E-Paper
Advertisement

Slimmest Phone Launched: ఐక్యూ నుంచి అదిరిపోయే ఫోన్.. భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, పూర్తి విరాలివే!

Slimmest Phone Launched: ఐక్యూ నుంచి అదిరిపోయే ఫోన్.. భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, పూర్తి విరాలివే!
Advertisement

Slimmest Phone Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా ‘iQOO 15R’ పేరుతో మరో సరికొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పవర్‌ఫుల్ ఫీచర్లతో టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఈ ఫోన్.. ఇప్పటికే అందుబాటులో ఉన్న iQOO 15 మోడల్‌కు కొనసాగింపు అని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా గేమింగ్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్ల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.

ధర ఎంతంటే?

భారత్‌లో iQOO 15R 8GB+256GB వేరియంట్ ధరను కంపెనీ రూ.44,999గా నిర్ణయించింది. ఇక 12GB+256GB వేరియంట్ రూ.47,999, అలాగే 12GB+512GB వేరియంట్ రూ.52,999కు లభిస్తాయి. డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ రంగుల్లో లభించే ఈ ఫోన్‌ను అమెజాన్, ఐక్యూ ఇండియా స్టోర్లలో ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు ఉచితంగా TWS ఇయర్‌బడ్స్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. మార్చి 3వ తేదీ నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Also Read: బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫోన్ కావాలా? ఐకూ-వన్‌ప్లస్ మధ్య ఈ తేడాలు తెలిస్తే అస్సలు వదలరు!

నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్:

ఈ స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనిలో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజన్ ఓఎస్ 6పై పనిచేసే ఈ ఫోన్‌కు 4 ఏళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఫోన్ వెనుక భాగంలో 50MP సోనీ ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరాli అమర్చారు. అలాగే ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణ దీనిలో ఉన్న 7,600mAh భారీ బ్యాటరీ. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉండటంతో ఫోన్ చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. అలాగే నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపి68 రేటింగ్‌ను కూడా అందించారు.

Also Read: అదిరిపోయే కెమెరా, ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న టాప్ మోడల్ ఫోన్లు ఇవే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×