E-Paper
Advertisement

Smart TVs Launch Feb 2026: కొత్త టీవీ కొనాలా? అయితే, కొద్దిరోజులు ఆగండి.. ఫిబ్రవరిలో వచ్చే సూపర్ మోడల్స్ ఇవే!

Smart TVs Launch Feb 2026: కొత్త టీవీ కొనాలా? అయితే, కొద్దిరోజులు ఆగండి.. ఫిబ్రవరిలో వచ్చే సూపర్ మోడల్స్ ఇవే!
Advertisement

Smart TVs Launch Feb 2026: కొత్త ఏడాదికి ఎలాగూ ప్లాన్లు వేసుకునే ఉంటారు.. మరి మీ ఇంటి హాల్‌లో ఉన్న ఆ పాత టీవీని కూడా మార్చే టైమ్ వచ్చేసిందనుకుంటున్నారా? అయితే ఈ ఫిబ్రవరి మీ కోసమే. ప్రస్తుత టెక్ యుగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ మాటే వినిపిస్తోంది. అదే ఏఐ మ్యాజిక్‌ను మీ ముందుకు తెచ్చేందుకు శాంసంగ్, టీసీఎల్, షియోమీ వంటి బడా కంపెనీలు సరికొత్త స్మార్ట్ టీవీలతో రెడీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో విడుదల కాన్న బిగ్ స్క్రీన్ టీవీలపై ఓ లుక్కేద్దాం రండి..

Samsung Neo QLED 8K

శాంసంగ్ అంటే క్వాలిటీకి మారుపేరు. ఈ ఫిబ్రవరిలో రాబోయే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ 8కే టీవీ విజువల్స్ సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోందని చెబుతున్నారు టెక్ నిపుణులు. దీనిలో ఉండే NQ8 AI ప్రాసెసర్ సాధారణ వీడియోలను కూడా 8కే క్లారిటీలోకి మార్చేస్తుంది. దాదాపు రూ.3,20,000 నుంచి ప్రారంభమయ్యే ఈ టీవీ.. లగ్జరీ, హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.

Advertisement

Also Read: తక్కువ ధరలో సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. BSNL తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ అదిరిపోయింది!

Xiaomi X Pro QLED

బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడంలో షియోమీ ఎప్పుడూ ముందుంటుంది. ఈసారి తన పాపులర్ ఎక్స్ ప్రో సిరీస్‌ను క్యూలెడ్ ప్యానల్‌తో అప్‌గ్రేడ్ చేస్తూ లాంచ్ చేస్తోంది. గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్‌తో వచ్చే ఈ టీవీ ధర సుమారు రూ.30,000 నుంచి రూ.60,000 లోపు ఉండవచ్చు. గేమ్స్ ఆడేవారి కోసం దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ వంటి స్పెషల్ ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం.

TCL Mini LED C72K Series

Advertisement

సీఎల్ తన మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో శాంసంగ్, సోనీ వంటి బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇస్తోంది. ఫిబ్రవరిలో లాంచ్ కానున్న కొత్త సిరీస్ అత్యధిక బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. లైటింగ్ ఎక్కువగా ఉండే రూముల్లో కూడా ఈ టీవీలోని విజువల్స్ ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. దీని ధర దాదాపు రూ.85,000 నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

Samsung The Frame

టీవీని కేవలం వినోదం కోసమే కాకుండా.. ఇంటికి ఒక డెకరేషన్‌లా చూసేవారి కోసం శాంసంగ్ కొత్త వెర్షన్‌ను తీసుకొస్తుంది. దీనిని ఆఫ్ చేసినప్పుడు ఓ అందమైన పెయింటింగ్‌లా కనిపిస్తుంది. కొత్త మ్యాట్ డిస్‌ప్లే వల్ల గదిలోని లైట్ల రిఫ్లెక్షన్ అస్సలు ఉండదు. దీని ధర సుమారు రూ.65,000 ఉండొచ్చు.

Redmi Smart Fire TV

తక్కువ ధరలో స్మార్ట్ హోమ్ అనుభూతిని పొందాలనుకునే వారి కోసం షియోమీ రెడ్‌మీ బ్రాండ్ కింద కొత్త ఫైర్ టీవీని లాంచ్ చేస్తోంది. ఇది కేవలం రూ.12,000 నుంచి రూ.25,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. బెడ్‌రూమ్స్ లేదా చిన్న గదుల కోసం పర్ఫెక్ట్ స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఫిబ్రవరిలో రాబోయే ఈ మోడల్ బాగా సెట్ అవుతుంది.

Also Read: 6500mAh బ్యాటరీ, ZEISS కెమెరాతో వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే?

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×