E-Paper
Advertisement

Galaxy A57 A37 5G: ట్రిపుల్ రెయిర్ కెమెరాలతో రెండు మిడ్ రేంజ్ ప్రీమయం ఫోన్స్ లాంచ్ చేసిన శాంసంగ్.. ధర ఎంతంటే?

Galaxy A57 A37 5G: ట్రిపుల్ రెయిర్ కెమెరాలతో రెండు మిడ్ రేంజ్ ప్రీమయం ఫోన్స్ లాంచ్ చేసిన శాంసంగ్.. ధర ఎంతంటే?
Advertisement

Galaxy A57 A37 5G| శాంసంగ్ బ్రాండ్‌లో గెలాక్సీ A-సిరీస్‌ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లు చాలా పాపులర్. ఈ సిరీస్‌లో తాజాగా రెండు కొత్త ఫోన్లు విడుదలయ్యాయి. వీటి పేర్లు శాంసంగ్ గెలాక్సీ A37 5G, శాంసంగ్ గెలాక్సీ A57 5G. ఈ ఫోన్లు మెరుగైన కెమెరా, బలమైన పర్‌ఫామెన్స్, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో వచ్చాయి. చాలా మంది యూజర్లు ఈ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అవి మార్కెట్‌లోకి వచ్చాయి.

డిస్‌ప్లే, డిజైన్

రెండు ఫోన్లలోనూ 6.7 ఇంచుల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. విజన్ బూస్టర్ టెక్నాలజీ బయట ఎండలో కూడా స్పష్టమైన ఫొటోలు తీస్తుంది. రెండు ఫోన్లు ప్రీమియం డిజైన్‌తో, ఆధునిక లుక్‌తో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్, అప్‌డేట్లు

Advertisement

ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తాయి. One UI 8.5 ఇంటర్‌ఫేస్ ఉపయోగించడం వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా సులభంగా ఉంటుంది. శాంసంగ్ ఆరు జెనెరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తుంది. దీంతో ఫోన్ చాలా కాలం వరకు సురక్షితంగా, కొత్తగా అప్డేటెడ్స్‌తో ఉంటుంది.

పర్‌ఫామెన్స్, ప్రాసెసర్

శాంసంగ్ గెలాక్సీ A57 5Gలో ఎక్సినోస్ 1680 చిప్‌సెట్, గెలాక్సీ A37 5Gలో ఎక్సినోస్ 1480 ప్రాసెసర్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఉన్నాయి. ఇవి రోజువారీ పనులు, యాప్స్, మల్టీటాస్కింగ్ సులభంగా రన్ చేస్తాయి.

కెమెరా ఫీచర్లు

Advertisement

రెండు ఫోన్లలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా f/1.8 అపర్చర్‌తో బాగా వివరాలు క్యాప్చర్ చేస్తుంది. A57 5Gలో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. A37 5Gలో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. రెండింటిలోనూ 5MP మాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 12MPతో సెల్ఫీలు బాగుంటాయి. AI ఫీచర్లు ఫోటోలను మరింత అందంగా చేస్తాయి.

AI ఫీచర్లు, స్మార్ట్ టూల్స్

ఈ ఫోన్లలో అనేక AI ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ ద్వారా మాటలను టెక్స్ట్‌గా మార్చవచ్చు. AI సెలెక్ట్ ఫీచర్ కంటెంట్‌ను స్మార్ట్‌గా గుర్తిస్తుంది. సర్కిల్ టు సెర్చ్, ఆటో ట్రిమ్ వంటి ఫీచర్లు వీడియో ఎడిటింగ్‌ను సులభం చేస్తాయి. ఇవి ఉత్పాదకతను పెంచుతాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

రెండు ఫోన్లలోనూ 5,000mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఉపయోగించవచ్చని శాంసంగ్ చెబుతోంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీతో 30 నిమిషాల్లో 0 నుంచి 60 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

Also Read:  చీప్ టెంపర్డ్ గ్లాస్ కొంటున్నారా? ఫోన్‌లో ఈ సమస్యలకు కారణం అదే

బిల్డ్ క్వాలిటీ, సెక్యూరిటీ

A57 5G బరువు సుమారు 179 గ్రాములు, A37 5G బరువు సుమారు 196 గ్రాములు. రెండు ఫోన్లకూ IP68 రేటింగ్ ఉంది. దీంతో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. నాక్స్ వాల్ట్ ఫీచర్ సున్నితమైన డేటాను రక్షిస్తుంది.

ధరలు

గెలాక్సీ A57 5G ధరలు:
8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999.
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,499.

గెలాక్సీ A37 5G ధరలు :
8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999.
8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.47,499.
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,999.

ఈ రెండు ఫోన్లు కూడా అమెజాన్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ A37 5G, A57 5G రెండు ఫోన్లలో బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు, బలమైన పనితీరు, దీర్ఘకాలిక సపోర్ట్ ఇస్తాయి. మిడ్-రేంజ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇవి మంచి ఆప్షన్.

ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ధరలు.. ఆ కంపెనీ, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కస్టమర్లు ఫోన్ ఫీచర్లు, ధరలు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న స్మార్ట్‌ఫోన్ ధరలు మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ ఈ విషయాలకు బాధ్యత వహించదు.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×