E-Paper
Advertisement

Commercial LPG Gas: రాష్ట్రాలకు మరో 20 శాతం ఎల్‌పీజీ కేటాయింపు.. హోటళ్లు, దాబాలకు ప్రాధాన్యత

Commercial LPG Gas: రాష్ట్రాలకు మరో 20 శాతం ఎల్‌పీజీ కేటాయింపు.. హోటళ్లు, దాబాలకు ప్రాధాన్యత
Advertisement

Commercial LPG Gas: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లు అట్టుడికిపోతున్నాయి.  మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయించనుంది. ప్రస్తుతం ఉన్న 50 శాతం కేటాయింపులకు అదనంగా మరో 20 శాతం పెంచింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగం 70 శాతానికి పెంచినట్లయ్యింది.

ఇరాన్ యుద్ధం.. రాష్ట్రాలకే కేంద్రం శుభవార్త

Advertisement

గల్ఫ్‌తోపాటు వివిధ దేశాల నుంచి చమురు రావడంతో కేంద్రం అలర్టయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు మరో 20 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయించింది. దీంతో హోటళ్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లు, డెయిరీలు, స్టీల్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, కెమికల్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో యథావిధిగా ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోనుంది.

అయితే అదనపు సరఫరాను పొందడానికి వాణిజ్య/పారిశ్రామిక వినియోగదారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లో నమోదు చేసుకోవాలనే నిబంధన విధించింది. పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఇంధన సంక్షోభ సమయంలో వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం కేంద్రం ప్రధాన ఉద్దేశం. కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

మరో 20 శాతం ఎల్‌పీజీ కేటాయింపు.. ఈసారి హోటళ్లు, దాబాలకు పరిశ్రమలకు ఊరట

ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నాలుగు వారాలుగా అంతరాయం నెలకొంది. దీనివల్ల గ్యాస్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. గృహ అవసరాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు హోటళ్లు, దాబాలు, పరిశ్రమలకు వాణిజ్య ఎల్‌పిజి సరఫరాను మొదట్లో తగ్గించింది.

ప్రభుత్వానికి పెట్రోలియం శాఖ కార్యదర్శి రాసిన లేఖ మేరకు.. ఇతర కీలక రంగాలకు మద్దతునిచ్చే ఉక్కు, ఆటోమొబైల్, వస్త్ర, రంగుల, రసాయనాలు, ప్లాస్టిక్‌ వంటి పరిశ్రమలకు వాణిజ్య ఎల్‌పిజి అదనపు కేటాయింపును ప్రాధాన్యత క్రమంలో ఇవ్వనున్నారు.

ALSO READ: అయోధ్యలో అద్భుతం.. లోక రక్షకుడికి లోక బాంధవుడి స్వర్ణ తిలకం

మార్చి 23 నాటికి వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల కేటాయింపును రాష్ట్రాలకు 50 శాతానికి పెంచింది పెంచింది కేంద్రం. అందులో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కమ్యూనిటీ కిచెన్లు, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెల్సిందే.

మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో గ్యాస్ సరఫరా ఒత్తిళ్లను తగ్గించడానికి వాణిజ్య సంస్థల కోసం పైపుల ద్వారా సహజ వాయువు ఇవ్వడాన్ని ప్రోత్సహించింది. సిటీలో గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ల కోసం వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ సమయంలో పెట్రోల్, డీజిల్ తగినంతగా అందుబాటులో ఉండేలా చూస్తోంది.  మొత్తానికి దేశంలో వివిధ రంగాలకు గ్యాస్ సమస్య లేకుండా వేగంగా అడుగులు వేస్తోంది.

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×