MLA Vishnu Kumar Raju: ఏపీ అసెంబ్లీ సీరియస్ గా సాగుతోంది. అంతలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మైక్ అందుకున్నారు. ఇక అంతే సభ మొత్తం నవ్వులే నవ్వుల్. అది కూడా స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం లతో సహా..
వైజాగ్ లో రుషికొండ ప్యాలెస్ గురించి తెలియని వారుంటారా చెప్పండి. కూటమి విజయాన్ని అందుకున్న అనంతరం.. ఫేమస్ గా నిలిచిన ప్యాలెస్ ఇది. దీనికి కారణం ఎన్నికల ముందు వరకు అసలు ఈ ప్యాలెస్ దరిదాపుల్లోకి కూడా ఎవరికీ అనుమతి లేకపోవడమే. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారగా, రుషికొండ ప్యాలెస్ నిగ్గు తేల్చేందుకు మీడియాతో రంగప్రవేశం చేశారు టీడీపీ నేతలు. అందులో ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలిచింది ఏదో కాదు.. అక్కడి అధునాతన టాయ్ లెట్.
ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు సైతం ఈ ప్యాలెస్ సందర్శించి, కోట్ల రూపాయల నిధులను గత ప్రభుత్వం స్వార్థపూరితంగా వ్యవహరించి వృధా చేసినట్లు విమర్శించారు. అయితే తాజాగా ఈ ప్యాలెస్ లోని టాయిలెట్ గురించి అసెంబ్లీ మార్మోగింది.
అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మేల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఏదిఏమైనా మాజీ సీఎం హుందాతనానికి రుషికొండ ప్యాలెస్ నిదర్శనమన్నారు. అందులో కూడా ప్యాలెస్ లోని టాయిలెట్ మాత్రం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందని అనగానే, సభ్యులంతా చిరునవ్వులు చిందించారు. ఈ టాయిలెట్ అక్షరాలా రూ. 11,46,840 ధర పలికినట్లు తనకు తెలిసిందని, అలాగే వాష్ బేసిన్ ధర రూ. 2,61,500 లు గా తెలిపారు.
Also Read: Lady Aghori at Dilsukhnagar: త్వరలోనే ‘అది’ కోస్తానంటున్న అఘోరీ.. అందరి ముందే అలా చేస్తానంటూ..
సభలో ఎందరో కోటీశ్వరులు ఉన్నారని, కానీ ఇంతటి సదుపాయం గల టాయిలెట్ వాడుతున్నారో లేదో తనకు తెలియదన్నారు. రుషికొండ టాయిలెట్ గురించి ప్రత్యేకతలు తెలుసుకొని తాను షాక్ కు గురయ్యానని, వెళ్లి అలా కూర్చుంటే చాలు.. అలా వాష్ చేసే సౌలభ్యం ఆటోమేటిక్ గా ఉందన్నారు. చేతులు కూడా అవసరం లేకుండా.. మంచి సౌలభ్యం ఉన్న టాయిలెట్ అంటూ విష్ణు రాజు అనగానే స్పీకర్ తో సహా అసెంబ్లీ లో నవ్వులు విరబూశాయి. ఇలా మరోమారు రుషికొండ ప్యాలెస్ వార్తల్లో నిలిచింది.
రిషికొండ రహస్యాలు విప్పిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
సభలో నవ్వులే నవ్వులు@VishnuRajuBJP @ysjagan#AndhraPradesh #APAssembly #APBudgetSession2024 #BigTV pic.twitter.com/tgrp7s6HLE
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2024