E-Paper
Advertisement

Horror thriller OTT: పిచ్చెక్కించే సీన్లతో షూటింగ్… మర్డర్లు చేసే ముసలి జంట… చూస్తే బుర్ర పాడు

Horror thriller OTT: పిచ్చెక్కించే సీన్లతో షూటింగ్… మర్డర్లు చేసే ముసలి జంట… చూస్తే బుర్ర పాడు
Advertisement

Horror thriller OTT : హారర్ స్టోరీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దెయ్యాల సినిమాలు. ఆడియన్స్ కు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి ఈ దెయ్యాలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక వృద్ధ జంట చేసే హింస చూస్తే దయ్యాలు ఏమాత్రం సరిపోవు. ఒక్కోసిన్ చూస్తే గుండె ఆగిపోతుంది ఏమో అన్నట్టు అనిపిస్తుంది. భయపడే వాళ్ళు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ స్లాషర్ హర్రర్ మూవీ పేరు ‘X’. ఈ చిత్రానికి టి వెస్ట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మియా గోత్ ద్విపాత్రాభినయం చేశారు. ఆమెతో పాటు జెన్నా ఒర్టెగా, మార్టిన్ హెండర్సన్, బ్రిటనీ స్నో, కిడ్ కడి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ A24 నిర్మించింది. 2022 మార్చి 13న యునైటెడ్ స్టేట్స్‌ థియేటర్‌లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా prime videoలో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు ఫ్రీక్వెల్ గా ‘Pearl’ మూవీ, సీక్వెల్ గా MaXXXine’ విడుదలయ్యాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మ్యాక్సిన్ (మియా గోత్) అనే ఒక యువతికి పెద్ద స్టార్ కావాలనే కోరిక ఉంటుంది. ఆమె తన ప్రియుడు వేన్, మరికొందరు స్నేహితులతో కలిసి ఒక అడల్ట్ సినిమా తీసి బాగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం వాళ్ళు టెక్సాస్‌లోని ఒక పల్లెటూరిలో ఉన్న పాత ఫామ్‌హౌస్‌ను అద్దెకు తీసుకుంటారు. అయితే ఆ ఇంటికి యజమానులుగా హవార్డ్, పెర్ల్ అనే వృద్ధ దంపతులు ఉంటారు. ఆ ముసలివాళ్లు చాలా వింతగా, భయంకరంగా ఉంటారు. షూటింగ్ విషయం వాళ్లకు తెలియకుండా వీళ్ళు జాగ్రత్తగా పని మొదలుపెడతారు. ఇక్కడే కథ భయంకరమైన మలువు తీసుకుంటుంది.

షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఆ ఇంటి యజమానురాలు పెర్ల్.. మ్యాక్సిన్ అందాన్ని చూసి చాలా అసూయ పడుతుంది. పెర్ల్ కూడా ఒకప్పుడు అందంగా ఉండాలని, తన కోరికలు తీర్చుకోవాలని అనుకునే మనస్తత్వం ఉన్న మహిళ. ఇప్పుడు తన యవ్వనం అయిపోయిందని, తాను ముసలిదానిగా మారిపోయానని ఆమెలో ఉన్న అసంతృప్తి క్రూరంగా మారుతుంది. ఆ రాత్రి పెర్ల్ తన భర్త హవార్డ్ తో కలసి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంది. ఈ సీన్స్ ఒళ్లు జలదరించేలా ఉంటాయి. చివరికి మ్యాక్సిన్ టీమ్ ప్రాణాలతో బయట పడుతుందా ? ఆ ముసలి జంట చేతిలో బలవుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : తుప్పు పట్టిన కత్తులతో కాలక్షేపం … కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ మిషన్… దుమ్ము లేపే ఫైట్స్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×