Amazon Sale 2026: దసరా వేళ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కాబట్టి చౌకగా ఎలక్ట్రానిక్ వస్తువులను దక్కించుకునేందుకు ఇదే మంచి ఛాన్స్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఐప్యాడ్ 11, స్మార్ట్ ఫోన్లను తక్కువకే దక్కించుకునే వెసులుబాటు అమెజాన్ కల్పిస్తోందని గుర్తు చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ ఐప్యాడ్ 11 అంగుళాల (128GB) వేరియంట్ అసలు ధర రూ. 67,900 కాగా ప్రస్తుతం ఇది అమెజాన్ లో రూ. 58,990కి లభిస్తోంది. దీంతో పాటు ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డ్ ఈఎంఐ (EMI) లావాదేవీలపై అదనంగా రూ. 3,000 ఫ్లాట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా మీ పాత డివైజ్ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే గరిష్టంగా రూ. 37,600 వరకు రాయితీ లభిస్తుంది. మెుత్తంగా ఈ ఆఫర్లన్నింటినీ కలుపుకుంటే ఈ ఐప్యాడ్ను మీరు రూ. 45,000 కన్నా తక్కువ ధరకే సులభంగా సొంతం చేసుకోవచ్చు.
ఈ ఐప్యాడ్ ఏ16 (A16) చిప్, ట్రూ టోన్ (True Tone) సపోర్ట్ కలిగిన 11 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లేతో వస్తుంది. ఇది 128GB నుండి 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తోంది. ఐప్యాడ్ఓఎస్ (iPadOS)పై పనిచేసే ఇది.. మల్టీటాస్కింగ్, ఆపిల్ పెన్సిల్ ఫీచర్లు (Scribble), యాప్ స్టోర్ ద్వారా అనేక అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫ్రంట్, రియర్ కెమెరాలు (రెండూ 12MP), యూఎస్బీ-సీ (USB-C) పోర్ట్, వై-ఫై 6, ఆప్షనల్ 5జీ కనెక్టివిటీ ఉన్నాయి.
అమెజాన్లో రూ. 25,000 బడ్జెట్లో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. వన్ప్లస్ N6x (6GB RAM, 128GB స్టోరేజ్) అసలు ధర రూ. 30,999 కాగా ప్రస్తుతం ఇది రూ. 22,499కే అమ్ముడవుతోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై మరో రూ. 1,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రొసెసర్తో పాటు 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Also Read: 8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!
ఐకూ Z11xa 5G (8GB + 128GB) వేరియంట్ అమెజాన్లో రూ. 28,998కే లభిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్పై 10 శాతం (రూ. 1,000 వరకు) ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా రూ. 27,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లన్నీ వర్తింపజేస్తే ఈ ఫోన్ను రూ. 20,000 లోపే దక్కించుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రొసెసర్తో పాటు 7,200mAh భారీ బ్యాటరీని దీనికి అందించారు.
Also Read: వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్తోపాటు 10% డిస్కౌంట్!