E-Paper
Advertisement

Bangladesh-Mustafizur: బీసీసీఐకి కొత్త చిక్కులు..T20 ప్రపంచ కప్ 2026ను బైకాట్ చేసిన‌ బంగ్లా?

Bangladesh-Mustafizur: బీసీసీఐకి కొత్త చిక్కులు..T20 ప్రపంచ కప్ 2026ను బైకాట్ చేసిన‌ బంగ్లా?
Advertisement

Bangladesh-Mustafizur : బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా ( Bangladesh vs India )  మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బంగ్లాలో హిందువులపై దాడులు చేయడం నిరసిస్తూ మన ఇండియాలో ధర్నాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కు సంబంధించిన క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ ( Bangladesh-Mustafizur ) వచ్చే ఐపిఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ నిర్ణయం పట్ల బంగ్లాదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇండియాలో జరిగే బంగ్లాదేశ్ మ్యాచ్ ల వేదికలు మార్చాలని సరికొత్త అంశంతో తెరపైకి వచ్చింది.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

బీసీసీఐపై బంగ్లా క్రికెట్ బోర్డు ఫిర్యాదు

Advertisement

బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను ఐపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ భగ్గుమంది. వెంటనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫిబ్రవరిలో జరగనున్న నేపథ్యంలో… ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియాలో బంగ్లాదేశ్ మ్యాచ్ లు ఆడనుంది. అయితే ఇండియాలో జరిగే బంగ్లాదేశ్ మ్యాచ్ లు బైకాట్ చేయాలని BCB బోర్డుకు సలహాలు ఇచ్చింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లో ఇండియాలో కాకుండా శ్రీలంకలో నిర్వహించేలా ఐసీసీకి ఫిర్యాదు చేయమని బంగ్లా క్రికెట్ బోర్డు కు సూచనలు చేసింది. దీంతో ఇవాళ ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఫిర్యాదు చేయనుంది. పాకిస్తాన్ మ్యాచ్లు నిర్వహించినట్లుగానే శ్రీలంకలో బంగ్లా మ్యాచ్ లు నిర్వహించాలని ఐసీసీకి ఫిర్యాదు చేయనుందట.

ఐసీసీ ఒప్పుకునే ఛాన్సే లేదు

ఐపీఎల్ లో మా ప్లేయర్ల అవసరం లేదని బీసీసీఐ చెబుతోంది… ఇప్పుడు మాకు ఇండియా అవసరం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తోంది. అందుకే టి20 మ్యాచ్ లు ఇండియాలో కాకుండా మరో వేదికపై నిర్వహించాలని ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే దీనిపై ఐసీసీ సానుకూలంగా స్పందించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే t20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన వేదికలు ఖరారయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఐసీసీ. ఉన్నఫలంగా బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తే, ఐసీసీ తగ్గబోదని విశ్లేషకులు చెబుతున్నారు. కావాలంటే ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ను ఎలిమినేట్ చేస్తారు తప్ప, వేదిక మార్చే ప్రసక్తే లేదంటున్నారు.

Advertisement

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

 

 

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×