E-Paper
Advertisement

Search Photos On Phone: మీ ఫోన్‌లో ఫోటోలు సెర్చ్ చేయడం కష్టంగా ఉందా? ఇలా చేస్తే సెకన్లలో పని పూర్తి

Search Photos On Phone: మీ ఫోన్‌లో ఫోటోలు సెర్చ్ చేయడం కష్టంగా ఉందా? ఇలా చేస్తే సెకన్లలో పని పూర్తి
Advertisement

Search Photos On phone| స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించే ప్రతి ఒక్కరూ వాటితో ఫొటోలు తీస్తుంటారు. తమ బంధువులకు, మిత్రులకు షేర్ చేస్తారు. వారు కూడా సెండ్ చేస్తారు. దీంతో ప్రతి నెలా వందల ఫోటోలు ఫోన్‌లో స్టోర్ అవుతుంటాయి. అన్ని ఫోటోలను మేనేజ్ చేయడం కష్టమవుతుంది. అత్యవసరంగా ఒక ఫోటో కావాలంటే గ్యాలరీలో ఉండే అన్ని ఫొటోలను స్క్రోల్ చేస్తూ సమయం వృథా అవుతుంది. దీని పరిష్కారంగా ఒక సులభమైన ట్రిక్ ఉంది. గూగుల్ ఫోటోస్ యాప్ ఉపయోగించి సెకన్లలో ఏ ఫోటోనైనా కనుగొనవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ పనిచేస్తుంది.

ఫొటో వెతికేందుకు ఈ మూడు స్టెప్స్ పాటించండి

స్టెప్ 1: ఫొటోస్ సేవ్ చేయడానికి గూగుల్ ఫోటోస్ ఓపెన్ చేయండి

మీ ఫోన్‌లో గూగుల్ ఫోటోస్ యాప్ తెరవండి. మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయి ఉండాలి. మీరు వెతకాలనుకున్న ఫోటోను ఓపెన్ చేయండి. ఇది కొత్త ఫోటో కావచ్చు, స్క్రీన్‌షాట్ కావచ్చు లేదా ఎవరైనా పంపిన ఫోటో కావచ్చు. ఫోటోను ఫుల్ స్క్రీన్‌లో చూడండి.

స్టెప్ 2: ఫోటోకు క్యాప్షన్ జోడించండి

Advertisement

ఫోటోపై క్రింది నుంచి పైకి స్వైప్ చేయండి. అదనపు ఆప్షన్లు కనిపిస్తాయి. “Add a caption…” అనే ఫీల్డ్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి ఫోటోకు సులభంగా గుర్తుండే పేరు రాయండి. ఉదాహరణకు “బర్త్‌డే కేక్”, “బీచ్ ట్రిప్”, “అమ్మ పుట్టినరోజు” లాంటివి. పేరు టైప్ చేసిన తర్వాత బ్యాక్ స్వైప్ చేయండి. గూగుల్ ఫోటోస్ ఆటోమాటిక్‌గా సేవ్ చేస్తుంది.

స్టెప్ 3: ఫోటోను సెర్చ్ చేయండి

గూగుల్ ఫోటోస్ యాప్‌లో కుడివైపు క్రింది భాగంలో సెర్చ్ ఐకాన్ (మాగ్నిఫైయింగ్ గ్లాస్) ఉంటుంది. దానిపై ట్యాప్ చేయండి. సెర్చ్ బార్ కనిపిస్తుంది. మీరు ఇచ్చిన క్యాప్షన్ పేరును టైప్ చేయండి. వెంటనే ఆ పేరుతో ఉన్న ఫోటోలు కనిపిస్తాయి. గ్యాలరీలో స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు.

క్యాప్షన్ జోడించడం వల్ల లాభాలు

Advertisement

ఫోటోలకు క్యాప్షన్ పెడితే భవిష్యత్తులో త్వరగా కనుగొనవచ్చు. స్నేహితులకు సులభంగా షేర్ చేయవచ్చు. గ్యాలరీ ఆర్గనైజ్‌డ్‌గా ఉంటుంది. పాత ఫోటోలకు కూడా ఇప్పుడు క్యాప్షన్ జోడించవచ్చు. అదే స్టెప్స్ ఫాలో అవ్వండి.

గూగుల్ ఫోటోస్‌ మెనేజ్ చేయడానికి ఈజీ టిప్స్

  • చిన్న, సులభమైన క్యాప్షన్లు ఉపయోగించండి
  • స్థలం, ఈవెంట్, వ్యక్తుల పేర్లు యాడ్ చేయండి
  • గూగుల్ ఫోటోస్‌ సింక్ చేసి ఎక్కువ డివైస్‌లలో ఉపయోగించండి
  • ఫోటో తీసిన వెంటనే లేదా వచ్చిన వెంటనే క్యాప్షన్ పెట్టండి

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది ఫాలోవర్స్‌‌తో ఎంత సంపాదన వస్తుంది? ఇలా లెక్కించాలి

స్క్రీన్‌షాట్‌లు, షేర్డ్ ఫోటోలకు కూడా పనిచేస్తుంది

ఈ ట్రిక్ స్క్రీన్‌షాట్‌లు, డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌లు, వాట్సాప్ లేదా ఈమెయిల్‌లో వచ్చిన ఫోటోలకు కూడా పనిచేస్తుంది. స్పష్టమైన క్యాప్షన్ పెడితే గూగుల్ ఫోటోస్ ఆటోమాటిక్‌గా ఇండెక్స్ చేస్తుంది. సెర్చ్ చాలా ఫాస్ట్ అవుతుంది.

ఇక గ్యాలరీ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ ఫోటోస్‌లో క్యాప్షన్లు పెట్టడం వల్ల మీకు కావాల్సిన ఫోటోలు సెకన్లలో మీ ముందుంటాయి. మంచి పేర్లు పెట్టి మీ తీపి జ్ఞాపకాలను సులభంగా ఆస్వాదించండి. ఇప్పుడే మొదలుపెట్టండి!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×