Pakistan Players To Kavya Maran Marriage : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SRH) ఓనర్ కావ్య పాప ( Kavya Maran) మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో కావ్య పాప పెళ్లిపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. గ్రీస్ దేశంలో జరగనున్న వీళ్ళ పెళ్లికి పాకిస్తాన్ క్రికెటర్లు కూడా రాబోతున్నట్టు సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు వైరల్ చేస్తున్నారు.
సన్ రైజర్స్ లీడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అబ్రార్ అహ్మద్ తో ( Abrar Ahmed) పాటు ది 100 లీగ్ టోర్నమెంట్ ఆడిన ఉస్మాన్ తారీక్ ( Pakistan Players To Kavya Maran Marriage) హాజరు కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ గ్రీస్ (Greece) వచ్చేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా కావ్య పాప బుక్ చేయించినట్టు ప్రచారం చేస్తున్నారు. దీంతో మళ్లీ కావ్య పాప పై దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును బ్యాన్ చేయాల్సిందేనని మళ్లీ డిమాండ్లు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ వెధవలను కొనుగోలు చేయడమే తప్పంటే… ఇప్పుడు విందులు, వినోదాలకు కూడా రప్పిస్తే ఎలా అంటూ నిలదీస్తున్నారు.
కావ్య పాప పెళ్లికి పాకిస్తాన్ ప్లేయర్లు అబ్రార్ అహ్మద్ అలాగే ఉస్మాన్ తారీక్ లకు నిజంగానే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. తన పెళ్లి నేపథ్యంలో తన మూడు జట్ల క్రికెటర్లకు ఆహ్వాన పత్రికను అందించారు. ఇందులో భాగంగానే పాక్ క్రికెటర్లకు కూడా అందించారని సమాచారం. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉంటున్న ఈ ఇద్దరు… గ్రీసు దేశానికి వెళ్లడం కష్టమేనని అంటున్నారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా కావ్య పాప ఎలాంటి టికెట్లు బుక్ చేయించలేదని తెలుస్తోంది. కావాలని కొంత మంది కావ్య పాపను టార్గెట్ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు సమాచారం.
ఇది ఇలా ఉండగా కావ్య పాప (kavya maran) అలాగే అనిరుధ్ రవిచంద్రన్ వివాహం యూరప్ లోని గ్రీసు దేశంలో నవంబర్ 11వ తేదీన జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకను కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలోనే నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కానీ రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. నవంబర్ 21వ తేదీన ఈ వేడుక ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే అందరికీ ఆహ్వాన పత్రికలను కూడా కళానిధి మారన్ దంపతులు అందిస్తున్నారు.