E-Paper
Advertisement

Samsung Slim Discount: 200MP కెమెరాగల శాంసంగ్ స్లిమ్ ఫోన్‌పై రూ.17000 డిస్కౌంట్.. ఎక్కడంటే

Samsung Slim Discount: 200MP కెమెరాగల శాంసంగ్ స్లిమ్ ఫోన్‌పై రూ.17000 డిస్కౌంట్.. ఎక్కడంటే
Advertisement

Samsung Slim Phone Discount| శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ (Galaxy S25 Edge). ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌లో లభిస్తోంది. దాదాపు రూ.17,000 వరకు ధర తగ్గింది. ఇది లిమిటెడ్ ఆఫర్.. కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. విజయ్ సేల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ధర, డిస్కౌంట్ వివరాలు

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ని రూ.1,09,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ విజయ్ సేల్స్ ఆఫర్‌లో ఇప్పుడు కేవలం రూ.93,644కే దొరుకుతోంది. అంటే రూ.16,000 పైగా డిస్కౌంట్! ఈ ధర 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్‌తో మరో రూ.1,000 అదనంగా సేవింగ్స్ పొందవచ్చు.

డిజైన్

Advertisement

ఈ ఫోన్ మందం కేవలం 5.8 mm మాత్రమే! ఇది శాంసంగ్ తయారు అతి సన్నని ఫోన్. సాధారణ గెలాక్సీ S25 మందం 7.2 mm ఉంటుంది. కానీ, ఈ Edge మోడల్ చాలా స్లిమ్‌గా, చేతికి అదిరిపోయే ఫీల్ ఇస్తుంది. ప్రీమియం లుక్ ఉంటుంది.

డిస్‌ప్లే

దీని డిస్‌ప్లే కూడా అద్భుతం. 6.7 అంగుళాల పెద్ద Dynamic AMOLED 2X స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. స్క్రోలింగ్, వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా ఉంటాయి. రంగులు, కాంట్రాస్ట్ సూపర్. అంతేకాకుండా కొత్త కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొటెక్షన్ ఉంది కాబట్టి గీతలు పడే ఛాన్స్ చాలా తక్కువ.

కెమెరా

Advertisement

కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుకవైపు 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫోటోలు అద్భుతంగా, చాలా డీటెయిల్‌గా వస్తాయి. ముందు సెల్ఫీ కెమెరా కూడా 12 మెగాపిక్సల్‌దే కాబట్టి సెల్ఫీలు కూడా సూపర్.

పర్‌ఫామెన్స్

పనితీరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12 GB RAM ఉండటంతో ఏ పనైనా లైట్‌నింగ్ స్పీడ్‌లో జరుగుతుంది. హెవీ గేమ్స్, మల్టీ టాస్కింగ్ – అన్నీ స్మూత్‌గానే నడుస్తాయి.

బ్యాటరీ

బ్యాటరీ 3,900 mAh ఉంది. రోజంతా సాధారణ వాడకానికి సరిపోతుంది. వైర్‌లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సన్నని డిజైన్ కాబట్టి బ్యాటరీ సైజు, కెపాసిటీ కొంచెం తక్కువే (సాధారణ S25లో 4,700 mAh ఉంటుంది) కానీ రోజువారీ అవసరాలకు పూర్తిగా సరిపడుతుంది..

మొత్తంమీద చూస్తే Galaxy S25 Edge అంటే స్టైల్, పవర్, అద్భుతమైన కెమెరా – అన్నీ ఒకే డివైజ్‌లో పొందవచ్చు. ఇంత భారీ డిస్కౌంట్ ఇప్పుడే లభిస్తోంది.. వెంటనే ఆర్డర్ చేయండి.. ఆలస్యం ఎందుకు?

Also Read: వాట్సాప్‌తో నెలకు లక్షల్లో సంపాదించే ట్రిక్.. ఎలాగంటే

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×