Samsung Galaxy S27 Ultra: మనలో చాలా మందికి కొత్త ఫోన్ కొనేటప్పుడు అందులో ప్రాసెసర్ ఏముంది, ఏ కంపెనీ చిప్ వాడారు అనేది చాలా ముఖ్యం. అందులోనూ శాంసంగ్ అల్ట్రా సిరీస్ ఫోన్స్ అంటే మరింత ఎక్కువ ఫోకస్ పెడతాం. అయితే రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా ఫోన్ గురించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా అల్ట్రా మోడల్స్‌లో కేవలం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్స్‌ను మాత్రమే వాడిన శాంసంగ్.. ఇప్పుడు మనసు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
శాంసంగ్ రాబోయే కొత్త ఫోన్ కోసం క్వాల్కామ్ తయారు చేసిన లేటెస్ట్ ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ Gen 6’ చిప్‌ను టెస్ట్ చేసింది. అయితే పెద్ద పెద్ద హెవీ టాస్క్స్ చేసే సమయంలో ఈ ప్రాసెసర్ విపరీతంగా వేడెక్కుతున్నట్లు శాంసంగ్ గుర్తించిందట. వేడి ఎక్కువైతే ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంది కదా.. అందుకే కంపెనీ టెన్షన్ పడుతోంది. ఈ సమస్యను వెంటనే సాల్వ్ చేయాలని క్వాల్‌కామ్‌కు అక్టోబర్ మధ్య వరకు డెడ్‌లైన్ కూడా పెట్టిందట శాంసంగ్.
Also Read: ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?
శాంసంగ్ చేస్తున్న ఈ వాదనలను క్వాల్కామ్ మాత్రం గట్టిగా ఖండిస్తోంది. మా చిప్‌లో ఎలాంటి హీటింగ్ సమస్యలు లేవని, వస్తున్న వార్తలన్నీ నూటికి నూరు శాతం అబద్ధమని ఆ కంపెనీ మార్కెటింగ్ చీఫ్ డన్ మెక్గ్వైర్ తేల్చిచెప్పేశారు. శాంసంగ్ చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదని క్వాల్కామ్ క్లారిటీ ఇస్తోంది. అయినప్పటికీ శాంసంగ్ మాత్రం తన సొంత ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఒకవేళ క్వాల్కామ్ గనుక సమస్యను సరిచేయకపోతే.. శాంసంగ్ తన సొంత ‘ఎగ్జినోస్ 2700’ చిప్‌ను ఈ అల్ట్రా ఫోన్లో వాడాలని చూస్తోంది. ఇది శాంసంగ్ ఫౌండ్రీకి చెందిన లేటెస్ట్ 2ఎన్ఎం టెక్నాలజీతో తయారైంది. ఈ సొంత చిప్‌ను వాడటం వల్ల కంపెనీకి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా తమ చిప్ మేకింగ్ బిజినెస్‌ను మరింత డెవలప్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా శాంసంగ్ భావిస్తోంది.
ఈ Galaxy S27 సిరీస్ ఫోన్లు వచ్చే ఏడాది అంటే 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. S27, S27 Plus, S27 Pro మోడల్స్‌లో ఈ ఎగ్జినోస్ చిప్‌ను వాడాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ ప్రైమరీ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. ఫైనల్‌గా శాంసంగ్ ఏ ప్రాసెసర్‌తో మార్కెట్లోకి వస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read: ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!