E-Paper
Advertisement

Fake Websites Apps: నకిలి వెబ్‌సైట్స్, ఫేక్ యాప్స్‌తో తీవ్రంగా పెరుగుతున్న సైబర్ మోసాలు.. ఇలా గుర్తించండి

Fake Websites Apps: నకిలి వెబ్‌సైట్స్, ఫేక్ యాప్స్‌తో తీవ్రంగా పెరుగుతున్న సైబర్ మోసాలు.. ఇలా గుర్తించండి

Fake Websites Fraud Apps| ఆన్‌లైన్ మోసాల కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. స్కామర్లు చాలా స్మార్ట్‌గా రియలిస్టిక్ డిజిటల్ ట్రిక్స్ తో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఇటీవల నమోదైన కేసుల్లో ఎక్కువగా ఫేక్ వెబ్‌సైట్స్, నకిలీ యాప్స్ ద్వారా జరిగినవి. వీటిలో నమ్మకమైన బ్రాండ్లు, పాపులర్ సర్వీసెస్‌ను అచ్చం రియల్ లాగే కనిపించేట్లుగా చూపిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్‌లను సైబర్ దొంగలు.. యూజర్ల పర్సనల్ డేటా, పాస్‌వర్డ్స్, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించడానికే ఉద్దేశించినవి. ఈ నకిలి యాప్స్ లేదా వెబ్‌సైట్స్ లో మీరు నిర్లక్ష్యంగా చేసే ఒక్క క్లిక్ మీకు సీరియస్ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. లేదా మీ డిజిటల్ ఐడెంటిటీని సైబర్ మోసగాళ్లు కాజేసి దాన్ని దుర్వినియోగం చేస్తారు.

ఈ ఆర్థిక మోసాలు, దొంగతనాలను.. చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా, అవగాహన ద్వారా నివారించవచ్చు.

ఫేక్ వెబ్‌సైట్స్, నకిలీ యాప్స్ ప్రమాదకరం ఎందుకంటే?

స్కామర్లు ఫేక్ ప్లాట్‌ఫామ్‌లను ప్రొఫెషనల్, నమ్మశక్యంగా డిజైన్ చేస్తారు. యూజర్లను టార్గెట్ చేయడానికి యాడ్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా లింక్స్ ఉపయోగిస్తారు. వీటిలో లాగిన్ కోసం మీ వివరాలు షేర్ చేసిన తర్వాత వాటిని క్రిమినల్స్ ఆర్థిక మోసాల కోసం ఉపయోగిస్తారు. ఈ సైబర్ థ్రెట్స్ నుంచి అవేర్‌నెస్ అత్యంత బలమైన డిఫెన్స్.

వెబ్‌సైట్ URLను జాగ్రత్తగా చెక్ చేయండి

నకిలీ వెబ్‌సైట్‌ని గుర్తించడానికి ముందుగా వెబ్‌సైట్ అడ్రస్ బాగా చెక్ చేయండి. ఫేక్ వెబ్‌సైట్స్ పాపులర్ బ్రాండ్ పేర్లలో స్వల్ప స్పెల్లింగ్ మార్పులు చేస్తాయి. ఉదాహరణకు “amazon”కు బదులు ఇంగ్లీస్ ఓ అక్షరం స్థానంలో “amaz0n”లో నంబర్ జీరో ఉంటుంది. ఈ మార్పు సూక్ష్మంగా ఉండడంతో చాలామంది గమనించరు. అలాగే కొన్నిసార్లు సైట్స్ పేర్లలో ఎక్స్‌ట్రా వర్డ్స్ జోడిస్తాయి. ఉదాహరణకు – “amazon offers” లేదా “amazon sale” అని ఉంటుంది. అయితే ఇవి చూస్తూనే అవి నకిలీవని మీరు గుర్తుపట్టాలి.. నమ్మకమైన బ్రాండ్లు షార్ట్, క్లీన్, అధికారిక డొమైన్ పేర్లు మాత్రమే ఉపయోగిస్తాయి.

