E-Paper
Advertisement

రూ.15,000 లోపు గూగుల్ అసిస్టెంట్ టీవీలు.. ఈ టాప్ రేటెడ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి బాస్!

రూ.15,000 లోపు గూగుల్ అసిస్టెంట్ టీవీలు.. ఈ టాప్ రేటెడ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి బాస్!
Advertisement

Best Google Assistant TVs: టీవీ అంటే కేవలం వార్తలు చూడటానికో లేక సీరియల్స్ కోసం మాత్రమే కాదు. మారుతున్న టెక్నాలజీ వలన మనకు నచ్చిన సినిమాను నచ్చినప్పుడు చూసేలా, మన మాట వినేలా టీవీలు మారిపోయాయి. ముఖ్యంగా గూగుల్ అసిస్టెంట్ ఉన్న ఆండ్రాయిడ్ టీవీలు వచ్చాక రిమోట్‌తో కుస్తీపడే అవసరం లేకుండా పోయింది. మన గొంతును గుర్తుపట్టి మనం అడిగిన పాటను లేదా సినిమాను వెతికి పెట్టే ఈ స్మార్ట్ టీవీలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ఏసర్, విడబ్ల్యూ, బ్లౌపంక్ట్ వంటి బ్రాండ్లు తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు ఇస్తున్నాయి. ఆ టాప్ మోడల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

Acer 43 Inch V Series 4K QLED TV

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం టీవీ కావాలనుకుంటే.. ఈ ఏసర్ 43 అంగుళాల క్యూలెడ్ టీవీని మించిన ఆప్షన్ మరొకటి ఉండదు. ఇది గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. దీనివల్ల లోడింగ్ సమస్యలు లేకుండా యాప్స్ అన్నీ చాలా స్పీడ్‌గా రన్ అవుతాయి. అలాగే ఈ టీవీలో ఉండే 4K క్వాలిటీ, డాల్బీ విజన్ వల్ల మనం చూసే ప్రతీ సీన్ కళ్లకు కట్టినట్లు రంగులమయంగా కనిపిస్తుంది. అంతేకాదు.. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఉండటం వల్ల రిమోట్ పని లేకుండానే టీవీని కంట్రోల్ చేయొచ్చు.

Advertisement

Also Read: ఏసీ లాంటి చల్లదనం.. బడ్జెట్ ధరలో ‘థర్మల్ ప్రొటెక్షన్’‌ ఉన్న బెస్ట్ ఎయిర్ కూలర్లు!

Blaupunkt 55 Inch Cyber ​​Sound G2 Series

హాలులో పెద్ద స్క్రీన్ పెట్టి థియేటర్ లాంటి ఫీలింగ్ రావాలనుకునే వారికి బ్లౌపంక్ట్ 55 అంగుళాల టీవీ భలే సెట్ అవుతుంది. దీని అసలు సిసలు బలం దీని సౌండ్ క్వాలిటీ. 60 వాట్ల స్పీకర్లు ఉండటం వల్ల విడిగా హోమ్ థియేటర్ కొనే ఖర్చు కూడా మిగిలిపోతుంది. ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ మీద నడుస్తుంది కాబట్టి.. మనకు కావాల్సిన యాప్స్ అన్నీ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్‌బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ వల్ల సెర్చ్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది.

VW 32 Inch Frameless Series

Advertisement

బెడ్‌రూమ్ కోసం లేదా చిన్న గదుల కోసం తక్కువ ఖర్చులో మంచి టీవీ కావాలనుకుంటే ఈ విడబ్ల్యూ బ్రాండ్‌ను ట్రై చేయొచ్చు. దీని డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. స్క్రీన్ చుట్టూ అంచులు అస్సలు కనిపించవు. ఇది స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్లతో వస్తుంది కాబట్టి.. వాడటం కూడా చాలా ఈజీ. అలాగే వాతావరణ వివరాలు, లేటెస్ట్ న్యూస్ అప్‌డేట్స్ అన్నీ గూగుల్ అసిస్టెంట్‌ను అడిగి చిటికెలో తెలుసుకోవచ్చు. తక్కువ ధరలో మంచి స్మార్ట్ టీవీ కావాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఈ టీవీ బెస్ట్ ఛాయిస్.

Acer 55 Inch Advanced i Series

టీవీలో బొమ్మ క్లారిటీగా ఉండాలి, కలర్స్ అదిరిపోవాలి అనుకునే వారి కోసం ఏసర్ ఐ సిరీస్ బెటర్ అనే చెప్పాలి. ఇది 4K అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది కాబట్టి.. విజువల్స్ చాలా రిచ్‌గా ఉంటాయి. అలాగే దీనిలో ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో మన ఫోన్‌లో ఉన్న ఫొటోలను, వీడియోలను డైరెక్ట్‌గా టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. దీని సాఫ్ట్‌వేర్ వాడటం చాలా ఈజీగా ఉంటుంది. దీంతో ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా ఈజీగా ఆపరేట్ చేయగలరు.

Blaupunkt 43 Inch Cybersound Full HD TV

మరీ పెద్ద టీవీ వద్దు, అలాగని మరీ చిన్నది కాకూడదు అనుకునే వాళ్లకు 43 అంగుళాల మోడల్ పర్ఫెక్ట్. దీనిలో సౌండ్ చాలా స్పష్టంగా వినబడుతుంది. ఆండ్రాయిడ్ టీవీ కావడం వల్ల నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, హాట్‌స్టార్ వంటివన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే రిమోట్‌లోనే గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది కాబట్టి.. మనకు కావాల్సిన మూవీ లేదా సాంగ్‌ను నోటి ద్వారానే చెప్పవచ్చు.

Also Read: 8,000mAh బ్యాటరీ, అదిరిపోయే కూలింగ్ ఫ్యాన్‌తో ‘Oppo K15 Pro’ సిరీస్ లాంచ్!

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×