Poxiao: మీరు ఎప్పుడైనా బియ్యం గింజ కంటే చిన్న పరికరం టెక్నాలజీ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తుందని ఊహించారా? అవును, చైనా శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని ఇప్పుడు సాధ్యం చేశారు! వారు సృష్టించిన ‘పోక్సియావో’ అనే సూపర్‌ఫాస్ట్ మైక్రో హార్డ్ డ్రైవ్, బియ్యం గింజ కంటే చిన్నదిగా ఉండటం విశేషం. అంతేకాదు ఇది వేగంలో మెరుపును మించిపోతుందని అంటున్నారు. ఈ చిన్న పరికరం సాంకేతిక రంగంలో ఒక సంచలనంగా మారింది. ఈ అద్భుత ఆవిష్కరణ గురించి మరింత తెలుసుకుందాం.
రెప్పపాటులో డేటా బదిలీ
మనం ఇప్పటివరకూ చూసిన హార్డ్ డ్రైవ్‌లు Mbps (మెగాబిట్స్ పర్ సెకండ్) లేదా Gbps (గిగాబిట్స్ పర్ సెకండ్) వేగంతో డేటాను బదిలీ చేసేవి. కానీ, పోక్సియావో ఈ స్థాయిని పూర్తిగా అధిగమించిందని చెప్పవచ్చు. ఈ చిన్న పరికరం కేవలం 400 పికోసెకన్లలో డేటాను ప్రాసెస్ చేయగలదు. ఒక పికోసెకండ్ అంటే? సెకనులో ట్రిలియన్ వంతు! అంటే, మనం కన్ను రెప్పవేసే సమయంలోనే ఈ పరికరం భారీ డేటాను ప్రాసెస్ చేస్తుంది. ఇది నిజంగా నమ్మశక్యం కాని వేగమని చెప్పవచ్చు.
హైటెక్ కంప్యూటింగ్‌లో గేమ్-ఛేంజర్
పోక్సియావోను నిజమైన శక్తి కృత్రిమ మేధస్సు (AI), భవిష్యత్ కంప్యూటింగ్ రంగాల్లో ఉపయోగించనున్నారు. ఈ AI సాధనాలు చిత్రాలను సృష్టించడం, వీడియోలను ఎడిట్ చేయడం, లేదా సంక్లిష్ట డేటాను విశ్లేషించడం వంటి పనులను కొన్ని సెకన్లలో చేస్తుంది. కానీ, పోక్సియావోతో ఈ పనులు రెప్పపాటు సమయంలో పూర్తవుతాయి.
Read Also: Viral Video: టాబ్లెట్‌ను తొక్కి, నేలపై విసిరేసిన కేంద్ర మంత్రి.. …
పెద్ద డేటా సెట్‌లు: భారీ డేటాను విశ్లేషించడంలో సమయం ఆదా
-మెషిన్ లెర్నింగ్: AI మోడల్స్‌ను వేగంగా శిక్షణ ఇవ్వడం
-శాస్త్రీయ పరిశోధన: సంక్లిష్ట గణనలను త్వరగా పూర్తి చేయడం.
-అంతరిక్ష మిషన్లు: రియల్-టైమ్ డేటా ప్రాసెసింగ్‌లో విప్లవం.
-ఈ చిన్న పరికరం AI-ఆధారిత టెక్నాలజీలను మరింత శక్తివంతం చేస్తూ, సాంకేతిక ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది.
ఏం ప్రత్యేకం ఈ పోక్సియావోలో?
-పరిమాణం: బియ్యం గింజ కంటే చిన్నది, చేతిలో సులభంగా సరిపోతుంది.
-వేగం: సాంప్రదాయ హార్డ్ డ్రైవ్‌ల కంటే మిలియన్ల రెట్లు వేగవంతం.
-AI సామర్థ్యం: కృత్రిమ మేధస్సు, డేటా ప్రాసెసింగ్‌లో అత్యంత ప్రయోజనకరం.
-శక్తి ఆదా: తక్కువ శక్తితో ఎక్కువ పని, ఇది పర్యావరణానికి కూడా మేలు.
భవిష్యత్తుకు ఒక అడుగు
చైనా శాస్త్రవేత్తలు పోక్సియావోతో సాంకేతిక రంగంలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ చిన్న హార్డ్ డ్రైవ్ కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు. ఇది భవిష్యత్ కంప్యూటింగ్, AI, డేటా నిల్వ రంగాలకు ఒక మంచి గిఫ్ట్ అని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ల నుంచి అంతరిక్ష నౌకల వరకూ, పోక్సియావో దాదాపు ప్రతి రంగంలో తన ప్రభావాన్ని చూపించబోతోంది. ఈ టెక్ విప్లవం భవిష్యత్తులో మరిన్ని మార్పులను తీసుకురానుంది. ఈ టెక్నాలజీ గురించి తెలిసిన పలువురు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.