E-Paper
Advertisement

New Delhi: దేశంలో ఉగ్ర కుట్ర భగ్నం.. చిక్కిన 8 మంది, పాక్ ఐఎస్ఐ-బంగ్లా అతివాదులతో సంబంధాలు

New Delhi: దేశంలో ఉగ్ర కుట్ర భగ్నం.. చిక్కిన 8 మంది, పాక్ ఐఎస్ఐ-బంగ్లా అతివాదులతో సంబంధాలు
Advertisement

New Delhi: దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పాకిస్థాన్ ఐఎస్ఐ‌, బంగ్లాదేశ్ అతివాద సంస్థలతో సంబంధాలున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్ర దాడికి వీళ్లు ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు అధికారులు.

దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 8 మంది అరెస్ట్

Advertisement

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడు బంగ్లాదేశ్‌కి చెందినవాడు. అతడికి అక్కడి అతివాదులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ ఐఎస్ఐ, బంగ్లాదేశ్‌లోని అతివాదుల మార్గ దర్శకత్వంలో ఇండియాలో పెద్ద దాడికి ప్రణాళిక వేసినట్లు సమాచారం. విదేశీ హ్యాండ్లర్ల ఆధ్వర్యంలో దేశంలో వీళ్లంతా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

తమిళనాడులోని తిరుప్పుర్‌ జిల్లాలో మిజనూర్ రహమాన్, మొహమ్మద్ షబాత్, ఉమర్, మొహమ్మద్, లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దర్ని బెంగాల్‌లో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా పట్టుబడినవారంతా నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగిస్తూ తమ కార్యకలాపాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

పాక్ ఐఎస్ఐ-బంగ్లా అతివాద గ్రూపులతో సంబంధాలు

నిందితుల నుంచి ఎనిమిది మొబైల్, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఆన్‌లైన్ పోస్టులపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో నిందితుల గురించి తెలియడం, ఆపై ఢిల్లీలో వేగంగా అడుగులు వేయడం జరిగిపోయింది. పట్టుబడినవారిలో ఆరుగురు తమిళనాడులోని ఓ దుస్తుల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు.

న్యూఢిల్లీలో AI సమ్మిట్ సందర్భంగా నిందితులు అనేక నగరాలను సర్వే చేశారట. మెట్రో స్టేషన్‌లో ఫ్రీ కాశ్మీర్, ఇతర నేరారోపణ పోస్టర్లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వీరంతా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కు తిరిగి వచ్చారని సమాచారం. నిందితులందరూ సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరిపారు.

ALSO READ: ఢిల్లీలో హైటెక్ మహాభారతం.. ఏఐ రూపంలో దర్శనమిచ్చిన కృష్ణార్జునులు

8 మంది సభ్యుల టీమ్‌లో నలుగురు పోస్టర్లను అతికించడానికి ఢిల్లీకి వెళ్లారట. ప్రస్తుతం వారిని లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న నిషేధిత సంస్థ లష్కరే తోయిబా దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో శనివారం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.

Related News

రేషన్‌కార్డులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×