E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ ను కొట్టిన గాయత్రి తండ్రి.. మళ్ళీ అడ్డంగా ఇరుక్కున్న శైలు.. మాధవ్ ను అరెస్ట్ చేస్తారా..?

Podarillu Today Episode : మాధవ్ ను కొట్టిన గాయత్రి తండ్రి.. మళ్ళీ అడ్డంగా ఇరుక్కున్న శైలు.. మాధవ్ ను అరెస్ట్ చేస్తారా..?
Advertisement

Podarillu Today Episode March 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహా మెకానిక్ షాప్ లొకేషన్ చూసి షాక్ అయిపోతుంది. ఏంటి మీ అన్నయ్య ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ లో పెద్ద తోపని మీ అన్నయ్య చెప్పాడు నాకు ఇతను ఇక్కడ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అని మహా అంటుంది.. షాప్ లోకి రాగానే మొహాన్ని చూసి కేశవా షాక్ అవుతాడు ఏంట్రా కన్నా చెప్పకుండా ఇలా తీసుకొచ్చావు. ఏమైంది అంటే ఊరికే వచ్చావు అన్నయ్య అని కన్నా అంటాడు.. ఇక కేశవ మహాను చూసి దానికోసం జ్యూస్ తీసుకురమ్మని చెప్తాడు. మహా మాత్రం ఈ పని మీరు ఎప్పటినుంచి చేస్తున్నారు అని అడుగుతుంది.. నేను అన్నయ్య పోరు భరించలేక ఇంటర్ వరకు చదివాను కానీ పాస్ అవ్వలేదు.. అప్పటినుంచి నేను మెకానిక్ గా పని చేస్తున్నాను అని కేశవ అంటాడు. ఇంటికి వెళ్ళినా మహా అమ్మవారు లాగా మారుతుంది. కారేశ్వర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన చక్రి జాబ్ వచ్చిందన్న ఆనందాన్ని మళ్ళీ చెప్పాలని అందరికీ అనుకుంటాడు. హనీ కోపంగా చూసి ఇంట్లో ఏదో ఉపద్రవం జరిగేలా ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏమైందండీ ఎందుకు మీరు అలా ఉన్నారు అంటే ఏదో అయింది లేండి. మీరు అబద్దాలు మీద అబద్ధాలు చెబుతున్నారు అని చక్రికి దిమ్మ తిరిగిపోయే షాకిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శైలు ఎలాగైనా సరే ఆ కేశవ దగ్గర నుంచి ఫోన్ తీసుకోవాలని అనుకుంటుంది.. తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి వడ్డీకి ఎవరైనా డబ్బులు ఇస్తారేమో కనుక్కోమని చెప్తుంది.. నా దగ్గర డబ్బులు లేవు కానీ ట్రై చేస్తాను అని తన ఫ్రెండ్ చెప్తుంది. అయితే ఫోన్ ఎలాగైనా తీసుకోవాలి అని మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చి ఏంటే ఫోన్ తీసుకోవాలంటున్నావ్. ఫోన్ ఎక్కడైనా తాకట్టు పెట్టావా అని అడుగుతుంది. మరి ఎక్కడైనా పోగొట్టేసావా ఏంటి అని కంగారుగా అడుగుతుంది. అయ్యో లేదమ్మా నా ఫోన్ ఉంది కాకపోతే దానికి చార్జింగ్ పిన్ పనిచేయట్లేదు అని ఏదో ఒక అబద్ధం చెప్పేస్తుంది శైలు.. అప్పుడే అక్కడికి వచ్చిన తన అన్నయ్య సర్వీస్ కి ఇవ్వడానికి రేపు వెళ్దాము అని అంటుందమ్మా అదేనేమో అని అనగానే ఏదో ఒకటి చావు ముందు ఆ రీల్స్ చేయడం ఆపేసి చదువు మీద దృష్టి పెట్టు అనేసి అంటుంది..

Advertisement

తర్వాత మహాలక్ష్మి మాధవ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన గాయత్రి మాధవ్ ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది.. ఏమైంది గాయత్రీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నాకు ఇంట్లో పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు బావ. నాకు ఇష్టం లేదు బావ నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఏంటి నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు అని మాధవ్ అడిగే లోపు తాయారు పురుషోత్తం అక్కడికి వస్తారు.. నా కూతురిని నువ్వు నీ బుట్టలో వేసుకున్నావా? మాయమాటలు చెప్పి నా కూతుర్ని నీ దారికి తెచ్చుకున్నావని దారుణంగా మాధవ్ ని అవమానించేలా మాట్లాడుతాడు.. ఒక హంతకుడు కొడుకు నా కూతుర్ని పట్టుకుంటాడా అని రెచ్చిపోయిన పురుషోత్తం మాధవ్ ని దారుణంగా కొడతాడు..

