Ram Gopal Varma : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. ఆయన రూపొందించిన ‘వ్యూహం’ చిత్ర బృందం, రామ్ గోపాల్ వర్మలతో పాటు ఫైబర్ నెట్ మాజీ ఎండికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై కించపరిచే పోస్టులు పెట్టాడనే కారణంతో ఆయన వివిధ కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మకు షాక్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమాను తీశారు. ఈ సినిమాకు సంబంధించి రూ. 2.15 కోట్లకు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకున్నట్టు తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ వెల్లడించారు. అప్పట్లో వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఈ ఒప్పందం జరిగిందని, అయితే ‘వ్యూహం’ సినిమాకు కేవలం 1863 వ్యూస్ రాగా, ఒక్కో వ్యూకు రూ. 11, 000 అప్పటి ప్రభుత్వం చెల్లించిందని చెప్పుకొచ్చారు. కానీ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు వచ్చిన వ్యూస్ ప్రకారం ఆర్జీవీకి ఒక్కో వ్యూకు రూ, 100 ఇవ్వాలి. ఈ చిత్రానికి కేవలం 1863 వ్యూస్‌కి గాను అతనికి 1.15 కోట్లు చెల్లించారు. అంటే గత ప్రభుత్వం ఆయనకు దాదాపు రూ. ఒక్కో వీక్షణకు 11,000.
తాజాగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి ‘వ్యూహం’ చిత్ర బృందం నిధులు పొందడం గురించి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి ఆదేశాల మేరకు రాంగోపాల్ వర్మతో పాటు చిత్ర బృందానికి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఒక్కో వ్యూకు వంద చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటకీ, రూల్స్ కు విరుద్ధంగా వ్యూస్ లేకున్నా సరే ఫైబర్ నెట్ నుంచి 1. 15 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందారంటూ ఆ నోటీసులో పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అప్పటి ఫైబర్ నెట్ ఎండితో పాటు మరో ఐదుగురికి ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
15 రోజుల్లోపు నిబంధనలకు విరుద్ధంగా లబ్దిపొందిన కారణంగా, రూ. 1.15 కోట్లను వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. అంతేకాకుండా దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీసులు పంపించామని జీవీ రెడ్డి వెల్లడించారు. మరి ఈ వివాదంపై రాంగోపాల్ వర్మ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల క్రితమే ఈ విషయంపై ఆరోపణలు రాగా, కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన మొదలు పెట్టినట్టుగా కనిపిస్తోంది. చెప్పిన సమయంలో ఒక వడ్డీతో సహా చెల్లించకపోతే ఆర్జీవి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇక మరోవైపు ‘పుష్ప 2’ ప్రీమియర్ల సందర్భంగా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగా, ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు బన్నీకి సపోర్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు.