Gundeninda GudiGantalu Today episode march 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా శివ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఏంటండీ మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నేను ఆ కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు మీనా? ఏం జరగదు కానీ.. నన్ను ఈ రోజు ఉంచి రేపు వదిలేస్తారులే మేడం వచ్చిన తర్వాత ఆమె వదిలేస్తుందిలే అనేసి బాలు అంటాడు. బాలు మాత్రం నువ్వేం బాధపడకు నాకేం కాలేదు అని ఎంత చెప్పినా సరే మీనా మాత్రం బాధపడుతుంది.. అయితే బాలుని వదిలిపెట్టమని పోలీసుల్ని అడుగుతుంది అసలేం జరిగిందో చెప్పండి అని అక్కడ చెప్పినా కూడా వాళ్ళు మేడం వచ్చేంతవరకు మేము ఏమి చేయలేము అని అంటారు. మీనా ఎలాగోలాగా బాలుని విడిపించి ఇంటికి తీసుకొని వస్తుంది. ప్రభావతి మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది.. గుణకి మాత్రం మరోసారి దిమ్మ తిరిగిపోయేలా చేస్తాడు బాలు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు మీనా ఇంటికి వస్తారు.. ప్రభావతి బాలుని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. ఈయన మాత్రం దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది. వీడికి జైలుకెళ్లడం కొత్తవి కాదు కదా అని ప్రభావతి అంటుంది. ఎంత చెబుతున్న సరే ప్రభావతి మాత్రం తన అనుకున్నవి చెప్పేసి వెళ్తుంది. అయితే అక్కడికొచ్చిన రోహిణి మనోజ్ లు కూడా ప్రభావతికి తోడుగా రావడంతో ఇంకాస్త రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఆయన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. జైలుకెళ్ళి మోసం చేసి డ్రామాలాడుతున్నారు అని ప్రభావతి అనగానే మీనా రెచ్చిపోతుంది. డ్రామా అంటే ఏంటి అత్తయ్య అనేసి అడుగుతుంది. మీరు మీ అబ్బాయికి సపోర్ట్ చేయడం 40 లక్షలు ఎత్తుకుపోయిన సరే ఏమి మాట్లాడుకుందాం ఉండడం డ్రామానా.. ఇంట్లో ఉన్నవి మింగేయడంతో పాటుగా ఇంటినే మింగాలనుకున్న మీ కోడలు ఆడేది డ్రామా నా. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఏమి తెలియని వాళ్ళ లాగా ఉండడం అది డ్రామా నా ఏం మాట్లాడుతున్నారు ఏమి డ్రామాలాడం మా పుట్టింటి వాళ్ల గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది మీనా.
చూశారా మామయ్య ఎలా మాట్లాడుతున్నారో వాళ్లు చేసేవి ఏవి కనిపించవు మావే మాత్రమే కనిపిస్తాయని మీనా అంటుంది. ఇక బాలు కూడా చూసావా నాన్నా నాకు జైలుకి వెళ్లడం కొత్త కాదు అని అమ్మ ఎలా మాట్లాడుతుందో అనేసి అంటాడు. మీ అమ్మ గురించి తెలిసింది కదా.. నువ్వు చేసింది మంచి పనే కానీ ఎంచుకున్న మార్గం మంచిది కాదు అని సత్యం కూడా బాలుతో అంటాడు. సరే నాన్న నన్ను క్షమించు ఈసారి ఏం జరగకుండా చూసుకుంటాను అని బాలు అంటాడు.. ఇక రవి రెడీ అయి వెళ్తుంటే శృతి నాకు జ్వరం వచ్చింది నువ్వు వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది. అప్పుడే నీతూ కూడా ఫోన్ చేయడంతో రవి అర్జెంటుగా వెళ్లాలి అని అంటాడు. శృతి ఎంత చెప్తున్నా సరే రవి మాత్రం వెళ్లి తీరాలి అర్జెంట్ అని అంటాడు.. దానికి శృతి నేను ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని అనుకుంటుంది. దాంతో పాటుగా బ్యాగ్ సర్దుకొని తన పుట్టింటికి వెళ్లాలని అనుకుంటుంది.
బ్యాగుతో శృతి బయటికి రాగానే మీనా ఏమైంది శృతి అని అడుగుతుంది. నాకు జ్వరం వచ్చింది మీనా కనీసం రవి చూసుకోవడానికి ఉండమని అడిగినా సరే ఉండకుండా వెళ్ళిపోయాడు అని చెప్తుంది. తనకేదో అర్జెంట్ పని ఉండడం వల్ల వెళ్ళిపోయినాడు శృతి దానికే నువ్వు బ్యాగ సర్దుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్లట్లేదు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని శ్రుతి చెప్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ప్రభావతి ఏమన్నావే శృతిని అని అడుగుతుంది.. నువ్వు ఏదో ఒకటి అనకుండా ఉండవా అని అనగానే నేనేం అనలేదు మీకు శృతి చెప్పిందని మీనా అంటుంది.
