E-Paper
Advertisement

అలెక్సా సపోర్ట్‌తో సరికొత్త అమెజాన్ స్మార్ట్ స్పీకర్లు.. ఇక రూమ్‌లోకి రాగానే అన్నీ ఆటోమేటిక్!

అలెక్సా సపోర్ట్‌తో సరికొత్త అమెజాన్ స్మార్ట్ స్పీకర్లు.. ఇక రూమ్‌లోకి రాగానే అన్నీ ఆటోమేటిక్!
Advertisement

Amazon Echo Dot Max: స్మార్ట్ హోమ్ ప్రియుల కోసం అమెజాన్ రెండు సరికొత్త స్మార్ట్ స్పీకర్లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎకో డాట్ మాక్స్, ఎకో స్టూడియో పేరుతో లాంచ్ అయిన ఈ డివైజెస్ మెరుగైన ఆడియో నాణ్యతతో పాటు సరికొత్త అలెక్సా సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. ఇవి ఇంటిని మరింత స్మార్ట్‌గా మార్చేందుకు సరికొత్త టెక్నాలజీతో పనిచేస్తాయి.

ధర ఎంతంటే?

ధరల విషయానికి వస్తే ఎకో డాట్ మాక్స్ రూ.10,999కి లభిస్తుండగా.. ఎకో స్టూడియో ధర రూ.23,999గా ఉంది. ఇవి గ్రాఫైట్, గ్లేసియర్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతాయి. వీటిని వినియోగదారులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

మూడు రెట్లు ఎక్కువ బేస్:

Advertisement

ఎకో డాట్ మాక్స్ స్పీకర్‌లో ప్రత్యేకమైన వూఫర్, ట్వీటర్ అమర్చడం వల్ల మునుపటి మోడల్స్ కంటే మూడు రెట్లు ఎక్కువ బేస్ లభిస్తుంది. ఇక ఎకో స్టూడియో విషయానికి వస్తే.. ఇది డాల్బీ అట్మోస్ మరియు స్పేషియల్ ఆడియోతో వస్తుంది. ఇది గదిలోని వాతావరణానికి అనుగుణంగా శబ్దాన్ని సర్దుబాటు చేసి, థియేటర్ లాంటి ఫీలింగ్ ఇస్తుంది.

Also Read: టెక్ ప్రియులకు గోల్డెన్ ఛాన్స్.. Galaxy Z Fold 4పై ఏకంగా రూ.65వేలు తగ్గింది, స్టాక్ లిమిటెడ్ మావా!

అడ్వాన్స్‌డ్ స్మార్ట్ హోమ్ ఫీచర్లు:

Advertisement

రెండు స్పీకర్లలో ఒమ్నిసెన్స్ (Omnisense) అనే సరికొత్త టెక్నాలజీని వాడారు. ఇది గదిలో మనుషుల కదలికలను, ఉష్ణోగ్రతను గుర్తిస్తుంది. దీని ద్వారా గదిలోకి రాగానే లైట్లు, ఫ్యాన్లు లేదా ఏసీలు ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఎకో డాట్ మాక్స్‌లో జిగ్‌బీ, మ్యాటర్ వంటి ఇన్‌బిల్ట్ స్మార్ట్ హోమ్ హబ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హోమ్ థియేటర్ ఫీలింగ్:

ఈ స్పీకర్లు అమెజాన్ మ్యూజిక్, స్పాటుపైన, ఆపిల్ మ్యూజిక్, జియోసావన్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్‌ను సపోర్ట్ చేస్తాయి. వీటిని మన ఇంట్లోని ఫైర్ టీవీ స్టిక్‌తో కనెక్ట్ చేసుకుని హోమ్ థియేటర్‌గా కూడా మార్చుకోవచ్చు. అమెజాన్ కస్టమ్ ఏజెడ్3 (AZ3) సిలికాన్ చిప్‌తో ఇవి మరింత వేగంగా స్పందిస్తాయి.

Also Read: AI ఫీచర్లు, అమోలెడ్ డిస్‌ప్లే.. శాంసంగ్ కొత్త స్కెచ్.. Galaxy A27 5G లీకైన పూర్తి వివరాలివే!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×