ప్రతి రోజూ రెండు సమయాలు గోల్డెన్ అవర్ గా చెప్పుకుంటారు. ఇవి ఉదయం సూర్యోదయం అయిన వెంటనే వచ్చే కొద్దిసేపు, అలాగే సాయంత్రం సూర్యాస్తమయం ముందు ఉండే సమయం. ఈ సమయంలో సూర్యకాంతి చాలా మృదువుగా, బంగారు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనికి గోల్డెన్ అవర్ అనే పేరు వచ్చింది. ఫోటోగ్రఫీకి ఇది ఉత్తమ సమయం. మన మనసు, ఆలోచనలకు కూడా ఎంతో ప్రభావం చూపే సమయంగా భావిస్తారు. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మనలోని ఆలోచనలు కూడా శాంతిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి తగ్గించే టైమ్
ఉదయం గోల్డెన్ అవర్ సమయంలో మనసు తాజాగా ఉంటుంది. నిద్ర నుంచి లేచిన తర్వాత మెదడు అలసట లేకుండా స్పష్టంగా పనిచేస్తుంది. ఆ సమయంలో ఆందోళనలు, భయాలు తక్కువగా ఉంటాయి. అలాగే సాయంత్రం గోల్డెన్ అవర్‌లో రోజంతా చేసిన పనుల తరువాత మనసు నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. ఈ రెండు సమయాల్లో మన శ్వాస, హృదయ స్పందనలు, ఆలోచనలు ఒక సమతుల్యతలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక శాస్త్రం ప్రకారం ఈ సమయంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి తగ్గుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారి, సానుకూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయి.
Also read: Tea and Coffee: ఉదయం తాగే కాఫీ లేదా టీ మీ చర్మాన్ని ముసలిగా మార్చేస్తుందా?
ఈ గోల్డెన్ అవర్ సమయంలోనే మానిఫెస్టేషన్ చేయడం మంచిదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మానిఫెస్టేషన్ అంటే మనకు కావాల్సిన లక్ష్యాన్ని స్పష్టంగా ఊహించుకోవడం, దాన్ని సాధించినట్టు మనసులో అనుభూతి చెందడం. ఉదాహరణకు మంచి ఆరోగ్యం, ఉద్యోగ విజయం, ఆర్థిక స్థిరత్వం లేదా కుటుంబ సంతోషం వంటి విషయాలను మనసులో స్పష్టంగా ఊహించాలి. ఈ సమయంలో మనసు చాలా శాంతంగా ఉండటం వల్ల ఆ ఆలోచనలు లోతుగా మనలో నిలిచిపోతాయని నమ్మకం. ఇది మంత్రంలా అదృష్టాన్ని మార్చేస్తుందని కాదు, కానీ మన ఆలోచనల దిశను మార్చడంలో మాత్రం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గోల్డెన్ అవర్లో చేయాల్సిన పనులు
గోల్డెన్ అవర్‌లో ప్రతిరోజూ కొద్దిసేపు మౌనంగా కూర్చొని, లోతుగా శ్వాస తీసుకుంటూ మన లక్ష్యాలను గుర్తు చేసుకుంటే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా రోజూ చేస్తే మన ఆలోచనలు సానుకూలంగా మారి, నిర్ణయాలు కూడా అదే దిశగా వస్తాయి. దీనివల్ల అవకాశాలను గుర్తించే శక్తి పెరుగుతుంది. అందుకే దీనిని అదృష్టం మారినట్టుగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఇది మన మనస్తత్వం, ఆలోచనా విధానం మారడం వల్ల వచ్చే ఫలితం. రోజువారీ జీవితంలో గోల్డెన్ అవర్‌ను సద్వినియోగం చేసుకుంటే మనసుకు శాంతి, జీవితం మీద స్పష్టత లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: Green peas Pulao: ఈ సీజన్లో దొరికే గ్రీన్ పీస్‌తో టేస్టీ పులావ్ రెసిపీ ఇదిగో