E-Paper
Advertisement

iQOO 15R vs OnePlus 15R: బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫోన్ కావాలా? ఐకూ-వన్‌ప్లస్ మధ్య ఈ తేడాలు తెలిస్తే అస్సలు వదలరు!

iQOO 15R vs OnePlus 15R: బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫోన్ కావాలా? ఐకూ-వన్‌ప్లస్ మధ్య ఈ తేడాలు తెలిస్తే అస్సలు వదలరు!
Advertisement

iQOO 15R vs OnePlus 15R: అత్యాధునిక ఫీచర్లు, హై క్వాలిటీ ఫొటోలు తీయగలిగే కెమెరా సెటప్ ఉన్న ఫోన్లను ఈ రోజుల్లో రూ.50వేల లోపు కొనాలంటే చాలా ఆప్షన్లు ఉన్నాయి. కానీ, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే వాల్యూ ఫ్లాగ్‌షిప్ విషయానికి వస్తే మాత్రం.. iQOO, OnePlus ముందు వరుసలో ఉంటాయి. తాజాగా మార్కెట్లోకి వచ్చిన iQOO 15R ఫోన్ OnePlus 15Rకి గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఈ రెండు ఫోన్లలో కెమెరా, బ్యాటరీ లైఫ్, ధర వంటి విషయాల్లో చాలా వ్యత్యాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గేమింగ్‌కు ఏది బెస్ట్?

iQOO 15R ఫోన్ 6.59 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. దీని 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. గేమ్స్ కోసం దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే OnePlus 15R మొబైల్ 6.83 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. గేమర్స్ కోసం ఇందులో ప్రత్యేకంగా 165Hz రిఫ్రెష్ రేట్, టచ్ రెస్పాన్స్ చిప్‌ను అందించారు. ఇది గేమింగ్ స్పీడ్‌ను పెంచి, మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్:

Advertisement

ఈ రెండు ఫోన్లలోనూ అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. అలాగే మల్టీటాస్కింగ్ కోసం 12GB వరకు RAM అందుబాటులో ఉంటుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. iQOO ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS 6పై రన్ అవుతుంది. ఇక OnePlus ఆక్సిజన్ OS 16తో నడుస్తుంది. ఈ రెండు కంపెనీలు కూడా 4 ఏళ్ల మేజర్ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇస్తున్నాయి.

Also Read: మళ్లీ రాదు ఈ అవకాశం.. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లపై ఊహించని రీతిలో ధర తగ్గింపు!

సెల్ఫీ కెమెరా హైలైట్:

Advertisement

iQOO 15Rలో 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. దీంతో 4K వీడియోలను రికార్డ్ చేయొచ్చు. అయితే వన్‌ప్లస్ 15R కెమెరా వెనుక కెమెరాతో 4K 120fps వీడియోలను షూట్ చేయొచ్చు. అంతేకాకుండా.. దీని సెల్ఫీ కెమెరాకు ఆటోఫోకస్ సపోర్ట్ ఉండటం మరో విశేషం.

బ్యాటరీ సామర్థ్యం:

ఇకపోతే బ్యాటరీ విషయంలో.. iQOO 15R ఫోన్ 7,600mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. వన్‌ప్లస్‌లో 7,400mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ మాత్రమే లభిస్తాయి. అలాగే దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం రెండి ఫోన్లలోనూ ఐపీ రేటింగ్స్ ఉన్నాయి.

బడ్జెట్‌ను బట్టి ఎంపిక:

మీ బడ్జెట్ రూ.45,000 లోపు ఉండి, ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ కావాలనుకుంటే iQOO 15R బేస్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు గేమింగ్ ఇష్టమైతే, అదిరిపోయే కెమెరా సెటప్ కావాలి అనుకుంటే.. వన్‌ప్లస్ 15R తీసుకోవడం ఉత్తమం. ఈ ఫోన్ ధర కూడా తక్కువే.

Also Read: వచ్చేసింది సరికొత్త పెన్సిల్ క్లీనర్.. నిమిషాల్లో మీ ఇళ్లంతా ఊడ్చి, తడిగుడ్డ పెట్టేస్తుంది!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×