Galaxy S25 Plus Discount| గెలాక్సీ ఫోన్స్‌లో లేటెస్ట్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ శాంసంగ్ గెలాక్సీ S25. ఈ సిరీస్‌లో అతిపెద్ద స్క్రీన్ గల ఫోన్ గెలాక్సీ S25 ప్లస్. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపు ప్రకటించింది. లాంచ్ ధర కంటే ఇప్పుడు దాదాపు రూ.30,000 తక్కువకు దొరుకుతోంది. అమెజాన్ సేల్‌లో ఈ డీల్ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 25న గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ కానుంది. కొత్త సిరీస్ ఫోన్స్ విడుదలకు కొన్ని రోజుల ముందే పాత మోడల్ ధరను గణనీయంగా తగ్గించారు. ప్రీమియం ఫోన్ కావాలనుకునేవారికి ఇది చాలా మంచి అవకాశం.
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ లాంచ్ ధర రూ.99,999. అయితే అమెజాన్‌లో ఇప్పుడు రూ.25,000 తగ్గింపుతో రూ.74,994కి లిస్ట్ అయింది. అమెజాన్‌లో రూ.4,000 ఫ్లాట్ కూపన్ డిస్కౌంట్ ఉంది. అదనంగా రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. మొత్తం ఫైనల్ ధర రూ.69,194 అవుతుంది. ఇది ఈ మోడల్‌కు ఇప్పటివరకు రికార్డ్ తక్కువ ధర.
గెలాక్సీ S25 ప్లస్‌లో 6.65 ఇంచ్ క్వాడ్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. 3120 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వైబ్రెంట్ కలర్స్ ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ స్క్రోలింగ్ ఇస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఫాస్ట్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. 12GB RAMతో మల్టీటాస్కింగ్ సులభంగా జరుగుతుంది. 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7తో రన్ అవుతుంది. శాంసంగ్ 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఇస్తుంది. దీంతో ఫోన్ ఎక్కువ కాలం సురక్షితంగా, స్మూత్‌గా ఉంటుంది.
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరా OIS సపోర్ట్‌తో స్టేబుల్, షార్ప్ ఫోటోలు తీస్తుంది. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. 10MP టెలిఫోటో కెమెరా జూమ్ షాట్స్‌కు సహాయపడుతుంది. సెల్ఫీలకు 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. హై-క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
Also Read: ఏఐ నేర్చుకుంటేనే ప్రమోషన్ లేకుంటే ఉద్యోగ గండం.. ఉద్యోగులకు హెచ్చరించిన ఐటి కంపెనీ
4,900mAh బ్యాటరీ ఉంది. రోజంతా సాధారణ ఉపయోగానికి సరిపోతుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది.
ధర తగ్గింపు వల్ల గెలాక్సీ S25 ప్లస్ ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా డీల్‌గా మారింది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తక్కువ ధరలో దొరుకుతున్నాయి. S26 లాంచ్‌కు ముందు ఈ ఆఫర్ ప్రీమియం ఫోన్ కావాలనుకునేవారికి బెస్ట్. ఈ డీల్ తక్కువ ధరలో మంచి పర్‌ఫామెన్స్ కోరుకునేవారికి గొప్ప అవకాశం.