E-Paper
Advertisement

Sony Bravia 3 II: ఓరినాయనో.. 100 ఇంచుల భారీ 4K టీవీ ఇంత తక్కువ ధరలోనా?

Sony Bravia 3 II: ఓరినాయనో.. 100 ఇంచుల భారీ 4K టీవీ ఇంత తక్కువ ధరలోనా?
Advertisement

Sony Bravia 3 II: ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని అందించేందుకు ప్రముఖ టెక్ సంస్థ సోనీ తమ సరికొత్త బ్రావియా ప్రొడక్టులను రంగంలోకి దించింది. ముఖ్యంగా బ్రావియా 3 II టీవీతో పాటు బ్రావియా థియేటర్ పేరుతో కొత్త ఆడియో లైనప్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. సామాన్యులకు సైతం హై క్వాలిటీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను దగ్గర చేయడమే లక్ష్యంగా వీటిని డిజైన్ చేసినట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు.

అద్భుతమైన సౌండ్ సిస్టమ్స్:

ఈ లైనప్‌లో ‘బ్రావియా థియేటర్ బార్ 7’ హైలైట్‌గా నిలుస్తోంది. దీనిలో తొమ్మిది స్పీకర్ యూనిట్లు ఉన్నాయి. ఇవి గది నలుమూలలా సౌండ్‌ని పంపిస్తూ అద్భుతమైన సౌండ్ అనుభూతిని ఇస్తాయి. అలాగే తక్కువ బడ్జెట్‌లో కావాలనుకునే వారి కోసం ‘బ్రావియా థియేటర్ బార్ 5’ను తీసుకొచ్చారు. ఇది స్పష్టమైన డైలాగులు, బేస్ అందించడంపై కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ రెండూ డాల్బీ అట్మాస్ వంటి అత్యాధునిక ఫీచర్లను సపోర్ట్ చేస్తాయి.

Advertisement

Also Read: రూ.30వేల లోపు బెస్ట్ ఏసీ కావాలా? వోల్టాస్, హిటాచీ, లాయిడ్లలో ఏది బెస్టో తెలుసుకోండిలా!

బేస్ అదిరిపోయేలా అదనపు స్పీకర్లు:

సౌండ్ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాలనుకునే వారి కోసం సోనీ సబ్ 9, సబ్ 8 అనే సబ్‌వూఫర్లను కూడా పరిచయం చేసింది. మొదటిసారిగా డ్యూయల్ సబ్‌వూఫర్ కాన్ఫిగరేషన్‌ను సోనీ దీనిలో అందుబాటులోకి తీసుకురావడం విశేషం. దీనివల్ల బేస్ చాలా లోతుగా, క్లారిటీగా వస్తుంది. ఇక బ్యాగ్రౌండ్ సౌండ్ కోసం రియర్ 9 స్పీకర్లను కూడా జత చేసుకోవచ్చు.

100 ఇంచుల భారీ స్క్రీన్:

Advertisement

ఆడియోతో పాటు విజువల్స్ కోసం 100 అంగుళాల వరకు ఉండే భారీ బ్రావియా 3 II టీవీని సోనీ లాంచ్ చేస్తోంది. దీనిలో వాడిన ఎక్స్ఆర్ ప్రాసెసర్ వల్ల రంగులు సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా గేమింగ్ ఇష్టపడే వారికి 4K 120Hz సపోర్ట్ దీనిలో ఉంది. దీంతోపాటు రిమోట్ పోతే వెతుక్కునేలా ‘రిమోట్ ఫైండర్’ అనే కొత్త ఫీచర్‌ను రిమోట్‌లో చేర్చారు.

ధర వివరాలు:

సింగపూర్ మార్కెట్లో ఈ ఏడాది మే నుంచి జూలై మధ్యలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ టీవీ ధర సుమారు రూ.93,000 నుంచి ప్రారంభమవుతుంది. సౌండ్‌బార్లు, స్పీకర్లు వాటి ఫీచర్లను బట్టి వేర్వేరు ధరల్లో లభిస్తాయి. భారత్‌లో వీటి లాంచ్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read: త్వరగా బరువు తగ్గాలంటే ఏ టైంలో వర్కౌట్స్ చేయాలి? ఉదయమా లేక సాయంత్రమా?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×