E-Paper
Advertisement

Air Coolers: కూలర్‌లో ఐస్ గడ్డలు వేస్తున్నారా? జాగ్రత్త సుమా.. ఏదైనా జరగొచ్చు!

Air Coolers: కూలర్‌లో ఐస్ గడ్డలు వేస్తున్నారా? జాగ్రత్త సుమా.. ఏదైనా జరగొచ్చు!
Advertisement

Air Coolers: ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రస్తుతం కూలర్లలోనూ భారీగా మార్పులు వచ్చాయి. ప్రీమియం కూలర్లలో ఐస్ లేదా ఐస్ బాక్సులను వినియోగిస్తున్నారు. దీని వల్ల తాత్కాలికంగా చల్లదనం అనిపించినప్పటికీ.. దీర్ఘకాలంలో లేదా నిర్లక్ష్యంగా వాడటం వల్ల కొన్ని ముఖ్యమైన నష్టాలు, సమస్యలు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

తేమ, శిలీంధ్రాల పెరుగుదల

కూలర్లలో ఐస్ కరిగినప్పుడు వచ్చే నీరు కూలర్ లోపలి భాగంలో ప్యాడ్లపై పేరుకుపోతుంది. ఇది గాలిలో తేమను పెంచుతుంది. ఈ తేమ వల్ల కూలర్ ప్యాడ్లలో బ్యాక్టీరియా, బూజు (Mold/Fungus) త్వరగా చేరుతాయి. మీరు ఆ గాలిని పీల్చినప్పుడు అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కూలర్ మోటార్ – పంప్‌కు హాని

Advertisement

ఐస్ వేయడం వల్ల కూలర్ ట్యాంక్ లోని నీటి ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి పడిపోతుంది. సాధారణంగా బేసిక్ వేరియంట్లలో వచ్చే కూలర్లు.. సాధారణ ఉష్ణోగ్రత గల నీటిని పంపింగ్ చేయడానికి రూపొందించబడి ఉంటాయి. మరీ చల్లని నీటిని పదేపదే పంపింగ్ చేయడం వల్ల మోటార్ పనితీరు దెబ్బతినవచ్చు లేదా వైరింగ్ సమస్యలు రావచ్చు.

మెటీరియల్ పాడైపోవడం

చాలా వరకు కూలర్లు ప్లాస్టిక్ లేదా ఫైబర్ బాడీతో రూపొంది ఉంటాయి. అకస్మాత్తుగా మంచు గడ్డలు (ఐస్) వేయడం వల్ల ప్లాస్టిక్ భాగాలపై ఉష్ణోగ్రత ఒత్తిడి పడుతుంది. కాలక్రమేణా ప్లాస్టిక్ పగుళ్లు ఇచ్చే ప్రమాదం ఉంది. ఫలితంగా కూలర్ మన్నిక తగ్గిపోవచ్చు.

గాలి నాణ్యత తగ్గడం

Advertisement

ఐస్ వేయడం వల్ల కూలర్ గాలి చాలా చల్లగా వస్తుంది. ఇది మన శరీరానికి, ముఖ్యంగా రాత్రిపూట పడుకున్నప్పుడు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలో తీవ్రమైన మార్పుల వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు (Body pains) వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Podarillu Today Episode : మాధవ్ ను కొట్టిన గాయత్రి తండ్రి.. మళ్ళీ అడ్డంగా ఇరుక్కున్న శైలు.. మాధవ్ ను అరెస్ట్ చేస్తారా..?

విద్యుత్ బిల్లు, ఆర్థిక భారం

సమ్మర్ లో అదే పనిగా ఐస్ వేయడం వల్ల విద్యుత్ భారం కూడా పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ప్యాడ్లు త్వరగా పాడైపోవడం వంటివి జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కూలర్‌ను తరచుగా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుందని.. ఇది అదనపు ఖర్చుతో కూడుకున్న పని అని పేర్కొంటున్నారు.

Also Read: Thriller movie OTT: చచ్చినా చావని అమ్మాయి… డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… ఉత్కంఠ రేపే ప్రతీ ఎపిసోడ్

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×