E-Paper
Advertisement

Samsung Galaxy S25 Ultra Offer: అమ్మో.. ఇంత తక్కువకా? శాంసంగ్ S25 అల్ట్రాపై రూ.20 వేల తగ్గింపు మావా!

Samsung Galaxy S25 Ultra Offer: అమ్మో.. ఇంత తక్కువకా? శాంసంగ్ S25 అల్ట్రాపై రూ.20 వేల తగ్గింపు మావా!

Samsung Galaxy S25 Ultra Offer: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ బ్రాండ్‌కు వినియోగదారుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐఫోన్ తర్వాత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది శాంసంగ్ ఫోన్లకే. మీరు గనుక తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఇదే సరైన సమయం. శాంసంగ్ తన తదుపరి తరం గెలాక్సీ S26 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 25న శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా జరిగే ప్రతిష్టాత్మక Galaxy Unpacked ఈవెంట్‌లో కొత్త ఫోన్లు సందడి చేయనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 11:30 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. కొత్త మోడల్స్ వస్తుండటంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోస్ట్ పవర్‌ఫుల్ ఫోన్ గెలాక్సీ S25 అల్ట్రా ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. మరి గెలాక్సీ S25 అల్ట్రాపై ఎంత ధర తగ్గింది? ఆఫర్ వివరాలు ఏంటో తెలుసుకుందామా..

కళ్లు చెదిరే డిస్కౌంట్లు:

సాధారణంగా కొత్త వెర్షన్ లాంచ్ అవుతుందంటే పాత మోడల్ ధర తగ్గడం ఆనవాయితీ. కానీ ఈసారి శాంసంగ్ ఏకంగా రూ.20వేల పైగా భారీ తగ్గింపును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ.1,29,999 ప్రారంభ ధర కలిగిన S25 అల్ట్రా ఇప్పుడు ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ.1,09,500కే లభిస్తోంది.

Also Read: రూ.7,999కే రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ మావా.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

క్రెడిట్ కార్డులతో మరింత తగ్గింపు:

సంస్థ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. అదనపు డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే, ఫోన్ కండిషన్ బట్టి ఏకంగా రూ.42 వేల వరకు ధరను తగ్గించుకునే వెసులుబాటు ఉంది. ప్రీమియం ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

తిరుగులేని పెర్ఫార్మెన్స్:

Samsung Galaxy S25 Ultra విడుదలై చాలా రోజులు అయినప్పటికీ.. దీనిలోని అత్యాధునిక ఫీచర్లు ఇప్పటికీ గెట్టి పోటీనిస్తున్నాయి. ఇందులో 6.9 ఇంచుల భారీ డిస్‌ప్లే వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వల్ల ఫోన్ ఏమాత్రం హ్యాంగ్ అవ్వకుండా మెరుపు వేగంతో పనిచేస్తుంది.

200 మెగాపిక్సల్ కెమెరా:

ఇకపోతే.. ఫొటోగ్రఫీ కోసం ఈ Samsung Galaxy S25 Ultraలో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. ఇది చీకటిలో కూడా పగటిపూట లాంటి స్పష్టమైన ఫొటోలను తీయగలదు. అలాగే రోజంతా బ్యాటరీ ఇబ్బంది లేకుండా 5000mAh పవర్ బ్యాకప్ ఉండటం దీని ప్రత్యేకత.

Also Read: ఏసీ కొంటున్నారా? 1-స్టార్, 5-స్టార్ రేటింగుల్లో తేడా తెలియకపోతే బుక్కైపోతారు!

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×