E-Paper
Advertisement

Ask Nandi – Kashi: AI యుగంలోకి వారణాసి – కాశిలో టెక్నాలజీ వాడకం చూస్తే మతి పోతుంది

Ask Nandi – Kashi: AI యుగంలోకి వారణాసి – కాశిలో టెక్నాలజీ వాడకం చూస్తే మతి పోతుంది
Advertisement

Ask Nandi – Kashi: ఏఐ యుగంలోకి అడుగుపెట్టింది కాశీ విశ్వనాథుడి ఆలయం. టెక్నాలజీ వాడకంతో భక్తులకు అధునాతమైన దర్శన సౌకర్యాలు కల్పించడంలో కాశీ టెంపుల్‌ బోర్డు ముందడుగు వేసింది. అందుకోసం అస్క్‌ నందిని (Ask Nandi) పేరుతో ఏఐ చాట్‌ బాత్‌ను తీసుకొచ్చింది. అసలు ఈ ఏఐ చాట్‌బాత్‌ ఏం చేస్తుంది. దీని వల్ల భక్తులు కలిగే సౌకర్యాలు ఏంటి..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా కాశీ పట్టణానికి విశిష్టమైన స్థానం ఉంది. హిందువుల ఆరాధ్య దైవం పరమశివుడు అక్కడ కాశీ విశ్వనాథుడిగా భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భక్తులు వారణాసి పట్టణాన్ని సందర్శించి ఆ కాశీ విశ్వేశ్వరుడి ఆశీస్సులు తీసుకుంటుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయంలో దర్శనం చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. ఇంకా సెలవు దినాల్లో అయితే భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది. దీంతో ఆలయ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ బోర్డు ఏఐ ఆధారిత చాట్‌ బాత్‌ను ప్రారంభించింది. దీనికి అస్క్‌ నందిని (Ask Nandi) అని పేరు పెట్టింది. ఈ అస్క్‌ నందిని వల్ల ఉపయోగాలు ఏంటి..? ఇది ఎలా పని చేస్తుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అస్క్‌ నందిని(Ask Nandi) అంటే ఏమిటి?:

Advertisement

అస్క్‌ నందిని (‘Ask Nandi’) అనేది కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) చాట్‌బాట్. ఇది రోజూ ఆలయాన్ని సందర్శించే వేలాది భక్తులకు తక్షణ సమాచారాన్ని అందిస్తుంది.

ఈ చాట్‌బాట్ ఏమి చేస్తుంది?:

దర్శన సమయాలు – ఉదయం, సాయంత్రం, ప్రత్యేక పర్వదినాల షెడ్యూల్, పూజలు & అభిషేకాలు – రుద్రాభిషేకం, మహా ఆర్తి, ప్రత్యేక పూజల వివరాలు, ఆన్‌లైన్ బుకింగ్స్ – పూజలు, దర్శనం టికెట్లు ఎలా బుక్ చేయాలి?, ఆలయ మార్గదర్శకం – గర్భగుడి, నంది మండపం, ప్రవేశ ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలు, సాధారణ ప్రశ్నలు – దుస్తుల నియమాలు, నిషేధిత వస్తువులు, భక్తుల సౌకర్యాలు లాంటి అన్ని వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు.

అస్క్‌ నందిని (‘Ask Nandi’) భక్తులకు కలిగే లాభాలు:

Advertisement

ఆలయంలో దర్శనానికి వెళ్లే భక్తులు ఇక నుంచి క్యూలో నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది. భక్తులకు సమయం ఆదా అవుతుంది. కొత్తగా వచ్చే భక్తులకు స్పష్టమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇంకా ఆలయ సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుంది.

ఎందుకు ఇది ముఖ్యమైన మార్పు?:

అస్క్‌ నందిని (‘Ask Nandi’)  కార్యక్రమం ద్వారా  భక్తికి సాంకేతికత పెరగడంతో ప్రతి భక్తునికి సులభమైన ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది. అలాగే భారతదేశంలోని ఆలయాలు కూడా Digital India దిశగా సాగుతున్నాయన్న స్పష్టమైన సంకేతం ఇది ఇస్తుంది. ఈ కాశీ విశ్వనాథ ఆలయం తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్తులో ఇతర ప్రధాన ఆలయాలకు కూడా ఆదర్శంగా నిలవనుంది.

ALSO READ: పన్నెండు రాశులకు పన్నెండు జ్యోతిర్లింగాలు – ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించుకోవాలో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×