E-Paper
Advertisement

Fitness Trackers: స్మార్ట్ రింగ్ vs స్మార్ట్ వాచ్.. ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కు ఏది బెస్ట్ ఆప్షన్!

Fitness Trackers: స్మార్ట్ రింగ్ vs స్మార్ట్ వాచ్.. ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కు ఏది బెస్ట్ ఆప్షన్!
Advertisement

Fitness Trackers: కరోనా తర్వాత అధిక శాతం యువత ఆరోగ్యంపై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ.. హెల్దీగా ఉండేందుకు జిమ్‌లు, వాకింగ్, రన్నింగ్‌లు అని ఉత్సాహంగా తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. అందుకే నిత్యం చేతికి ఏదో ఒక గ్యాడ్జెట్ పెట్టుకుని హెల్త్‌ని ట్రాక్ చేసుకుంటున్నారు. అసలు ఫిట్‌నెస్ గ్యాడ్జెట్ లేకుండా బయటకు వెళ్లడం లేదు. అయితే మొన్నటి వరకు స్మార్ట్ వాచ్‌లే రాజ్యమేలాయి. కానీ ఇప్పుడు స్మార్ట్ రింగ్స్ హడావిడి మొదలైంది. మరి ఈ రెండింటిలో ఏది వాడటం బెటర్? ఏది కొంటే ఎక్కువ బెనిఫిట్స్? అసలు వీటి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టైలిష్ లుక్ కావాలనుకుంటే?

స్మార్ట్ వాచ్‌లు కాస్త పెద్దగా, స్టైలిష్‌గా ఉంటాయి. మన అవుట్‌ఫిట్‌కు తగ్గట్టు బెల్టులు మార్చుకుంటూ వెరైటీగానూ కనిపించవచ్చు. కానీ, చాలామందికి రాత్రి పడుకునేటప్పుడు వాచ్ పెట్టుకోవడం చిరాగ్గా అనిపిస్తుంది. అలాంటి వాళ్లకు ఈ స్మార్ట్ రింగ్స్ బెస్ట్. వేలికి ఉంగరంలా చాలా తేలికగా ఉంటుంది. అయితే ఒక్క విషయం.. ఈ స్మార్ట్‌రింగ్‌ను కొనేటప్పుడు మీ వేలి సైజు సరిగ్గా చూసుకోవాలి. ఎందుకంటే.. వాచ్ బెల్టులా దీన్ని అడ్జస్ట్ చేయలేం కాబట్టి.

నోటిఫికేషన్స్ బెడద వద్దనుకుంటే?

Advertisement

మీ ఫోన్‌కు వచ్చే ప్రతి మెసేజ్, కాల్ వాచ్‌లోనే చూసుకోవాలి అనుకుంటే స్మార్ట్‌ వాచ్‌ను వాడొచ్చు. ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు ఎన్ని కేలరీలు బర్న్ చేశాం? గుండె వేగం ఎంత? అనేది వాచ్ స్క్రీన్ మీదే కనిపిస్తుంది. కానీ స్మార్ట్ రింగ్స్‌లో అవేమీ ఉండవు. నోటిఫికేషన్లు రావు, స్క్రీన్ ఉండదు. ఒకవేళ పదే పదే వచ్చే ఫోన్ నోటిఫికేషన్ల గోల ఉండొద్దు అనుకుంటే.. ఈ రింగ్ బెస్ట్. అయితే ఏదైనా చూడాలంటే మొబైల్ యాప్ ఓపెన్ చేయాల్సిందే మరి.

Also Read: 9000mAh బ్యాటరీతో పోకో X8 ప్రో సిరీస్ లాంచ్.. ఐరన్ మ్యాన్ ఎడిషన్ అయితే మస్తుంది భయ్యా!

కచ్చితమైన హెల్త్ ట్రాకర్ ఏది?

Advertisement

టెక్నాలజీ పరంగా రెండూ బెటరే. కానీ స్లీప్ ట్రాకింగ్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం స్మార్ట్ రింగ్స్ కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే.. అవి వేలికి గట్టిగా అంటుకుని ఉంటాయి కాబట్టి.. బాడీ టెంపరేచర్, హార్ట్ రేట్ వంటివి ఖచ్చితంగా చెబుతాయి. అలా అని వాచ్‌లు తక్కువ కాదు. రన్నింగ్ చేసేవారైతే.. ఎంత స్పీడ్‌లో వెళ్తున్నారు? ఎన్ని కిలోమీటర్లు పూర్తి చేశారు.. వంటి వివరాలు వాచ్‌లో చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.

ఛార్జింగ్ తలనొప్పి ఉండొద్దంటే?

స్మార్ట్ వాచ్‌లకు డిస్‌ప్లే ఉంటుంది కాబట్టి.. మాగ్జిమమ్ రోజు మార్చి రోజు ఛార్జింగ్ పెట్టాలి. అదే స్మార్ట్ రింగ్ అనుకోండి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజుల నిశ్చింతగా ఉండొచ్చు. అలాగే వాచ్ గ్లాస్ పగిలే ఛాన్స్ ఉంటుంది కానీ, రింగ్స్ చాలా గట్టిగా ఉంటాయి. అయితే ఉంగరం కాబట్టి అక్కడక్కడ గీతలు పడే అవకాశం ఉంటుంది.

స్లీప్ ట్రాకింగే ముఖ్యం అనుకుంటే?

ఒకవేళ మీకు రియల్ టైమ్ అప్‌డేట్స్ కావాలి, ఫోన్ తీయకుండానే కాల్స్ చూడాలి అనుకుంటే స్మార్ట్ వాచ్ తీసుకోండి. అలా కాకుండా నోటిఫికేషన్ల గోల లేకుండా, కేవలం ఆరోగ్యం, నిద్ర గురించి తెలిస్తే చాలు.. అది కూడా తేలిగ్గా ఉండాలి అనుకుంటే మాత్రం స్మార్ట్ రింగ్‌ను పెట్టుకోవచ్చు.

Also Read: అబ్బా.. ఏం ఫీచర్లండి బాబూ.. కుక్కర్ విజిల్స్ కూడా లెక్కపెట్టే అద్భుతమైన స్టవ్ ఇది!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×