వెబ్‌సైట్ లో సరైన లాంగ్వేజ్, డిజైన్ ఉండాలి

ప్రముఖ కంపెనీలు ప్రొఫెషనల్ వెబ్‌సైట్ కంటెంట్‌ని భారీగా ఖర్చుతో రూపొందిస్తాయి. ఫేక్ వెబ్‌సైట్స్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్, బ్రోకెన్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇమేజెస్ బ్లర్రీగా లేదా ఇతర సోర్సెస్ నుంచి కాపీ చేసినట్టు ఉంటాయి. అసాధారణ లేఅవుట్స్, మిస్‌మ్యాచ్ ఫాంట్స్ పూర్ క్వాలిటీ సిగ్నల్ ఇస్తాయి. ఇలాంటి గుర్తులు కనిపిస్తే.. అది ఫేక్ వెబ్‌సైట్ అని తెలుసుకోవాలి.

వెబ్‌సైట్ సెక్యూరిటీ ఇండికేటర్స్ వెరిఫై చేయండి

సెక్యూర్ వెబ్‌సైట్స్ URL ముందు “https” అని ఉపయోగిస్తాయి. అడ్రస్ బార్ సమీపంలో ప్యాడ్‌లాక్ ఐకాన్ కనిపిస్తుంది. ఎన్‌క్రిప్షన్ లేని వెబ్‌సైట్స్ పర్సనల్ డేటాను రిస్క్‌లో పడేస్తాయి. అన్‌సెక్యూర్డ్ పేజీలలో పాస్‌వర్డ్స్ లేదా పేమెంట్ వివరాలు ఎంటర్ చేయడం ప్రమాదకరం. అందుకే అలా చేయకూడదు.

నమ్మశక్యం కాని ఆఫర్లు, భారీ డిస్కౌంట్ల‌తో ట్రాప్

చాలా తక్కువ ధరలు తరచూ స్కామ్ సూచిస్తాయి. మోసగాళ్లు అన్‌బిలీవబుల్ డిస్కౌంట్స్‌తో త్వరగా పేమెంట్స్ ఆకర్షిస్తారు. లగ్జరీ ఫోన్స్ లేదా బ్రాండెడ్ ఐటమ్స్ మాసివ్ డిస్కౌంట్స్‌లో ఉంటే సస్పిషన్ రావాలి. అధికారిక వెబ్‌సైట్స్‌తో ధరలు కంపారిజన్ చేసి కొనండి.

ఫేక్ అర్జెన్సీ మెసేజెస్‌కు జాగ్రత్త

స్కామ్ వెబ్‌సైట్స్ త్వరగా డిసిషన్స్ తీసుకోవడానికి ప్రెషర్ టాక్టిక్స్ వాడతాయి. కౌంట్‌డౌన్ టైమర్స్ లేదా లిమిటెడ్ స్టాక్ అలర్ట్స్ రిపీట్ చేస్తాయి. ఈ మెసేజెస్ జాగ్రత్తగా ఆలోచించకుండా ఆపడానికి ఉద్దేశించినవి. లెజిటిమేట్ వెబ్‌సైట్స్ ఇలా ప్రెషర్ చేయవు.

బిజినెస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి

ఆథెంటిక్ వెబ్‌సైట్స్ క్లియర్ కాంటాక్ట్, కంపెనీ డీటెయిల్స్ ఇస్తాయి. వాలిడ్ అడ్రస్, ఫోన్ నంబర్, అధికారిక ఈమెయిల్ చూడండి. ఫ్రీ ఈమెయిల్ సర్వీసెస్ అన్‌వెరిఫైడ్ బిజినెస్ సూచిస్తాయి. కస్టమర్ సపోర్ట్ వివరాలు కనిపించపోతే అది ఫ్రాడ్ యాప్, వెబ్‌సైట్ అని అనుమానం కలుగుతుంది.

ఫోన్‌లో ఫేక్ యాప్స్‌ను ఎలా గుర్తించాలి?

ఫేక్ యాప్స్ ఇన్‌స్టాల్ తర్వాత సైలెంట్‌గా డేటా దొంగిలిస్తాయి. ట్రస్టెడ్ యాప్ స్టోర్స్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి. రాండమ్ లింక్స్ లేదా మెసేజెస్ ద్వారా ప్రమోట్ అయిన యాప్స్ అవాయిడ్ చేయండి.

