Venezuela: వెనిజువెలా రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడి మదురోను అదుపులోకి తీసుకున్నారు అమెరికా పోలీసులు. ఇవాళ న్యాయస్థానంలో ఆయన్ని హాజరుపర్చనున్నారు. మరోవైపు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఆదేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌కి సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ ఆమె రష్యాకు పారిపోయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా చర్చ అప్పుడే మొదలైంది.
వెనిజులాలో రాజకీయ సంక్షోభం
వెనిజులా వ్యవహారంలోకి అమెరికా కాదు.. ఇప్పుడు రష్యా కూడా ఎంట్రీ కానుంది. వెనిజులా మాదకద్రవ్యాలు, డ్రగ్స్ ముఠాలను ఎదుర్కోవడానికి వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పరిస్థితి గమనించి వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ రష్యాకు పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఆమె కదలికలతో పరిచయం పలువురు నేతలు, నిఘా వర్గాలు చెప్పినట్టు రాసుకొచ్చాయి. ఉపాధ్యక్షురాలి సోదరుడు, జాతీయ అసెంబ్లీ అధిపతి జార్జ్ రోడ్రిగ్జ్ కారకాస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు మదురోని అరెస్టు తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ ఆ దేశ టెలివిజన్‌లో ఆడియో సందేశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కనిపించలేదు. రష్యాకి ఆమె పారిపోయినట్లు ఆదేశ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రష్యాకు పారిపోయిన ఉపాధ్యక్షురాలు
ఆదేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వెనిజులా సుప్రీంకోర్టు ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. పాలనా కొనసాగింపు, దేశ సమగ్ర రక్షణకు హామీ ఇవ్వడానికి రోడ్రిగ్జ్ కి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి వర్తించే చట్టపరమైన నిర్ణయించడానికి కోర్టు చర్చిస్తుందని తీర్పులో ప్రస్తావించింది.
వెనిజులా రాజధాని కారకాస్ చుట్టుపక్కల ప్రాంతాలపై వైమానిక దాడులు శనివారం ఉదయం నుంచి మొదలయ్యాయి. ఈ మెరుపు దాడిలో అమెరికాలో కమాండోలు వెనిజులా అధ్యక్షుడు మదురో, అతని భార్యని అదుపులోకి తీసుకున్నాయి. మదురోను తీసుకెళ్తున్న యూఎస్ ప్రభుత్వ విమానం రాత్రి పొద్దుపోయిన కొద్దిసేపటికే సైనిక స్థావరంలో ల్యాండ్ అయింది.
ALSO READ: అమెరికా కష్టడీలో మదురో.. సద్దాంహుస్సేన్ తర్వాత
మదురోని హెలికాప్టర్‌లో న్యూయార్క్‌కి తరలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా , ఆయుధాల ఆరోపణలపై ఆ జంటను అరెస్టు చేయనున్నారు అక్కడి పోలీసులు. వెనిజులా విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుని రష్యా గమనిస్తోంది. వెనిజులా అధ్యక్షుడు చావెజ్ క్యాన్సర్‌తో 2013లో మరణించారు. అప్పటి నుంచి ఆదేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మదురో బాధ్యతలు తీసుకున్నారు.
ఆ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో విజయం సాధించారు మదురో. ఆ తర్వాత అధ్యక్షుడిగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో విజయం అందుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. మదురో హయాంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొంది ఆదేశం.
ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోవడంతో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. ఆహార కొరత ఏర్పడడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. వాటిని మదురో అణచి వేసి వేలాది మందిని నిర్బంధించారు. పోయిన ఏడాది మదురో మూడోసారి దేశాధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. ఆ ఎన్నికలపైనా పెను దుమారం రేగడంతో ఆయన్ని అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా అంగీకరించలేదు. విపక్ష నేత ఎడ్మండో తాము గుర్తిస్తామని ఓ ప్రకటన చేసింది. అప్పుడే మదురో అరెస్టు కాయమని ప్రచారం సాగింది.