ఏమైందమ్మా శృతి ఎందుకు బ్యాగు తీసుకొని వచ్చావు అని అడిగితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మీ అబ్బాయి కనీసం పట్టించుకోవడం లేదు అని అంటుంది. ఎంత చెప్తున్నా సరే శృతి మాత్రం పట్టించుకోకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే బయట ఉన్న బాలు ఎందుకు శృతి కోపంగా వెళుతుంది అని మీనా అని వచ్చి అడుగుతాడు. బాగోలేదంట అండి రవి ఇంట్లో ఉండకుండా అర్జెంటు పని అని వెళ్ళాడట.. అది చూసిన మీ అమ్మగారు సద్ది చెప్పాల్సింది పోయి ఇంకాస్త రెచ్చగొట్టేలా అంటున్నారు అని అంటుంది. అసలు రవికి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని అనగానే లోపలికి వెళ్లి వీళ్లిద్దరూ చూడగానే అక్కడ ప్రభావతి రవితో ఫోన్ మాట్లాడుతుంటుంది. నీ భార్యకి ఎంత పొగరుగా కనీసం అత్త అన్న మరి అది కూడా లేకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పగానే షాక్ అవుతాడు రవి.. నువ్వు డైరెక్ట్ గా ఇంటికి రా అదే వస్తుంది అని ప్రభావతి చెప్తుంది..
ఆ తర్వాత మీనా రవికి ఫోన్ చేసి ఏమైంది రవి ఎందుకు గొడవ అని అడుగుతుంది. మీ అమ్మ నీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. నువ్వు మాత్రం అలా చేయొద్దు శృతిని తీసుకుని ఇంటికి రా నువ్వంటే శృతికి ప్రాణం.. చిన్న చిన్న వాటికి విడిపోవాల్సిన అవసరం లేదు నువ్వు ఒకసారి ఫోన్ చేసి తనకి సారీ చెప్పు నీ పరిస్థితి గురించి ఒకసారి వివరంగా చెప్పు అని మీనా రవి శృతిలను కలపడానికి ప్రయత్నిస్తుంది. అది చూసిన బాలు మాత్రం నా పూలగంప మనసులో ఎన్ని సువాసనలు ఉన్నాయో ఎంత మంచిదో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఆ తర్వాత బాలు ట్రిప్ ఉందని వెళ్ళిపోగానే మీనా వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులు వస్తారు. వాళ్ళు అన్నం తింటూ ఉండగా ప్రభావతి అక్కడికి వస్తుంది. మేనని పక్కకు తీసుకొని వెళ్లి మీ వాళ్ళు దోచిపెడుతున్నావని దారుణంగా మాట్లాడుతుంది..
Also Read :మాధవ్ ను కొట్టిన గాయత్రి తండ్రి.. మళ్ళీ అడ్డంగా ఇరుక్కున్న శైలు.. మాధవ్ ను అరెస్ట్ చేస్తారా..?
ప్రభావతి మాటలు విన్న మీనా బంధువులు తినే అన్నాన్ని వదిలి పెట్టేసి చేయి కడుక్కొని అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీనా మీకు చాలా సంతోషంగా ఉంది కదా మీరు అనుకున్నది చేశారు కదా అనేసి ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు ఇస్తుంది. నా ఉప్పు తిని నన్నే చనిపోతున్నారు మీ వాళ్ళు. గతి లేని వాళ్ళు అది ఇది అని మాట్లాడటంతో మీనా రెచ్చిపోయి ప్రభావతిని తిడుతుంది.. ఆ తర్వాత మీనా వాళ్ళ అత్త చేసిన ఘనకార్యం గురించి తన స్నేహితులతో చెప్పి బాధపడిపోతుంది. జలుబు చేయడంతో మీనా ఇంటికి వస్తానే చికెన్ తీసుకొచ్చి సూప్చేయమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది.. అది విన్న మీనా నేనెందుకు చేయాలి వాళ్ళ ఆవిడని చేయమని చెప్పు అనేసి వాళ్ళిద్దరికీ చుక్కలు చూపిస్తుంది. మీనా ఎంతగా అంటున్న సరే వాళ్ళిద్దరు మాత్రం మీనాని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. దాంతో మీనా వెళ్లి బెల్ట్ తీసుకుని వచ్చి మనోజ్ కి వాతలు పెడుతుంది.. మనోజ్ ని కొట్టడం చూసిన ప్రభావతి మీనాకు ఏమైంది అని భయపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…