E-Paper
Advertisement

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!
Advertisement

Money Saving Tips: జీతం చేతికి రాగానే చిటికెలో ఖర్చయిపోతోందా? అయితే కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే భారీగా ఆదా చేసుకోవచ్చని లండన్‌కు చెందిన 28 ఏళ్ల యువతి లారెన్ థోర్ప్ నిరూపించారు. ఖర్చులకు సంబంధించి కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆమె కేవలం ఒక్క సంవత్సరంలోనే రూ. 6.5 లక్షల (5,000 పౌండ్లు) వరకు ఆదా చేయగలిగారు. లారెన్ థోర్ప్ తన పొదుపు చిట్కాలను నెట్టింట పంచుకుంటూ ఏంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ప్రతీ నెల జీతంలో 35 శాతం డబ్బును ఆదా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాటించిన మనీ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. సబ్‌స్క్రిప్షన్ల పునఃపరిశీలన

నెలవారీ సబ్‌స్క్రిప్షన్లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని లారెన్ సూచిస్తున్నారు. వాడకం లేని స్ట్రీమింగ్ సర్వీసులు, జిమ్ మెంబర్‌షిప్‌లను వెంటనే రద్దు చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. అలాగే కొత్త సర్వీస్ ప్రొవైడర్లను పోల్చి చూసి ఎంచుకోవడం ద్వారా ఏటా రూ. 1.28 లక్షల (1,000 పౌండ్లు) వరకు ఆదా చేసుకోవచ్చని ఆమె చెబుతున్నారు.

2. సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు

Advertisement

కొత్త సామాను లేదా దుస్తులు కొనేముందు ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్, స్థానిక గ్రూపులు, వింటెడ్, ఈబే, ఛారిటీ షాపులను పరిశీలించడం మంచిది. ముఖ్యంగా బట్టల విషయంలో ఈ పద్ధతి తనకు వేలాది రూపాయలు మిగిల్చిందని లారెన్ తెలిపారు. మనకు కావాల్సిన వస్తువు ఎవరో ఒకరు తక్కువ ధరకు అమ్మకానికి పెట్టే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

3. ఇంట్లోనే వంట చేసుకోవడం

బయట ఫుడ్ లేదా టేక్‌అవేలకు పెట్టే ఖర్చు తగ్గించుకోవాలి. నెలకు కేవలం ఒక్కసారి మాత్రమే రెస్టారెంట్ లేదా టేక్‌అవేకు వెళ్లేలా నియమం పెట్టుకుంటే ఏటా దాదాపు రూ. 1.02 లక్షల (800 పౌండ్లు) వరకు ఆదా అవుతుందని లారెన్ నిరూపించారు.

4. అత్యవసరమైతేనే గ్యాడ్జెట్ల అప్‌గ్రేడ్

Advertisement

కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చిందన్నంత మాత్రాన ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లను మార్చాల్సిన అవసరం లేదు. తన ఫోన్ పూర్తిగా చెడిపోయే వరకు వాడటం ద్వారా రూ. 77,000 వరకు ఆదా చేసినట్లు ఆమె చెప్పారు. ఐఫోన్ 12 లేదా 13 ఇప్పటికీ బాగానే పనిచేస్తున్నప్పుడు కొత్తది కొనాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

5. క్యాష్‌బ్యాక్ రివార్డుల వాడకం

షాపింగ్ చేసేటప్పుడు క్యాష్‌బ్యాక్, రివార్డ్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. లాయల్టీ కార్డులు, బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా లభించే క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఏటా రూ. 32,000 (250 పౌండ్లు) దాకా ఆదా చేసుకోవచ్చు. ఇవి షాపింగ్ భారాన్ని తగ్గించడంతో పాటు ఖర్చు చేసినందుకు ఉండే గిల్ట్ ఫీలింగ్‌ను కూడా తగ్గిస్తాయి.

6. ఇంట్లోనే బ్యూటీ మెయింటెనెన్స్

ప్రతిసారీ సెలూన్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు గోళ్లకు రంగు వేసుకోవడం, వాక్సింగ్, ఐబ్రోస్ వంటి వాటిని ఇంట్లోనే చేసుకోవడం ద్వారా ఏటా రూ. 32,000 ఆదా చేసుకోవచ్చని లారెన్ సూచిస్తున్నారు.

7. రివర్స్ ఫుడ్ షాపింగ్

గ్రాసరీ షాపింగ్‌కు వెళ్లేముందు ఫ్రిడ్జ్, ఫ్రీజర్, కప్‌బోర్డ్లలో ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఆ పదార్థాలతో ఏ వంటకాలు చేసుకోవచ్చో చాట్‌జీపీటీ (ChatGPT) సహాయంతో ఐడియాలు తీసుకుని కేవలం తక్కువగా ఉన్న వస్తువులను మాత్రమే బయటి నుంచి కొనుగోలు చేయాలి. దీనివల్ల ఏటా రూ. 77,000 ఆదా అవుతుంది.

8. తక్కువ ఖర్చుతో కూడిన సరదాలు

ఖరీదైన రెస్టారెంట్లు, పార్టీల కంటే లాంగ్ వాక్స్‌కు వెళ్లడం, పుస్తకాలు చదవడం, కాఫీ షాప్‌లకు వెళ్లడం లేదా స్నేహితులతో కలిసి ఇంట్లోనే వంట చేసుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇవి మనసుకు ప్రశాంతతనివ్వడంతో పాటు జేబుకు చిల్లు పడకుండా కాపాడతాయి.

Also Read: అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

9. ఆఫీసుకు లంచ్ బాక్స్ తీసుకెళ్లడం

ప్రతిరోజూ బయట లంచ్ కొనడం వల్ల నెల తిరిగేసరికి అది పెద్ద మొత్తంగా మారుతుంది. అందువల్ల ఇంట్లోనే చేసిన ఆహారాన్ని తీసుకెళ్లడం మంచిది. అలాగే అప్పుడప్పుడు ‘నో స్పాండ్ డే’ (డబ్బు ఖర్చు చేయని రోజు) పాటించడం ద్వారా కాఫీలు, స్వీట్ల వంటి అనవసరపు ఖర్చులకు చెక్ పెట్టవచ్చు.

Also Read: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

Tags

Related News

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

Big Stories

Advertisement
×