E-Paper
Advertisement

Smartphone Cooling Tips: ఎండలకు మీ ఫోన్ సెగలు కక్కుతోందా? బ్యాటరీని చల్లబరిచే సింపుల్ టిప్స్ ఇవిగో!

Smartphone Cooling Tips: ఎండలకు మీ ఫోన్ సెగలు కక్కుతోందా? బ్యాటరీని చల్లబరిచే సింపుల్ టిప్స్ ఇవిగో!
Advertisement

Smartphone Cooling Tips: మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయట అడుగుపెడితేనే అల్లాడిపోయే పరిస్థితి. మనమే కాదు, మనం వాడే స్మార్ట్‌ఫోన్లు కూడా ఈ ఎండలకు విలవిలలాడిపోతున్నాయి. కాసేపు వాడినా లేదా ఛార్జింగ్ పెట్టినా ఫోన్ హీటెక్కిపోతోంది. ఫోన్ అతిగా వేడెక్కితే కేవలం పనితీరు తగ్గడమే కాదు, లోపల ఉన్న బ్యాటరీ ఉబ్బిపోవడం లేదా పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఈ వేసవిలో మీ ఫోన్‌ను కూల్‌గా ఉంచుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ గురించి తెలుసుకుందామా..

జేబులో పెట్టడం తగ్గించండి..

ఎండలో తిరుగుతున్నప్పుడు ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఉంచుకోవడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత కూడా దానికి తోడవుతుంది. దీనివల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఫోన్‌ను చేతిలో పట్టుకోవడం లేదా ఏదైనా బ్యాగ్‌లో ఉంచడం మంచిది.

నేరుగా ఎండ తగలకుండా చూడాలి..

Advertisement

మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు లేదా కారులో ఉన్నప్పుడు ఫోన్‌‌కు సూర్యరశ్మి నేరుగా తగిలేలా ఉంచుతుంటాం. ఇది చాలా ప్రమాదం. ఎండ నేరుగా తగిలితే ఫోన్ బాడీ త్వరగా వేడెక్కి డిస్‌ప్లే కూడా పాడయ్యే అవకాశం ఉంది. ఎప్పుడూ నీడ ఉన్న చోట లేదా చల్లని ప్రదేశంలో ఫోన్ ఉంచాలా.

కారులో వదిలి వెళ్లొద్దు..

చాలామంది కారు పార్క్ చేసి వెళ్లేటప్పుడు ఫోన్‌ను లోపలే మర్చిపోతుంటారు. ఎండలో నిలిపి ఉంచిన కారు లోపల ఉష్ణోగ్రత బయటి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి ఫోన్ శాశ్వతంగా పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే కారు దిగేటప్పుడు ఫోన్‌ను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

Advertisement

Also Read: ఇంటి సీలింగ్‌పై సినిమా హాల్.. పడుకుని ఎంచక్కా సినిమా చూడొచ్చు!

ఛార్జింగ్ పెట్టేటప్పుడు జాగ్రత్త..

ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టినప్పుడు సహజంగానే కొంత వేడి పుడుతుంది. అలాంటప్పుడు ఫోన్‌ను దిండు కింద లేదా దుప్పటి మీద పెట్టకండి. దీనివల్ల వేడి బయటికి వెళ్లలేక ఫోన్ ఓవర్‌హీట్ అయిపోతుంది. సో.. ఎప్పుడూ గట్టిగా, చల్లగా ఉండే నేల లేదా టేబుల్ మీద పెట్టి ఛార్జ్ చేయడం ఉత్తమం.

ఫోన్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి..

ఎక్కువ సేపు గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా ఫోన్ ప్రాసెసర్ మీద భారం పడి వేడెక్కుతుంది. అలాంటప్పుడు కాసేపు ఫోన్ పక్కన పెట్టేయండి. అవసరమైతే ఏరోప్లేన్ మోడ్‌లో పెడితే బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ ఆగిపోయి ఫోన్ త్వరగా చల్లబడుతుంది.

ఫ్రిడ్జ్‌లో మాత్రం పెట్టొద్దు..

ఫోన్ బాగా వేడెక్కిందని చాలామంది చేసే పొరపాటు.. దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్‌లో పెట్టడం. ఇలా చేయడం వల్ల లోపల తేమ చేరి సర్క్యూట్ పాడవుతుంది. ఫోన్ వేడెక్కితే కేస్ తీసేసి, ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది.

Also Read: రూ.30 వేలకే 4K స్మార్ట్ టీవీ.. అమెజాన్ సేల్‌లో టాప్-5 మోడల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×