Puri Jagannath:డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరో అంటే.. సాఫ్ట్ గా ఉండాలి. పెద్ద ఉద్యోగం ఉండాలి. నీట్ గా ఉండాలి. కోపం ఉండకూడదు. బూతులు అస్సలు మాట్లాడకూడదు అనే అంచనాలను వేర్లతో సహా పెకిలించివేసిన డైరెక్టర్ అంటే పూరీనే. పూరీ హీరోలు పోకిరీలు, లోఫర్స్, ఉద్యోగం ఉండదు.. నీట్ నెస్ అస్సలు ఉండదు.. ఇక బూతులు అంటారా.. ? వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అయినా.. పూరీ హీరోలే చాలామందికి నచ్చుతారు.
సాధారణంగా ఒక సినిమా కథ రాయాలంటే.. డైరెక్టర్స్ కు ఎంత టైమ్ పడుతుంది.. ? బాగా ఎక్కువ అనుకుంటే ఒక ఏడాది. పూరీ గోవాలో కూర్చుంటే మూడు రోజులు.. పోనీ మహా అయితే పదిరోజులు. అసలు ఈ డైరెక్టర్ గురించి చెప్పాలంటే.. పేరాలు సరిపోవు. చదువుకున్న సర్టిఫికెట్స్ ఉంటే ఎక్కడ అనుకున్న గోల్ రీచ్ అవ్వనేమో అని సర్టిఫికెట్స్ చింపేసిన పిచ్చోడు పూరీ. ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందో అని.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు పూరీ.
Vishwak Sen: అప్పుడు కథ చెప్తే నో చెప్పిన అమ్మాయి, ఇప్పుడు నా పక్కనే హీరోయిన్ గా చేసింది
జీవితంలో రిలేషన్స్ అన్ని అవసరాలు మాత్రమే.. అవసరం తీరిపోతే మనిషి ఎప్పుడు ఒంటరినే అని చెప్పిన ఫిలాసఫర్ పూరీ. పడిపోయాడు.. పనైపోయింది.. చేతకాదు అని ఇండస్ట్రీ మొత్తం అనుకున్న సమయంలో ఒక్కసారిగా తానేంటో చూపించి.. పూరీ అంటే ఇదిరా అని నిరూపించుకుంటాడు. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న పూరీ.. త్వరలోనే మరో హిట్ తో వస్తాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఆయన సినిమాలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ.. పూరీ మ్యూజింగ్స్ కు మాత్రం సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందనే చెప్పాలి.
సమాజం ఏంటి.. ? ఎవరు ఉంటున్నారు సమాజంలో.. ? ఏం చూస్తుంది సమాజం.. ? ప్రేమ, పెళ్లి, జీవితం, కెరీర్, బాధ, బ్రేకప్, కోరికలు.. తల్లితండ్రులు, భార్యాభర్తలు, విజయాలు, అపజయాలు.. ఇలా ప్రతి ఒక్కదాని మీద తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పూరీ మ్యూజింగ్స్ లో చెప్పుకొస్తాడు. నిజం చెప్పాలంటే చాలామంది యువతకు ఇవి మోటివేషన్. తాజాగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనే విషయమై పూరీ మాట్లాడాడు. బ్లాక్ మెయిల్ కన్నా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చాలా ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు.
Ramya Krishnan: సౌందర్యతో ఆ సీన్ ఇష్టం లేకపోయినా చేశా.. ముఖంపై కాలు పెట్టి మరీ..
అలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేది ఎవరో కాదు.. మీ తల్లిదండ్రులు.. మిమ్మల్ని బాగా ప్రేమించేవారు. ఆ బ్లాక్ మెయిల్ ఎలా ఉంటుంది అంటే.. నీకోసం ఇంత చేసాం.. అంత చేసాం.. మాకోసం నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో సొంత అమ్మ, నాన్ననే.. పెళ్లి చేసుకో.. పిల్లలని కను.. మాకు వయస్సవుతుంది.. మేము చూడాలనుకుంటున్నాం నీ పెళ్లి అని బ్లాక్ మెయిల్ చేస్తారు. మనల్ని కంట్రోల్ చేయడం కోసం మాత్రమే వారు ప్రేమను గిఫ్ట్ గా ఇస్తారు.
వాళ్లు అనుకున్నది జరగాలి.. అంతే. మీ ఇష్టాలు ఏంటి.. ? మీపై ఎంత ఒత్తిడి ఉంది ఇవేమి వారు ఆలోచించరు. మీరు కాదు అంటే.. ఏడుస్తారు.. తిండి తినమని బ్లాక్ మెయిల్ చేస్తారు. వారి గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవుతారు. నిద్రపోకుండా ఆలోచిస్తారు. ఇంట్లో విషయాలు ఎవరికి చెప్పుకోలేరు. మీలో మీరే మదనపడుతుంటారు. నేను చెప్తున్నాను.. అమాయకంగా కనిపించే తల్లిదండ్రులే పెద్ద క్రిమినల్స్.. స్వార్థపరులు. అలాంటివారు చేసే బ్లాక్ మెయిల్ కు లొంగకండి.
వారు ఎంత డ్రామా చేస్తారో.. అంతకుమించి మీరు కూడా చేయండి. తినకండి.. ఇంట్లో నుంచి వెళ్లిపోండి.. వారు ఏ డైలాగ్స్ మాట్లాడితే.. మీరు కూడా రివర్స్ లో అవే చెప్పండి. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, భార్య ఎవరైనా కానివ్వండి.. ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే లొంగిపోకండి. ఎవరైతే కుటుంబాన్ని ప్రేమిస్తారో.. వారిమీదనే ఇలాంటి అత్యాచారాలు జరుగుతాయి. ఇంట్లోవాళ్లను జాగ్రత్తగా చూసుకోండి.. కానీ, ఇలాంటి బ్లాక్ మెయిల్స్ కు లొంగొద్దు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.