E-Paper
Advertisement

Summer CNG Car Tips: వేసవిలో CNG కార్లు వాడుతున్నారా? సేఫ్టీకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Summer CNG Car Tips: వేసవిలో CNG కార్లు వాడుతున్నారా? సేఫ్టీకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

Summer CNG Car Care Tips: సమ్మర్ లో కార్లపై వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా CNG కార్లు ఉపయోగించే వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి టుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల CNG గ్యాస్ ప్రెషర్ కు గురవుతుంది. ఈ నేపథ్యంలో ఇంజిన్‌ మీద కూడా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అందుకే, వేసవిలో CNG కారును సేఫ్ గా ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సమ్మర్ లో CNG కార్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

⦿ CNG కార్లకు సంబంధించి సమ్మర్ లో తీసుకోవాల్సిన నెంబర్ వన్ జాగ్రత్త కారును ఎప్పుడూ  ఎండలో పార్క్ చేయకూడదు. చెట్టు నీడలో లేదంటే గ్యారేజీలో కారును నిలిపి ఉంచితే క్యాబిన్ వేడి తగ్గుతుంది. CNG సిలిండర్‌ లో గ్యాస్ అధికంగా విస్తరించే ప్రమాదం తగ్గుతుంది.

Advertisement

⦿ సమ్మర్ లో CNG కారులో  గ్యాస్ నింపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ట్యాంక్‌ ను పూర్తిగా నింపేస్తారు. కానీ, సమ్మర్ లో ట్యాంక్‌ ను ఫుల్ చేయించకుండా సుమారు 2/3 వరకు మాత్రమే నింపడం మంచిది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గ్యాస్ విస్తరించడానికి ఇది కొంత స్థలం ఉండాలి.

⦿ అటు CNG సిలిండర్, పైపుల్లో లీకేజీలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పైపులలో ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఏదైనా వాసన వచ్చినా, లీక్ అయినట్లు అనుమానం వస్తే, వెంటనే మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్లడం మంచిది.

Advertisement

⦿ కారులో సర్టిఫైడ్ లేదంటే కంపెనీ అనుమతించిన CNG కిట్లను మాత్రమే ఉపయోగించాలి. మార్కెట్లో లభించే కొన్ని ఆఫ్టర్‌ మార్కెట్ కిట్లు ఎక్కువ వేడిని తట్టుకోలేకపోవచ్చు.

⦿ అటు కారు సర్వీసింగ్‌ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా స్పార్క్ ప్లగ్‌లు, ఇంజిన్ భాగాలను రెగ్యులర్ గా చెక్ చేయాలి.

⦿ ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. CNG ఇంజిన్ పెట్రోల్‌ తో పోలిస్తే కొద్దిగా ఎక్కువ వేడిగా పని చేస్తుంది. అందుకే కూలెంట్ లెవెల్ ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. కూలెంట్ లెవెల్ సరిపడా ఉందో? లేదో? చూసుకోవాలి. రేడియేటర్ ఫ్యాన్ సరిగా పనిచేస్తుందో? లేదో? కూడా చూడాలి.

⦿అటు టైర్లలో సరైన గాలి ప్రెజర్ ఉండటం కూడా చాలా అవసరం. ఎందుకంటే వేసవిలో వేడి కారణంగా టైర్ ప్రెజర్ మారవచ్చు. పరిమితికి మించి ఉంటే పేలిపోయే అవకాశం ఉంటుంది. తక్కువగా ఉంటే మైలేజ్ తగ్గుతుంది. అందుకే, కంపెనీ నిర్ణయించిన మేరకు ఎయిర్ ప్రెజర్ ఉండేలా చూసుకోవాలి.

కారు యజమానులు ఈ జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా CNG కారును సురక్షితంగా ఉంచుకోవచ్చు. హ్యాపీగా ప్రయాణాలను ఎంజాయ్ చెయ్యవచ్చు.

Read Also: టాటా To మారుతి.. మార్చి 2026 బెస్ట్ CNG కార్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×