E-Paper
Advertisement

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!
Advertisement

Samsung Galaxy SmartTag 3: శాంసంగ్ గ్యాడ్జెట్స్‌ను ఇష్టపడేవాళ్లకు ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. మనం ఎక్కడైనా వస్తువులు పెట్టి మర్చిపోతే.. వాటిని వెతుక్కుంటూ టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా చేసే స్మార్ట్‌ట్యాగ్ సిరీస్‌లోకి మరో కొత్త గ్యాడ్జెట్ వచ్చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ 3. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన ఈ డివైజ్ భారత్‌కు ఎప్పుడు వస్తుందనే ఆసక్తి టెక్ వర్గాల్లో నెలకొంది. అయితే, దీనిపై ఇప్పుడు ఓ కీలక అప్‌డేట్ బయటకు రావడంతో స్మార్ట్‌ట్యాగ్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆసక్తి మరింత పెరిగింది. ఇంతకీ ఈ చిన్న గ్యాడ్జెట్ మన దేశంలోకి ఎప్పుడొస్తుంది? ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరిలోనే భారత్‌కు..

శాంసంగ్ ఇండియా హెడ్ అయిన డైల్ కిమ్ ఇటీవల లింక్డ్‌ఇన్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. దాని ప్రకారం ఈ సరికొత్త ట్యాగ్ వచ్చే ఏడాది జనవరిలోనే ఇండియా మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుందని కన్ఫర్మ్ చేశారు. అయితే ఏ తారీఖున వస్తుంది? మన దేశంలో దీని ధర ఎంత ఉండొచ్చు? అనే విషయాలపై మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ధర మాత్రం అందరికీ అందుబాటులోనే ఉంటుందని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

Also Read: Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

ఇతర దేశాల్లో ధరలు ఇలా..

ఈ డివైజ్ ఇప్పటికే కొన్ని దేశాల్లో అమ్మకాలకు కూడా వచ్చేసింది. సౌత్ కొరియాలో సింగిల్ ట్యాగ్ ధర మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3,000 వరకు ఉంది. ఇక అమెరికా మార్కెట్లో సింగిల్ ట్యాగ్ సుమారు రూ.2,000 లభిస్తుండగా.. నాలుగు ట్యాగ్స్‌తో కూడిన బండిల్ ప్యాక్ మాత్రం దాదాపు రూ.9,000 వరకు విక్రయిస్తున్నారు. మన దేశంలో కూడా ధరలు ఇంచుమించు ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇది బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.

ఫీచర్స్ అదిరిపోయాయ్..

Advertisement

కీలకమైన వస్తువులు, పర్సులు, పెట్స్, లగేజ్ పోకుండా కాపాడుకోవడానికి ఈ స్మార్ట్‌ట్యాగ్ సూపర్‌గా పనిచేస్తుంది. ఇది ఐఫోన్‌లతో పాటు అన్ని గెలాక్సీ డివైజెస్‌కి సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం దీనికి ఐపీ67 రేటింగ్ ఇచ్చారు. అలాగే బ్లూటూత్ 6.0, అల్ట్రా-వైడ్‌బ్యాండ్ సపోర్ట్ ఉండటం వల్ల లొకేషన్ ట్రాకింగ్ మరింత కచ్చితంగా పనిచేస్తుంది. లొకేషన్ హిస్టరీ, ప్లేస్ నోటిఫికేషన్ లాంటి అదిరిపోయే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రెండేళ్ల బ్యాటరీ లేఫ్..

ఈ కొత్త ట్యాగ్‌లో చెప్పుకోదగ్గ మరో మెయిన్ అడ్వాంటేజ్ దీని బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి. సాధారణ వాడకంలో ఇది దాదాపు 550 రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఒకవేళ మీరు పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రం ఈ బ్యాటరీ లైఫ్ ఏకంగా 790 రోజుల వరకు వస్తుంది. అంటే దాదాపు రెండేళ్ల పాటు బ్యాటరీ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వాడొచ్చు అన్నమాట. బడ్జెట్‌లో మంచి ట్రాకింగ్ డివైజ్ కోరుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Also Read: ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

Tags

Related News

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

Big Stories

Advertisement
×