E-Paper
Advertisement

AC Side Effects: ఏసీ అతిగా వాడుతున్నారా? ఈ జబ్బులకు రెడీగా ఉండండి.. ఏ క్షణమైనా..!

AC Side Effects: ఏసీ అతిగా వాడుతున్నారా? ఈ జబ్బులకు రెడీగా ఉండండి.. ఏ క్షణమైనా..!
Advertisement

AC Side Effects: సమ్మర్ లో ఏసీల వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరైతే ఏసీ గది నుంచి బయటకు రావడానికి సైతం ఇష్టపడరు. అయితే ఎండ నుంచి ఏసీలు ఉపశమనం ఇచ్చినప్పటికీ.. అది ఆరోగ్యంపై ప్రతీకూల ప్రభావాలను చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని క్రమంగా అనారోగ్యం బారిన పడేస్తుందని పేర్కొంటున్నారు. ఏసీ అతి వినియోగం వల్ల వచ్చే 5 ప్రధాన అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

శ్వాసకోశ సమస్యలు (Respiratory Issues)

ఏసీని సరిగ్గా శుభ్రం చేయకపోతే అందులో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే ఛాన్స్ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ సేపు ఏసీలో గడపడం వల్ల అవి గాలి ద్వారా  ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమా, అలర్జీలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీయెుచ్చు. ముఖ్యంగా ‘లెజియోన్నైర్స్’ (Legionnaires disease) వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చర్మం, కళ్ళ పొడిబారడం (Dry Skin and Eyes)

Advertisement

సాధారణంగా ఏసీలు.. గాలిలోని తేమను తొలగించేస్తాయి. ఈ నేపథ్యంలో ఎక్కువసేపు ఏసీలో ఉంటే మీ చర్మం పొడిబారిపోయి దురద రావొచ్చు. అలాగే కళ్లలోని తేమ సైతం తగ్గి ఎర్రబడటం, మంట పుట్టడం వంటి సమస్యల బారిన పడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

అలసట, తలనొప్పి (Fatigue and Headaches)

చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఏసీ గదుల్లో గడపడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కూలింగ్ వల్ల నీరు తాగాలన్న భావన కలుగదు. ఫలితంగా శరీరానికి అవసరమైన నీరు అందక.. తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసటకు గురయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

కీళ్ల నొప్పులు (Joint and Muscle Pain)

Advertisement

చల్లని గాలి నేరుగా శరీరంపై పడటం వల్ల కండరాలు బిగుసుకుపోయి కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కీళ్లవాతం (Arthritis) ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఏసీకి మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వడం వల్ల.. కండరాలు హెల్తీగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. ప్రతిరోజూ 2.5 GB డేటా, అపరిమిత కాల్స్.. ఫ్రీగా BiTV కంటెంట్!

గాలి నాణ్యత తగ్గడం (Sick Building Syndrome)

సాధారణంగా ఏసీ వల్ల ఉండే ప్రధాన సమస్యల్లో స్వచ్ఛమైన గాలి లేకపోవడం ఒకటి. ఏసీ గదులు పూర్తిగా మూసి ఉండటం వల్ల తాజా గాలి లోపలికి రాదు. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరిగి గాలి నాణ్యత తగ్గుతుంది. దీనినే ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ అంటారు. దీనివల్ల చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: Onion Heatstroke: జేబులో ఉల్లిగడ్డ ఉంటే.. వడదెబ్బ తగలదట.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో రచ్చ రచ్చ!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×