E-Paper
Advertisement

Iran New Supreme: ఇరాన్ కొత్త సుప్రీం ముజ్తబా ఖమేనీ.. తండ్రి తర్వాత కొడుక్కి పగ్గాలు, సైన్యం ఒత్తిడితో

Iran New Supreme: ఇరాన్ కొత్త సుప్రీం ముజ్తబా ఖమేనీ.. తండ్రి తర్వాత కొడుక్కి పగ్గాలు, సైన్యం ఒత్తిడితో
Advertisement

Iran New Supreme: నాయకుడు లేని రాజ్యానికి కొత్త రాజు వచ్చేశాడు. ఇరాన్ కొత్త సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ నియమితులయ్యాడు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ వెలుగులోకి తెచ్చింది. ముజ్తబా నియామకం వెనుక పెద్ద కారణాలు ఉన్నాయని అంటున్నారు.

ఇరాన్ కొత్త సుప్రీం ముజ్తబా ఖమేనీ,  తొలిసారి తండ్రి తర్వాత కొడుక్కి పగ్గాలు

Advertisement

పశ్చిమాసియాలోని ఇరాన్‌లో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ నియమించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆదేశ రాజ్యాంగం ప్రకారం సుప్రీంను మత పెద్దల సభ ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి మేరకే ముజ్తబాను ఎంపిక చేసినట్లు అందులోని సారాంశం.

ఈ మేరకు ఇరాన్ ఇంటర్నేషనల్ తన కథనంలో ప్రస్తావించింది. అతడు అలీ ఖమేనీ రెండవ కుమారుడు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ పాలన మొదలైంది. ఆనాటి నుంచి నేటి వరకు తండ్రి నుంచి కొడుకుకి అధికారం బదిలీ అయిన సందర్భం లేదు. ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Advertisement

భయపడుతున్న మత పెద్దలు. అదీ కూడా ఓ కారణం?

ఇరాన్‌లో వారసత్వ రాజకీయాలు మొదలయ్యాయంటూ విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నాడు ముజ్తబా. అటు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇటు రాజకీయాలు, ఇంకోవైపు మత పెద్దల వ్యవహారాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

దీనిపై ఇరాన్ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొంతమంది మతాధికారులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పేరు బయటకు ప్రకటిస్తే అమెరికా-ఇజ్రాయెల్ దళాలు టార్గెట్ చేసే అవకాశముందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఖమేని తర్వాత నియమితులైన వివిధ డిఫెన్స్, రక్షణ మంత్రులు, కీలక అధికారులు దాడుల్లో మృతి చెందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

56 ఏళ్ల మోజ్తబా దివంగత అయితుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు. 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడడానికి దాదాపు దశాబ్దం ముందు ఇరాన్‌లోని ముఖ్యమైన మత కేంద్రం మషాద్‌లో అతడు 1969లో జన్మించారు. మోజ్తాబా ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. ఆ తర్వాత 1987లో ఇస్లామిక్ సైనిక దళంలో చేరాడు.

ALSO READ: ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు.. భవనం దెబ్బతింటే.. బీమా కంపెనీలు చెల్లిస్తాయా?

ఇరాన్-ఇరాక్ వార్ సమయంలో హబీబ్ బెటాలియన్‌లో పని చేశాడు.క్రమంగా ఇరాన్ భద్రతా యంత్రాంగంలో ఎదిగిన వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. తండ్రి సుప్రీంగా ఉన్నప్పుడు మోజ్తాబా.. దేశంలో అత్యంత గౌరవనీయమైన మతాధికారులతో చదువుకోవడానికి వెళ్లాడు. మతపరమైన సెమినరీలో బోధించడాడు కూడా.

2004 లో మోజ్తాబా.. ఇరాన్ సంప్రదాయ రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు ఛైర్మన్ ఘోలం-అలీ హద్దాద్-అదెల్ కుమార్తె జహ్రా హద్దాద్-అదెల్‌ను వివాహం చేసుకున్నారట. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాకపోతే వారి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×