E-Paper
Advertisement

కూలర్ గాలి ఏసీలా రావాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.. మీ గది ఐస్‌లా మారిపోతుంది!

కూలర్ గాలి ఏసీలా రావాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.. మీ గది ఐస్‌లా మారిపోతుంది!
Advertisement

Air Cooler: తెలుగు రాష్ట్రాల్లో కాస్తున్న ఎండలు.. పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. బయటి వేడి తట్టుకోలేక చాలా మంది ఇంట్లో ఏసీలు, కూలర్లపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కూలర్ ను వినియోగిస్తూ ఎండల నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా మంది కూలర్ యూజర్లను కూలింగ్ సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. కూలర్ ను ఎంతసేపు రన్నింగ్ లో ఉంచినా గది ఏమాత్రం చల్లగా అనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కూలర్ పనితీరును మెరుగుపరిచే కొన్ని సింపుల్ చిట్కాలు ఈ కథనంలో చూద్దాం.

సరైన గాలి, వెలుతురు

కూలర్ విషయంలో చాలా మంది ఓ పొరపాటు చేస్తుంటారు. కూలర్ వేసినప్పుడు ఏసీ తరహాలో కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తారు. అయితే ఇది చాలా తప్పు. కూలర్ సమర్థవంతంగా పనిచేయాలంటే గాలి ప్రసరణ చాలా ముఖ్యం. కూలర్ వెనుక భాగం నుంచి తాజా గాలిని లోపలికి లాక్కుని.. తేమతో కూడిన చల్లని గాలిని బయటకు వదులుతుంది. కాబట్టి గదిలో ఒక కిటికీని కొద్దిగా తెరిచి ఉంచితే.. లోపల ఉన్న వేడి గాలి బయటకు వెళ్లిపోయి గది త్వరగా చల్లబడుతుంది.

కూలింగ్ ప్యాడ్ల క్లీనింగ్

Advertisement

కూలర్ చల్లదనం అంతా దాని పక్కన ఉండే హనీకోంబ్ లేదా గడ్డి ప్యాడ్ల మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో దుమ్ము పేరుకుపోయినా, ఉప్పు నీరు వాడటం వల్ల రంధ్రాలు మూసుకుపోయినా గాలి లోపలికి రాదు. కాబట్టి నెలకు ఒకసారైనా కూలర్ ప్యాడ్లను నీటితో శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అవి బాగా పాతబడిపోయి గట్టిగా తయారైతే.. వాటిని మార్చడమే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు.

ఐస్ క్యూబ్స్ వాడకం..

కూలర్ ద్వారా గదిని వేగంగా చల్లబరచాలనుకుంటే.. ఐస్ క్యూబ్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. వాటర్ ట్యాంక్‌లో కొన్ని ఐస్ ముక్కలు వేస్తే.. ప్యాడ్ల పైకి వెళ్లే నీరు చాలా చల్లగా మారిపోతుంది. తద్వారా బయటకు వచ్చే గాలి ఏసీ లాంటి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే మరీ ఎక్కువ ఐస్ కూలర్ లో వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అది కూలర్ పంప్ పనితీరుపై ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తున్నారు.

ముందుగానే వాటర్ పంపు ఆన్

Advertisement

కూలర్ ఫ్యాన్ ఆన్ చేయడానికి ఒక 5 -10 నిమిషాల ముందే పంపు (Water Pump) ఆన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కూలింగ్ ప్యాడ్లు పూర్తిగా తడిసి చల్లటి గాలిని అందించేందుకు రెడీ అవుతాయి. అలాకాకుండా ప్యాడ్లు పొడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ వేస్తే వేడి గాలి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాబట్టి ప్యాడ్లు పూర్తిగా తడిసిన తర్వాత ఫ్యాన్ వేస్తే మొదటి నిమిషం నుంచే చల్లటి గాలిని ఆస్వాదించవచ్చని స్పష్టం చేస్తున్నారు.

Also Read: BSNL కొత్త ప్లాన్ చూశారా? రూ.225 చెల్లిస్తే చాలు.. నెలంతా ఇక జాతరే!

కూలర్‌ ఎక్కడ ఉంటే బెటర్

కూలర్‌ను గది మూలలో ఉంచడం కంటే, కిటికీ దగ్గర లేదా బయటి గాలి తగిలే ప్రదేశంలో ఉంచడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగనీ ఎండ నేరుగా తగిలే చోట కూలర్ ఉంచకూడదని స్పష్టం చేస్తున్నారు. అలా చేస్తే ట్యాంక్ లోని నీరు త్వరగా వేడెక్కుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి కూలర్ పైన ఎండ పడకుండా నీడ ఉండేలా చూసుకుంటే బెస్ట్.

Also Read: జియో సంచలనం.. రూ. 200 లోపే 4 సూపర్ ప్లాన్లు.. మిస్ అయితే మీకే నష్టం!

Related News

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

Big Stories

Advertisement
×