E-Paper
Advertisement

Samsung Galaxy S25 Slim : 7mm థిక్నెస్, 200MP కెమెరా.. సామ్సాంగ్ స్లిమ్ లెవెలే వేరు

Samsung Galaxy S25 Slim : 7mm థిక్నెస్, 200MP కెమెరా.. సామ్సాంగ్ స్లిమ్ లెవెలే వేరు
Advertisement

Samsung Galaxy S25 Slim : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే టెక్ దిగ్గజం యాపిల్ తో పోటీ పడుతూ లేటెస్ట్ మొబైల్స్ ను లాంఛ్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాపిల్ స్లిమ్ మెుబైల్స్ తో పోటీ పడుతూ Samsung Galaxy S25 Slim రాబోతుంది. ఇక ఈ మెుబైల్ ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి.

Apple iPhone 17 Air కి పోటీగా సామ్ సాంగ్ వచ్చే ఏడాది Samsung Galaxy S25 Slimను తీసుకువస్తున్నట్లు కన్ఫామ్ అయింది. ఈ మెుబైల్ ఫీచర్స్ లీక్ అవ్వగా.. అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ప్రముఖ టిప్‌స్టర్ గాడ్జెట్‌ డేటా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను X.com లో షేర్ చేసింది.

Advertisement

Samsung Galaxy S25 Slim స్పెసిఫికేషన్‌లు –

Gadgetsdata షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, Samsung Galaxy S25 Slim ఫీచర్స్ లేటెస్ట్ వెర్షన్ లో రాబోతున్నాయి. 6.6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఇప్పుడు, లీక్ అయిన ఫీచర్స్ లో స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25+ వేరియంట్‌కు సమానమైన డిస్ప్లే ప్యానెల్‌ తో రాబోతుంది. ఈ సిరీస్ లో Samsung Galaxy S25, Samsung Galaxy S25 Plus, Samsung Galaxy S25 Ultraతో సహా మూడు ఫోన్‌లను తీసుకువస్తుంది. దీంతో పాటు Samsung Galaxy S25 Slim కూడా కొద్ది రోజుల తేడాతో రాబోతుంది. ఇందులో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ కూడా ఉండనుంది.

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన బ్యాటరీని సైతం కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇక స్లిమ్ మెుబైల్ విషయానికి వస్తే Galaxy S25 Slim మోడల్ 4700mAh, 5000mAh  మధ్యలో బ్యాటరీని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇందులో కెమెరా సెటప్ సైతం అరిపోయేలా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బహుశా 200MP HP5 ప్రైమరీ షూటర్, 50MP JN5 UW సెకండరీ షూటర్, 50MP JN5 3.5X టెలిఫోటో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను తీసుకువస్తున్నట్లు అంచనా.

ఇక టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ తెలిపినట్లు.. Samsung Galaxy S25 Slim సుమారు 7mm మందంతో ఐఫోన్ 17 ఎయిర్ కంటే కాస్త థిక్ గా ఉండనుంది. అయితే ఈ మొబైల్ డిజైనింగ్ ఇంకా పరిశీలనలోనే ఉండటంతో సాంసంగ్ గెలాక్సీ s25 సిరీస్తో పాటు రాదని కచ్చితంగా తెలుస్తుంది. గ్యాలక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్లో కేవలం మూడు మొబైల్స్ మాత్రమే లాంచ్ అయ్యి.. 2025 రెండవ త్రైమాసికంలో ఈ మెుబైల్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

Samsung Galaxy S25 Ultra ఫీచర్స సైతం అదిరిపోయేలా ఉన్నాయి. 6.86 అంగుళాల AMOLED డిస్‌ప్లే, హై ఎండ్ వేరియంట్‌లో 16GB RAMతో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రాబోతుంది. ఇది 200MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5X జూమ్‌ 50MP టెలిఫోటో షూటర్, 3X జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ALSO READ : రూ. 5999 నుంచే స్మార్ట్ టీవీలు.. ఫ్లిప్కార్ట్ సేల్ లో ఆఫర్స్ ఇచ్చిపడేసిందిగా!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×