E-Paper
Advertisement

130-Inch Micro RGB TV: ప్రపంచంలో మొట్టమొదటి 130-ఇంచ్ మైక్రో RGB టివి లాంచ్.. నెక్స్‌ట్ జెనె ఫీచర్లతో శాంసంగ్ టెక్

130-Inch Micro RGB TV: ప్రపంచంలో మొట్టమొదటి 130-ఇంచ్ మైక్రో RGB టివి లాంచ్.. నెక్స్‌ట్ జెనె ఫీచర్లతో శాంసంగ్ టెక్
Advertisement

Samsung 130-Inch Micro RGB TV| కొరియా టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో మొదటి 130 అంగుళాల మైక్రో RGB టీవీని లాంచ్ చేసింది. ఈ మోడల్ పేరు శాంసంగ్ మైక్రో RGB టీవీ R95H. ఈ టివి శాంసంగ్‌ బ్రాండ్‌లో అతిపెద్ద, అత్యాధునిక మైక్రో RGB డిస్‌ప్లే కలిగి ఉంది.

ఈ కొత్త టెలివిజన్‌తో అల్ట్రా-ప్రీమియం హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలనేదే శాంసంగ్ లక్ష్యం. అత్యాధునిక కలర్ టెక్నాలజీని ఆకర్షణీయ డిజైన్‌తో కలిపి, స్క్రీన్ సాధారణ టీవీ కాకుండా ఇమ్మర్సివ్ విజువల్ విండో లాగా అనిపించేలా చేశారు. లాస్ వేగాస్‌లో జరుగుతున్న CES 2026లో ఈ 130 అంగుళాల మైక్రో RGB టీవీని ప్రదర్శించారు.

డిస్‌ప్లే ఇన్నోవేషన్‌లో శాంసంగ్ మైల్ స్టోన్

Advertisement

శాంసంగ్అధికారులు మైక్రో RGB టివిని తమ పిక్చర్ క్వాలిటీ డెవలప్మెంట్‌లో ఒక మైల్ స్టోన్ లాంటిదన్నారు.
130 అంగుళాల వెర్షన్ ఈ దృష్టిని మరింత పెద్ద స్క్రీన్, మెరుగైన ఇంజినీరింగ్‌తో ముందుకు తీసుకెళ్తుంది. అత్యాధునిక టెక్నాలజీని ప్రీమియం డిజైన్‌తో ఈ టివిలో మేళవించడం జరిగిందని శాంసంగ్ తెలిపింది. ఆధునిక లివింగ్ స్పేస్‌లు, భవిష్యత్ ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలకు సరిపడే డిస్‌ప్లే ఇది.

ఆర్ట్ లాగా కనిపించేలా డిజైన్

మైక్రో RGB టివిలో భారీ స్క్రీన్ బలమైన విజువల్ ప్రెజెన్స్ ఇస్తుంది. సాధారణ టీవీ కాకుండా డిజైన్ స్టేట్‌మెంట్ లాగా కనిపించేలా రూపొందించారు. 2013లో వచ్చిన టైమ్‌లెస్ గ్యాలరీ కాన్సెప్ట్.. ఆధునిక వెర్షన్‌ను ఫ్రేమ్‌గా ఉపయోగించారు. దీన్ని “టైమ్‌లెస్ ఫ్రేమ్” అంటున్నారు. పెద్ద ఆర్కిటెక్చరల్ విండోల నుంచి ప్రేరణ పొందారు. స్క్రీన్ ఫ్రేమ్ లోపల ఫ్లోటింగ్ లాగా కనిపించి ఆర్టిస్టిక్ లుక్ ఇస్తుంది. గది మొత్తాన్ని ఆకర్షించే సెంటర్‌పీస్‌గా మారుతుంది.

ఫ్రేమ్‌లోనే ఇమ్మర్సివ్ ఆడియో సిస్టమ్

Advertisement

టీవీ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మెరుగుపరిచారు. స్పీకర్లు డిస్‌ప్లే ఫ్రేమ్‌లోనే ఇంటిగ్రేట్ చేశారు. భారీ స్క్రీన్ సైజుకు తగ్గట్టు సౌండ్ అవుట్‌పుట్ ఉంటుంది. ఆడియో, విజువల్స్ సహజంగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. పెద్ద లివింగ్ స్పేస్‌లలో బ్యాలెన్స్‌డ్ సౌండ్ అందుతుంది.

ఏఐ పవర్‌తో అత్యాధునిక పిక్చర్ టెక్నాలజీ

130 అంగుళాల మైక్రో RGB టీవీలో శాంసంగ్ మైక్రో RGB AI ఇంజిన్ ప్రో ఉంది. మైక్రో RGB కలర్ బూస్టర్ ప్రో, మైక్రో RGB HDR ప్రో వంటి టెక్నాలజీలు ఏఐతో పనిచేస్తాయి. మసక రంగులను కూడా ఈ టెక్నాలజీ మెరుగుపరుస్తుంది. ప్రతి సీన్‌లో కాంట్రాస్ట్ పెంచుతాయి. చీకటి గదుల్లో రియలిస్టిక్ విజువల్స్ చూపిస్తుంది. అధిక పిక్చర్ ఫైడెలిటీ, డీప్ విజువల్ డెప్త్ లభిస్తుంది.

Also Read: 2025 కెమెరా ర్యాంకింగ్స్‌లో కెనన్, నికాన్, సోనీ కంపెనీలకు షాక్.. అగ్రస్థానంలో ఆ బ్రాండ్

ప్రెసిషన్ కలర్, గ్లేర్ రిడక్షన్ ఫీచర్లు

మైక్రో RGB ప్రెసిషన్ కలర్ 100 టెక్నాలజీతో BT.2020 వైడ్ కలర్ గామట్‌లో 100 శాతం కలర్స్ అందుతాయి. రంగులు లైఫ్‌లైక్‌గా కనిపిస్తాయి. VDE సర్టిఫికేషన్ ఉంది. గ్లేర్ ఫ్రీ టెక్నాలజీతో ప్రకాశవంతమైన గదుల్లో రిఫ్లెక్షన్స్ తగ్గుతాయి. ఏ లైటింగ్‌లోనైనా స్థిరమైన రంగులు, కాంట్రాస్ట్ లభిస్తాయి.

స్మార్ట్ ఫీచర్లు, నెక్స్ట్ జెనరేషన్ ఎంటర్‌టైన్‌మెంట్

HDR10+ అడ్వాన్స్‌డ్, ఎక్లిప్సా ఆడియో, విజన్ AI కంపానియన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కన్వర్సేషనల్ సెర్చ్, పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ అందుతాయి. AI ఫుట్‌బాల్ మోడ్ ప్రో, AI సౌండ్ కంట్రోలర్ ప్రో, లైవ్ ట్రాన్స్‌లేట్, జెనరేటివ్ వాల్‌పేపర్ ఫీచర్లు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కోపైలట్, పెర్ప్లెక్సిటీ వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×