E-Paper
Advertisement

మనిషికి నిజంగానే మూడవ కన్ను ఉంది… పరిశోధనల్లో బయటపడ్డ షాకింగ్ నిజం

మనిషికి నిజంగానే మూడవ కన్ను ఉంది… పరిశోధనల్లో బయటపడ్డ షాకింగ్ నిజం
Advertisement

Human Third Eye : పురాణాలకి సైన్స్ కి మధ్య ఎప్పటికీ పొంతన కుదరదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనం పురాణాల్లో చూసేది విన్నది, చదివిందే, నమ్మిందే నిజమని సైన్స్ లో కూడా ప్రూవ్ అయింది. అలాగే తాజాగా మనుషులకు మూడవ కన్ను నిజంగానే ఉందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మరి ఈ మూడో కన్ను సంగతేంటి ? తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన షాకింగ్ విషయం ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

మూడవ కన్ను అనగానే మనకు గుర్తొచ్చేది మహాశివుడు. కానీ ఒకప్పుడు నిజంగానే మనుషులకు కూడా మూడో కన్ను ఉండేదట. ఇటీవల శాస్త్రవేత్తలు ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనిపెట్టారు. కానీ ఇప్పుడు ఆ కన్ను క్షీణించిపోయింది. అంటే ఇప్పటికీ మనలో ఆ మూడో కన్ను ఉన్నప్పటికీ, అది బయటకు కనిపించదు. దాంతో చూడలేము కూడా. కానీ అది నిద్రను, మన శరీర గడియారాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ మూడో కన్ను మరేదో కాదు. మన తల మధ్యలో దాగి ఉన్న పీనియల్ గ్రంథి. కరెంట్ బయాలజీ జర్నల్ లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన పత్రం ప్రకారం… పరిశోధకులు లక్షల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులకు ఒక మధ్య కన్ను ఉండేదని, అది కాలక్రమేణా పీనియల గ్రంథిగా పరిణామం చెందిందని పేర్కొన్నారు.

Advertisement

ఈ ఆవిష్కరణ మన కళ్ళు, శరీర గడియారం పరిణామం గురించి ఒక కొత్త కథను వెల్లడిస్తోంది. సుమారు 500 కోట్ల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు సముద్రం దగ్గర బురదతో నిండిన చీకటి గుహల్లో, సొంరంగాలో నివసించే సముద్ర జీవులుగా ఉండే వారట. అయితే చీకట్లో ఏమీ కనిపించకుండా ఉండటం వల్ల ఈ జీవుల రెండు పక్క కళ్ళు పని చేయడం మానేశాయట. అప్పట్లో తల మధ్యలో ఒక ప్రత్యేక నిర్మాణం ఉండేదని తెలుస్తోంది. దీన్నే పరిశోధకులు ‘సంయుక్త పూర్విక మధ్య కన్ను’ అని పిలుస్తున్నారు. ఈ మధ్య కన్ను కాంతిని గుర్తించడానికి, పగలు రాత్రిని తెలుసుకోవడానికి, దారిని చూపడానికి హెల్ప్ అయ్యేదట. పరిశోధకులు, ప్రొఫెసర్ టామ్ బార్డెన్ ప్రకారం… ఈ మధ్య కన్ను కన్నులోని భాగాలు రెండువైపులా కదిలి ప్రస్తుతం మనం రెటీనాగా పిలుచుకుంటున్న భాగంగా మారింది. అలాగే మధ్య భాగం పీనియల్ గ్రంథిగా పరిణామం చెందింది.

అసలు ఈ పీనియల్ గ్రంథి ఏం చేస్తుంది ?

పీనియల్ గ్రంధి అంటే మన మెదడు మధ్యలో ఉండే ఒక చిన్న అవయవం. ఇది కాంతిని నేరుగా గ్రహించదు. కానీ మన రెండు కళ్ళ నుండి కాంతి, చీకటి గురించిన సమాచారాన్ని అందుకుని, హార్మోనును ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రాత్రి సమయంలోనే ఆ గ్రంథి మెలటోనిన్ ను రిలీజ్ చేస్తుంది. అదే మనకు నిద్ర పోవడానికి టైం అయ్యిందని తెలియజేస్తుంది. అంటే మన మెంటల్ స్టేట్ ను, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా పునరుత్పత్తి వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, మానసిక స్థితి, శరీర ఉష్ణోగ్రతపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.

Advertisement

కాగా కంటి కంటే ముందే రెటీనా పరిణామం చెందిందని పరిశోధకులు చెబుతున్న మాట. లోతైన నీటిలో లేదా బురదలో రాత్రిని – పగలుని వేరు చేయడానికి, అలాగే పైకి – కిందకి అనే దిశలని తెలుసుకోవడానికి ఇది చాలా కీలకమని ప్రొఫెసర్ టామ్ బాడెన్ వివరించారు. అయితే నిజానికి ఈ అధ్యయనం కొత్తగా ప్రయోగాలు ఏమి నిర్వహించలేదు. కానీ పరిశోధకులు జన్యు సమాచారం, శిలాజాలు, చేపలు, ఇతర జీవులపై ఇప్పటికే ఉన్న అధ్యయనాలను విశ్లేషించారు. దాని ఫలితంగానే మన కళ్ళు, పీనియల్ గ్రంథి విడివిడిగా అభివృద్ధి చెందలేదని, ఓకే నిర్మాణం నుండి పరిణామం చెందాయని తేలింది.

Also Read : రెండ్రోజుల బ్యాటరీ లైఫ్‌… కొత్తగా లాంచ్ అయిన ఈ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే భయ్యా

మూడో కన్ను ఉన్న జీవి 

ఇప్పటికీ కొన్ని జంతువులలో ఈ మూడో కన్ను స్పష్టంగా కనిపిస్తుంది. టువాటార అనే న్యూజిలాండ్ సరీసౄపం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. దాని తలపై కటకంతో కూడిన ఒక చిన్న కన్ను ఉంటుంది. అది సరిగ్గా చూడలేదు కానీ, పైనుంచి వచ్చే కాంతులను మాత్రం గుర్తిస్తుంది. ఇది టువాటారాకు పగలు – రాత్రి మధ్య తేడాను గుర్తించడం, ఎండలో సేద తీరాలో లేక దాక్కొవాలో నిర్ణయించుకోవడానికి సహాయపడుతుంది.

ప్రాచీన కాలం నుండి పీనియల్ గ్రంధికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రీకు వైద్యులకు వేల సంవత్సరాల క్రితమే దీని గురించి తెలుసు. అలాగే హిందూ యోగ సాంప్రదాయాలలో దీనిని ఆజ్ఞా చక్రం లేదా మూడవ కన్ను అని పిలుస్తారు. యోగ లేదా ధ్యానంలో దీనిని మేలుకొలపడం వలన అంతర్దృష్టి, సహజజ్ఞానం, అతింద్రీయ దృష్టి ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలుగుతాయని చెప్తారు. అయితే ఈ ఆధ్యాత్మిక శక్తులను శాస్త్రం ఇంకా నిరూపించలేదు. కానీ ఈ అవయవం ప్రధానంగా జీవ సంబంధమైన విధులకు హెల్ప్ చేస్తుందని శాస్త్రవేత్తలో నమ్ముతున్నారు. ఇది 50 కోట్ల సంవత్సరాల నాటి కథకు సజీవ సాక్ష్యం అని చెప్పొచ్చు. ఆ కాలంలో మన పూర్వీకులు ఒకే మధ్య కన్నుతో చీకటి గుహలో జీవించారు అనేది తాజాగా నిరూపితమైంది.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×