మధ్యలో వచ్చిన మహాలక్ష్మి ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా సరే వాళ్లు మాత్రం మాధవ్ని కొడుతూనే ఉంటారు.. మీ అమ్మాయి ఈ ఇష్టపడి వస్తే ఏం చేయమంటారు. అతని తప్పేమన్నా ఉందా అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే.. తాయారు మాత్రం నీలాగా ఎదిరించి లేచిపోయి రమ్మంటావా అని మహని కూడా తిడుతుంది.. ఏం మనుషులండి ఎందుకు కొడుతున్నారు అని మహా మధ్యలో అడ్డుపడుతుంది.. తమ్ముడు ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు నువ్వు కూడా నా కూతురుని వలలో వేసుకొని ఈ ఇంటికి కోడలుగా తీసుకురావాలని అనుకుంటున్నావా అని పురుషోత్తం మాటకు మాట సమాధానం చెబుతూ మాధవిని కొడతాడు.. గాయత్రి ఇందులో బావ తప్పేమీ లేదు అని అడ్డుపడిన సరే వాళ్ళు మాత్రం గాయత్రి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు..

Advertisement

కేశవ దగ్గర్నుంచి ఎలాగైనా సరే ఫోన్ ఈరోజు తీసుకోవాల్సిందేనని శైలజ ఫోన్ చేసి రమ్మని చెప్తుంది.. ఇక ఆమె పెట్టిన లొకేషన్కి కేశవా వెళ్తాడు.. అక్కడ డబ్బు లేదు అన్న విషయాన్ని తెలుసుకోకుండా శైలజ విర్రవీగుతుంది.. రివెంజ్ తీసుకోవాలి అంటూ బదిలిస్తుంది. కీర్తి ఎంత చెప్పినా కూడా వినకుండా కేశవని దారుణంగా తింటుంది. ఇక డబ్బులు లేవు అని చెప్పగానే మాట మార్చేసి సీన్ రివర్స్ చేస్తుంది.. మరోసారి కేశవ దగ్గర బుక్ అయిన శైలజ కేశవ కోపానికి కారణం అవుతుంది. నువ్వు డబ్బులు నా చేతిలో పెట్టిన తర్వాత నీ ఫోన్ ఇస్తాను అని అతను మరోసారి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మహాలక్ష్మి మాధవ్ ని కొట్టిన విషయాన్ని చక్రితో చెప్పాలని అనుకుంటుంది.. చక్రికీ ఫోన్ చేసి అర్జెంటుగా మీరు ఇంటికి రావాలి అని కంగారు పడిపోతూ చెప్తుంది.. అయితే ఏమైంది అని చక్రి అడగ్గా మాధవ్ ని గాయత్రి వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి పెద్ద గొడవ చేసి కొట్టారు అని చెప్తుంది ఆ మాట వినగానే నేను ఇప్పుడే వస్తున్నానని చక్రి అంటాడు..

Also Read :అమూల్యకు షాకిచ్చిన భద్ర.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మద.. రామారాజుకు నిజం చెప్పిన ధీరజ్..

చక్రి కేశవ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తాడు.. ఇక కేశవా చక్రి ఇద్దరు కూడా ఇంటికి రాగానే.. మాధవ్ ఏం కాలేదు రాని ఎంత చెప్తున్నా సరే.. వాడిని ఈరోజు చంపేస్తాను అని కేశవ సీరియస్ అవుతాడు.. ఇక తర్వాత గాయత్రి నీ ఇంటికి తీసుకువెళ్లిన పురుషోత్తం ఇంట్లో పెద్ద రచ్చ చేస్తాడు. నువ్వు ఏం పెద్దమనిషి అయ్యా అని రమణయ్య ను తిడతాడు.. ఆడదానివి ఆడది బయటికి వెళుతుందంటే చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అంటూ తయారు రెచ్చిపోతాడు.. గాయత్రి చెప్పినా కూడా పురుషోత్తం మాత్రం నేను చెప్పిందే వినాలి అంటూ సీరియస్ అవుతాడు.. అటు చక్రి కేశవ ఆ పురుషోత్తం ని కొట్టడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మాధవ్ తో పాటు మిగిలిన ముగ్గురు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేస్తారేమో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×