E-Paper
Advertisement

Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు
Advertisement

Moin Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ప్రారంభం కాకముందే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కావ్య పాప కొనుగోలు చేసిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు మొయిన్ ఖాన్ ( Moin Khan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ( IPL) అంటేనే అవినీతి, బ్లాక్ మనీ దందా అంటూ బాంబు పేల్చారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( PSL ) ముందు ఐపీఎల్ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

Also Read: Pakistan-no ball: పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…క్రీజుకు అర మీట‌ర్ దూరంగా నో బాల్, అమీర్ పై ట్రోల్స్‌

PSL ముందు ఐపీఎల్ టోర్న‌మెంట్ దేనికి ప‌నికిరాదు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ప్రారంభం కంటే ముందు పాకిస్తాన్ సూపర్ లీగ్, ఐపీఎల్ టోర్నమెంట్ లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ప్రపంచంలోనే అత్యున్నత లీగ్ అంటూ వ్యాఖ్యానించారు మొయిన్ ఖాన్. ఈ టోర్నమెంట్ లో టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారని గుర్తు చేశారు. సైమ్ అయూబ్, ఫర్హాన్, షాహీన్ ఆఫ్రిది, రౌఫ్, ఫ‌ఖ‌ర్ జమాన్, సల్మాన్ అలీ లాంటి భయంకరమైన ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడుతున్నారని వెల్లడించారు.

బాబర్ ఆజం, రిజ్వాన్ లాంటి ప్లేయర్లు కూడా ఈ సీజన్ లో మంచి ఫామ్ లోకి వస్తారని అంచనా వేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అందరూ దొంగలే ఉంటారని బాంబు పేల్చారు. ఐపిఎల్ టోర్నమెంట్ అనేది కేవలం డబ్బులు సంపాదించకుండా దానికి మాత్రమే పనికి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు అందులో వినోదం ఏమాత్రం ఉండదని.. డబ్బుల కోసం మాత్రమే క్రికెట్ ఆడుతూ ఉంటారని మండి పడ్డారు. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ అత్యున్నత లీగ్ అంటూ వ్యాఖ్యానించారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్.

ఐపీఎల్ కంటే నిజంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ గొప్పదా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కంటే ముందు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ గొప్పదని పాకిస్తాన్ వాదిస్తున్న వాదన ఏమాత్రం సమంజసం కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ బ్రాండ్ విలువ కోట్లలలో ఉంటుంది. ఈ టోర్నమెంట్ జరిగితే ఐసీసీ కూడా ఇతర దేశాలకు ఎలాంటి టోర్నమెంట్లు నిర్వహించబోదు. అంతలా ప్రభావితం చేస్తుంది ఐపీఎల్. అలాగే కోట్లల్లో వ్యూయర్షిప్ ఐపీఎల్ కు వస్తుంది. ప్రకటనల ద్వారా కోట్లల్లో డబ్బులు చేతులు మారుతాయి. అలాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్… ఐపీఎల్ ముందే నాలుక గీసుకోవడానికి పనికిరాదని చెబుతున్నారు.

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×