ఇన్‌స్టాల్ చేయడానికి ముందు యాప్ పర్మిషన్స్ రివ్యూ చేయండి

నిజమైన యాప్స్ తమ ఫంక్షన్‌కు అవసరమైన పర్మిషన్స్ మాత్రమే రిక్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు షాపింగ్ యాప్ మీ ఫోన్ కాంటాక్ట్స్ లేదా కాల్ లాగ్స్ యాక్సెస్ చేయకూడదు. ఎక్సెసివ్ పర్మిషన్స్ డేటా మిస్‌యూజ్ సూచిస్తాయి. అనవసరమైన లేదా ఇన్వేసివ్ పర్మిషన్స్ ఉంటే ఇన్‌స్టాల్ డినై చేయండి.

యాప్స్ రివ్యూలను జాగ్రత్తగా చదవండి

యాప్ రిలయబిలిటీ గుర్తించడానికి యూజర్ రివ్యూలు సహాయపడతాయి. చాలా పర్ఫెక్ట్ రివ్యూలు ఉంటే అనుమాస్పదమైన యాప్ అని గుర్తుపెట్టుకోండి. రియల్ అనుభవాలు ప్రస్తావించే డీటెయిల్డ్ రివ్యూలు చూడండి. హానెస్ట్ డెవలపర్లు కంప్లైంట్స్, ప్రశ్నలకు రెస్పాండ్ అవుతారు.

డౌన్‌లోడ్స్‌తో రివ్యూ నంబర్స్ పోల్చి చూడండి

హై డౌన్‌లోడ్స్‌తో చాలా తక్కువ రివ్యూలు మానిప్యులేషన్ సూచిస్తాయి. కొన్ని మాలిషియస్ యాప్స్ డౌన్‌లోడ్ నంబర్స్ ఆర్టిఫిషియల్‌గా ఇన్‌ఫ్లేట్ చేస్తాయి. ఇన్‌స్టాల్స్‌ను యూజర్ ఫీడ్‌బ్యాక్‌తో ఎవాల్యూయేట్ చేయండి.

యాప్ ఏజ్, అప్‌డేట్ హిస్టరీ చెక్ చేయండి

కొత్త యాప్స్ లిమిటెడ్ టెస్టింగ్ వల్ల హై రిస్క్ కలిగి ఉంటాయి. కొన్ని మాలిషియస్ యాప్స్ కొన్ని వారాల పాటు ఎటువంటి ప్రమాదం లేకుండా నడుస్తాయి. ఆ తరువాత మీ వివరాలను తీరికగా దొంగలిస్తాయి. అందుకే అనవసర కొత్త యాప్స్ ఇన్‌స్టాల్ చేయడానికి తొందరపడకూడదు. రివ్యూలు, అప్‌డేట్స్ టైమ్‌తో మానిటర్ చేయండి.

Also Read: లింక్డ్‌ఇన్, నౌక్రీ వద్దు.. డేటింగ్ యాప్స్‌లో ఉద్యోగాలు వెతుకుతన్న యువత.. ఎందుకంటే

గూగుల్ ప్లే ప్రొటెక్ట్ లాంటి బిల్ట్-ఇన్ సెక్యూరిటీ టూల్స్

ఆండ్రాయిడ్ డివైస్‌లలో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎనేబుల్ చేయండి. ఈ ఫీచర్ యాప్స్‌ లో అనుమాస్పద, ప్రమాదకర బిహేవియర్ కోసం రెగ్యులర్‌గా స్కాన్ చేస్తుంది. డేంజరస్ అప్లికేషన్స్ గురించి హెచ్చరిస్తూ ఉంటుంది. ట్రస్టెడ్ యాంటీవైరస్ యాప్స్ అదనపు సేఫ్టీ లేయర్ ఇస్తాయి.

బ్రౌజింగ్ లేదా యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు లేదా పర్సనల్ డేటా అందులో ఎంటర్ చేయాల్సి వస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. క్రమంతా అన్నీ చెక్ చేసి ఆన్ లైన్ మోసాలను నివారించండి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×