Data Security: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు ఇంటర్నెట్‌లో నిరంతరం ఏదోక రూపంలో చక్కర్లు కొడుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా హ్యాకర్లు.. డేటాను క్షణాల్లో చోరీ చేసే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లకు బారి నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ డేటాను డిజిటల్ ప్రపంచంలో భద్రంగా ఉంచుకునే ఆ 5 ముఖ్యమైన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నెట్ వాడేటప్పుడు అసలు లొకేషన్, ఐపీ (IP) అడ్రస్ బహిర్గతం కాకుండా ఉండటానికి మంచి విపిఎన్ (VPN – Virtual Private Network) వాడటం చాలా అవసరం. ఇది డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి సైబర్ క్రిమినల్స్ కంట పడకుండా రక్షిస్తుంది.
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీ అసలు క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలకు బదులుగా ‘వర్చువల్ కార్డ్‌లు’ ఉపయోగించండి. అలాగే అనవసర వెబ్‌సైట్లలో సైన్ అప్ అవ్వడానికి టెంపరరీ ఈమెయిల్ అడ్రస్‌లను వాడటం మంచింది. దీని వల్ల మీ డేటా సేఫ్ గా ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
కేవలం ఒక్క పాస్‌వర్డ్ మీ ఖాతాలకు పూర్తి రక్షణ ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఆన్‌లైన్ ఖాతాకు ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ ఆన్ చేసుకోండి. దీనివల్ల ఎవరైనా మీ పాస్‌వర్డ్ తెలుసుకున్నా మీ ఫోన్‌కు వచ్చే ప్రత్యేక ఓటీపీ (OTP) లేదంటే యాప్ అప్రూవల్ లేకుండా ఖాతాను ఓపెన్ చేయలేరు.
సాధారణ వెబ్ బ్రౌజర్లు సెర్చ్ చేసే సమాచారం ఆధారంగా మిమ్మల్ని ట్రాక్ చేస్తాయి. దానికి బదులుగా ‘Brave’, ‘DuckDuckGo’ లేదా ‘Tor’ వంటి ప్రైవసీకి పెద్దపీట వేసే బ్రౌజర్లను వాడండి. ఇవి మీ డిజిటల్ అడుగుజాడలను ఇంటర్నెట్‌లో నమోదు కాకుండా తుడిచేస్తాయి.
Also Read: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?
పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఉచిత వైఫై లేదా బ్లూటూత్‌లను ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయ్యేలా ఉంచొద్దు. హ్యాకర్లు తరచుగా పబ్లిక్ వైఫైల ద్వారానే పరికరాల్లోకి ప్రవేశిస్తారు. అవసరం లేనప్పుడు వైఫై, బ్లూటూత్ ఆఫ్‌లో ఉంచడం ఎల్లప్పుడు మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: పోలవరం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!