault V20 పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ –
ఈ పవర్ బ్యాంక్ 20,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అధికంగా ఛార్జింగ్ అవసరాలు ఉన్న వినియోగదారుల కోసం ఇది రూపొందించబడింది. ఈ V20 పవర్ బ్యాంక్ 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. LED డిజిటల్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఈ పవర్ బ్యాంక్‌తో ఐఫోన్ 15ను 4.9 సార్లు ఛార్జింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఇంకా శాంసంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్‌ను 4.1 సార్లు, వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌ను 6 సార్లు ఛార్జింగ్ చేయవచ్చని పేర్కొంది. ఆకట్టుకునే డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో మెరుగైన పనితీరు కనబరుస్తుందని వెల్లడించింది.
ఈ V20 పవర్ బ్యాంక్ ద్వారా ఒకేసారి అనేక డివైజ్‌లను ఛార్జింగ్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్లెస్ ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్‌లను ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఇది ఉంటుంది. అందుకు అనుగుణంగా మైక్రో USB, టైప్-C (ఇన్పుట్, ఔట్పుట్) ఛార్జింగ్ పోర్ట్‌లు, USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ పవర్ బ్యాంక్‌కు ఉన్నాయి.
ఈ పవర్ బ్యాంక్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉండడంతో పాటు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. అధునాతన ఫీచర్స్ కూడా ఉన్నాయి. సూపర్ మెటాలిక్ ఫినిషింగ్‌తో టీల్, రెడ్, ప్యూర్ బ్లాక్ కలర్స్‌తో అందుబాటులో ఉంది. ఇంకా ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, స్మార్ట్ షట్‌డౌన్, వంటి ఫీచర్లు ఈ పవర్ బ్యాంక్‌లో ఉన్నాయి.
Boult పవర్ బ్యాంక్ ధర వివరాలు –
V10 పవర్ బ్యాంక్ ధర ప్రస్తుతం రూ.1099 గా ఉంది. V20 ధర రూ.1499గా ఉంది. ప్రస్తుతం ఈ రెండు పవర్ బ్యాంకులు Boult అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ALSO READ : రూ.2,799కే బెస్ట్ ప్రాసెసర్, కెమెరా మెుబైల్.. ఇంకా ఎన్నో అదిరే ఫీచర్స్