E-Paper
Advertisement

Teacher Jobs: హైదరాబాద్‌లో టీచర్ ఉద్యోగాలు.. నెలకు రూ. 34,125 జీతం, విద్యార్హతలు ఇవే

Teacher Jobs: హైదరాబాద్‌లో టీచర్ ఉద్యోగాలు.. నెలకు రూ. 34,125 జీతం, విద్యార్హతలు ఇవే

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి వార్త.. హైదరాబాద్ మహా నగరంలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (AECS) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశాయి. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. బోధన రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ప్రధానంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT) సహా బల్వాటిక టీచర్ విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి.

వెకెన్సీ విభాగాలు:

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్

ప్రైమరీ టీచర్

బల్వాటక టీచర్

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంగ్లిష్, సోషల్ సైన్స్, హిందీ/సంస్కృతం వంటి సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్/ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్, జనరల్, తెలుగుతో పాటు మ్యూజిక్ టీచర్ పోస్టులు సైతం అందుబాటులో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 15వ తేదీని దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్, డిగ్రీ, పీజీ లేదా బీఈడీ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హత ఉన్న వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

వయస్సు: వయస్సు పరిమితిని 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి లెక్కించనున్నారు. సాధారణంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు లభిస్తుంది. మహిళా అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ఠ వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.

జీతం:  ఎంపికైన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు నెలకు రూ. 34,125 చొప్పున చెల్లిస్తారు. ప్రైమరీ టీచర్ లేదా బల్వాటిక టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 27,625 గౌరవ వేతనం అందుతుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించున్నారు. కేవలం రాత పరీక్షలు కాకుండా స్కిల్ టెస్ట్, డెమో టీచింగ్ క్లాస్ ఆధారంగా ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. బోధనా నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. అవసరమైన సర్టిఫికెట్లను అటాచ్ చేసి నిర్ణీత గడువులోగా కార్యాలయంలో అందజేయాలి.

గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. హైదరాబాద్ పరిధిలోని అటామిక్ ఎనర్జీ స్కూళ్లలో పని చేయడానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.aecshyd2.edu.in/

ALSO READ: Minister Vivek Venkataswamy: విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×