Akbaruddin Owaisi – Pushpa 2 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా కొన్ని ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా తెలుసా టైం ఇప్పుడు బాగోలేదు అని చెప్పాలి. దీనిని కూడా కొందరు కొన్ని రకాలుగా క్యాష్ చేసుకోవటం మొదలుపెట్టారు. ప్రముఖ జ్యోతిష్కులు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిన విషయమే. వేణు స్వామికి ఒక టీవీ జర్నలిస్టుకి మధ్య జరిగిన వాగ్వాదం ఎంతవరకు దారితీసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే అక్కినేని ఫ్యామిలీ మీద వేణు స్వామి చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి. ఒకసారి గా చాలామంది వేణు స్వామి మీద విరుచుకుపడ్డారు. వేణు స్వామి కూడా నాకు జాతకం చెప్పడం రాదు ఇకపైన సినిమా వాళ్ళ జాతకాలు నేను చెప్పను అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సమస్యలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటూ అడగడం మొదలుపెట్టాడు.
ఇకపోతే ఒక వివాదం తర్వాత మరో వివాదం జరుగుతూనే వస్తుంది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్ కు ఒక రోజు ముందే కొన్నిచోట్ల ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాను చూడటానికి వెళ్ళాడు. అక్కడ అల్లు అర్జున్ వస్తుండడంతో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా ఏకధాటిగా పరుగులు తీస్తూ వచ్చారు. ఇలా ఒక్కసారిగా అందరూ రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మరణించారు. ఇప్పటికే వాళ్ల కుమారుడు శ్రీ తేజ హాస్పిటల్ లోనే ఉన్నాడు. ఈ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించిన విషయం కూడా తెలిసిందే. మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ 14 రోజులు ఉండాల్సిన డిమాండ్ కాస్త ఒక్కరోజులోనే ఒక కొలిక్కి వచ్చి ఇంటికి వచ్చేసారు.
అల్లు అర్జున్ ఇంటికి రావడంతో తెలుగు సినిమా ప్రేమికులంతా కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి అల్లు అర్జున్ ను పరామర్శించడం మొదలుపెట్టారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నేడు అసెంబ్లీ మీటింగ్స్ లో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇకపైన టికెట్ రేట్స్ హైక్ ఉండదు, అలానే బెనిఫిట్స్ కూడా ఉండవు అని తేల్చి చెప్పేశారు. ఈ తరుణంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అల్లు అర్జున్ మీద తీవ్రమైన కామెంట్ చేశారు. “తొక్కిసలాటలో మహిళ చచ్చిపోయిందా? అయితే నా సినిమా సూపర్ హిట్ అయినట్టే.. అని అల్లు అర్జున్ పోలీసులతో అన్నాడు” ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ అలా అని ఉండరు ఇది కేవలం ఆరోపణలు మాత్రమే అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం అల్లు అర్జున్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Also Read : Ram Gopal Varma : ఆర్జీవికి మరో షాక్… నోటీసులు పంపిన ఫైబర్ నెట్